కోటగిరి గోపాలరావు

కోటగిరి గోపాలరావు తెలుగు సినిమా ఎడిటర్. వీరి తమ్ముడు కోటగిరి వెంకటేశ్వరరావు కూడా సినీ ఎడిటర్.[1] అతను కోటగిరి ఫిలిం బ్యానర్ పై సినిమాలు నిర్మించాడు.

కోటగిరి గోపాలరావు తెలుగు సినిమా ఎడిటర్

జీవిత విశేషాలు

మార్చు

అతను కృష్ణా జిల్లా, నూజివీడుకు చెందినవాడు. వీరి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెండ్రు. వీరి పూర్వీకులు జమీందారు దగ్గర దీవాన్లుగా పనిచేసేవారు. అందుకు వారికి ఆస్తులు ఎక్కువగా ఉండేవి. వారి ఊరికి ఎవరు వచ్చినా వారి ఇంటిలోనే భోజనం చేసేవారు. అందుకే వారి ఇల్లు అతిథులతో కళకళలాడుతూ ఉండేది. అతని నాన్నగారి హయాంలో ఇంటిలో రాజభోగం. అతనిది విలాసవంతమైన బాల్యం. హఠాత్తుగా తన తండ్రి మరణించడంతో కుటుంబ భాద్యత పెద్దకుమారుడైన గోపాలరావుపై పడింది. అతను కుటుంబ పోషణార్థం వ్యవసాయం చేద్దామనుకున్నాడు. శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. కానీ ఏ పంటా కలసి రాలేదు. దాంతో ఏదైనా ఉద్యోగం చేద్దామని మద్రాసు వెళ్ళి జమీందారు గారిని కలిసాడు. జమీందారుకు ఎక్కడో ఒక స్టుడియో ఉండేది. దానిలో పని ఇప్పించాడు. అక్కడ అతను ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆదుర్తి సుబ్బారావు వంటి వారి సినీమాలకు ఎడిటింగ్ చేస్తూండేవాడు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పాటు మరో 10 మంది దగ్గర ఎడిటర్‌గా మారారు.

మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక కోటగిరి గోపాలరావు సోదరుడు వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేయకూడదనుకున్నారు. కానీ సోదరుడి బలవంతం కారణంగా, అతను మద్రాసులో తన సోదరుడితో చేరి సంపాదకుడిగా శిక్షణ పొందాడు. తన తమ్ముడు వెంకటేశ్వరరావుకు తన శిష్యుని వద్ద అప్రెంటిస్ గా చేర్చి గోపాలరావు ఎడిటింగ్ లో శిక్షణ యిప్పించాడు. కొన్నాళ్ల తరువాత అతనే ఎడిటింగ్ నేర్పించాడు. గోపాలరావు కె.రాఘవేంద్రరావు సినిమాలకు ఎక్కువగా ఎడిటింగ్ చేసేవాడు.

అతను 2012 నవంబరు 6న మరణించాడు.[2]

ఎడిట్ చేసిన సినిమాలు

మార్చు

నిర్మాత

మార్చు

మూలాలు

మార్చు
  1. "Kotagiri Gopala Rao". www.teluguone.com. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.
  2. "Kotagiri Gopala Rao Passed away-TeluguCinema" (in ఇండోనేషియన్). Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.
  3. "గండర గండడు - Andhra Bhoomi". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.

బయటి లింకులు

మార్చు