రామానగరం (చల్లపల్లి)
(రామానగరం(చల్లపల్లి) నుండి దారిమార్పు చెందింది)
రామానగరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామానగరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′53″N 80°35′13″E / 15.948122°N 80.586944°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చల్లపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ పుట్టి వీరాస్వామి |
పిన్ కోడ్ | 521 126 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
విద్యా సౌకర్యాలు
మార్చు- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014, ఆగస్టు-15వ తేదీనాడు, జాతిపిత మాహాత్మా గాంధీజీ మరియూ భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారల విగ్రహాల ఆవిష్కరణ నిర్వహించెదరు. రామానగరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయుచున్న ఈ విగ్రహాలను, ఘంటసాల మండలం చినకళ్ళేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సంఘసేవకురాలు శ్రీమతి గుత్తికొండ కోకిలాంబ సమకూర్చారు.
- శ్రీ నాగార్జున పబ్లిక్ స్కూల్ & విద్యాలయ.
- ఈ గ్రామంలో మూడు ప్రవేటు విద్యసంస్ధలు ఉన్నాయి.
సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుఆరవ నంబరు కాలువ (కె.యి.బి.కెనాల్ నుండి బ్రాంచ్).
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, శ్రీ సీతారాముల కళ్యాణం, ఘనంగా నిర్వహించెదరు. ఈ ఆలయం వద్ద దేవినవరాత్రులు ఘనంగా జరుగును.
- శ్రీ ఆంజనీయస్వామి దేవాలయం వద్ద వినాయకచవితి వేడుకలు అత్యంత వేడుకగా జరుగును.
ప్రముఖులు
మార్చుఈ గ్రామంలో రాజకీయప్రముఖులు శ్రీ మూల్పురి వేంకటేశ్యరరావు, శ్రీ లంకబాబు తదితరులు నివసిస్తున్నారు.
విశేషాలు
మార్చుఈ గ్రామంలో అన్ని సౌకర్యలు అందుబాటులో ఉండటం వలన మండలంలోనే అత్యత నివాసయోగ్యమైన గ్రామముగా గుర్తించబడింది.