రామాయణ విషవృక్షఖండన
రామాయణ విషవృక్షఖండన లేదా లత రామాయణం, తెన్నేటి హేమలత రచన. రంగనాయకమ్మ వ్రాసిన రామాయణవిషవృక్షానికి విమర్శ గ్రంధంగా ఈ పుస్తకం వ్రాసారు[1][2].
రచయిత(లు) | లత |
---|---|
దేశం | భారత్ |
భాష | తెలుగు |
శైలి | విమర్శ |
ప్రచురణ సంస్థ | 1977 |
విశేషాలు
మార్చువిశ్వనాథ సత్యనారాయణ 1962లో తానూ వ్రాసిన రామాయణం కు శ్రీమద్రామాయణకల్పవృక్షం అన్న పేరుతొ ప్రచురించారు, ఆకావ్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ 1974లో రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం (3 సంపుటాలు) వ్రాసారు అని చాలా మంది అనుకుంటారు కానీ, రంగనాయకమ్మ విశ్వనాధ వారి రామాయణాన్ని విమర్శిస్తూ రామాయణ విష వృక్షం వ్రాయలేదు. ఆయన కల్ప వృక్షం అని పేరు పెడితే రంగనాయకమ్మ తన విమర్శకు విష వృక్షం అని పేరు పెట్టారు తప్ప ఈ రెండిటికీ పెద్ద సంబంధం లేదు. రంగనాయకమ్మ వ్రాసిన విషవృక్షాన్ని ఖండిస్తూ, లత 1977లో రామాయణవిషవృక్ష ఖండన వ్రాసారు. ఈరెండు పుస్తకాలమీద హోరాహోరీ చర్చలు జరిగాయి. ఆనాటి ప్రముఖ రచయితలూ, పాఠకులూ ఇరుప్రక్కలా వాదించుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావు "వేదాల్లో ఏముంది", "రంగనాయకమ్మ రామాయణవిషవృక్షం-ఒక పరిశీలన" అన్నపేరుతో 1977లోనే మరో పుస్తకం ప్రచురించారు. ఇద్దరు రచయిత్రులు రాసిన రెండు పుస్తకాలు కారణంగా ఇంతమంది రచయితలూ, పాఠకులూ తీవ్రంగా వాదోపవాదాలు సాగించడం తెలుగుసాహిత్యంలో ఒక చారిత్రాత్మక సంఘటన.[3]
మూలాలు
మార్చు- ↑ TENNETI HEMALATA-An Invincible Force In Telugu Literature
- ↑ Literary career of tenneti hemalatha[permanent dead link]
- ↑ నిడదవోలు మాలతి (2011). నిడదవోలు మాలతి రచనలు సాహిత్య వ్యాసాలు. నిడదవోలు మాలతి. Retrieved 10 August 2015.