రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం కావలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 జూన్ 1964
కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి, శివరావమ్మ
జీవిత భాగస్వామి ఆదిలక్ష్మి
సంతానం బాల సాకేత్‌రెడ్డి, సంహిత

జననం, విద్యాభాస్యం

మార్చు

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 04 జూన్ 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కావలిలో రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి, శివరావమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కావలిలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు, జవహర్‌ భారతి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి చెన్నైలో బిటెక్ లో చేరి సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక బెంగళూరులో కాంట్రాక్టర్‌గా తన వ్యాపారాన్ని జీవితాన్ని ప్రారంభించి లయన్స్‌ క్లబ్‌లో చేరి పలు సేవా కార్యాక్రమాలు నిర్వహించాడు. ఆయన అనంతరం కావలి సమీపంలోని బోగోలు మండలం, కడనూతల గ్రామం వద్ద ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కావలి నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయి 2011లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2011లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేసి ఓడిపోయాడు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2019లో నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.