రామిశెట్టి విజయకృష్ణ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
శ్రీ రామిశెట్టి విజయకృష్ణ, ఐ.పి.ఎస్. అధికారి
మార్చుతిరువూరు గ్రామానికి చెందిన శ్రీ రామిశెట్టి విజయకృష్ణ, అసోంలో వీరోచిత పోరాటంతో ఉగ్రవాదుల చెర నుండి బందీలకు విముక్తి కల్పించిన ఐ.పి.ఎస్. అధికారి. 2013 నవంబరులో వీరు అసోంలోని తేజ్ పూరులో డి.ఐ.జి.గా పనిచేయుచున్నప్పుడు, "బోడో" తీవ్రవాదులు ఒక ప్రైవేటు సంస్థ మేనేజరును అపహరించారు. ఆయనను విడిచిపెట్టాలంటే, భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పాలని, జైలులో ఉన్న వారి (తీవ్రవాదుల) సహచరులను విడిచిపెట్టాలని షరతులు విధించారు. ఈ పరిస్థితులలో శ్రీ విజయకృష్ణ, స్వయంగా రంగంలోనికి దిగినారు. దట్టమైన అడవులలో తీవ్రవాదుల స్థావరాన్ని చుట్టుముట్టి, వీరోచితంగా పోరాడి బందీలను విడిపించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రవాదులను గూడా ఆయన మట్టుబెట్టినారు. ఆయన చేసిన ఈ సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసలనందుకున్నది. తరువాత వీరు కాలేయవ్యాధికి చికిత్స పొందుతూ, 2014 ఏప్రిల్ లో, చెన్నై లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూసినారు. వీరి అత్యుత్తమ సేవలకు గాను, కేంద్ర ప్రభుత్వం, 2014 వ సంవత్సరానికి పోలీసు పతకాన్ని వీరికి మరణానంతరం 2014, ఆగస్టు-15న ఇచ్చి, గౌరవించింది.[1]
మూలాలు
మార్చు- ↑ [ఈనాడు విజయవాడ; 2014, ఆగష్టు-16; 3వపేజీ]