తిరువూరు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, తిరువూరు మండలం లోని జనగణన పట్టణం

తిరువూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా లోని జనగణన పట్టణం. పిన్ కోడ్: 521 235., ఎస్.టి.డి.కోడ్ = 08673.

Tiruvuru
Tiruvuru is located in Andhra Pradesh
Tiruvuru
Tiruvuru
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 17°06′N 80°36′E / 17.100°N 80.600°E / 17.100; 80.600Coordinates: 17°06′N 80°36′E / 17.100°N 80.600°E / 17.100; 80.600
CountryIndia
StateAndhra Pradesh
DistrictKrishna
MandalTiruvuru
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంNagar Panchayat
 • ChairmanM.Krishna Kumari
 • Municipal commissionerK. Srikanth Reddy
విస్తీర్ణం
 • మొత్తం27.67 కి.మీ2 (10.68 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం76,731
 • సాంద్రత2,800/కి.మీ2 (7,200/చ. మై.)
Languages
 • OfficialTelugu
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521235
Telephone code+91–8673
వాహనాల నమోదు కోడ్AP–16
Sex ratiomale:female=1000:978 /
Literacy90.00%%
Lok Sabha constituencyVijayawada
Assembly constituencyTiruvuru (SC)

గ్రామ చరిత్రసవరించు

 
తిరువూరులో పంచముఖ ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయం
 
తిరువూరులో పంచముఖ ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయం

శ్రీ కృష్ణదేవరాయలు 1540 లో కొండపల్లి జైత్రయాత్రకి వెలుతూ దీన్ని దర్శించారు.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

నాలుగు శతాబ్దాలకు పూర్వం, ప్రస్తుత తిరువూరు, "లక్ష్మీపురం" అనే వ్యవహారనామంతో కొనసాగేది. రావు బహద్దూరు జమీందారుల పాలనలో ఉండేది. అప్పట్లో, అన్నాజీరావు దంపతులు, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్లబండిపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ అర్చకుడు, 16 కళలలో ప్రాణప్రతిష్ఠ చేసిన శఠగోపాన్ని వీరికి అందించారు. శఠగోపంతో తిరిగి వచ్చిన దంపతులు, తమ ఇంటిప్రక్క స్థలంలో, ఆలయాన్ని నిర్మించారు. శ్రీపతి, తిరుపతి నుండి రావటం వలన, "తిరు" అనీ, ఊరూరా శఠగోపం పూజలందుకోవడం వలన "వూరు" అనీ, వెరసి, "తిరువూరు"గా నామకరణం చేశారు. దీనితో, నాటి లక్ష్మీపురం, నేడు, "తిరువూరు" పేర కొనసాగుచున్నది. [2]

గ్రామ భౌగోళికంసవరించు

ఇది విజయవాడ నగరమునకు 74 కి.మీ ల దూర౦లొ ఉంది.ఇది దాని చుట్టు పక్కల వున్న 51 గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రము.సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30).[2]

సమీప గ్రామాలుసవరించు

అక్కపాలెం 4 కి.మీ, కోకిలపాడు 5 కి.మీ, ఆంజనేయపురం 5 కి.మీ రోలుపాడు; 7 కి.మీ, వావిలాల 9 కి.మీ,కొమ్మిరెడ్డిపల్లి 15కి. మీ, ముష్టికుంట్ల 12కి. మీ, వామకుంట్ల10కి. మీ, మునుకుళ్ళ4కి. మీ,వావిలాల 8 కి.మీ.[2]

సమీప మండలాలుసవరించు

పెనుబల్లి, కల్లూరు, గంపలగూడెం, ఎ.కొండూరు.[2]

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

తిరువూరు లో బస్సు డిపో కలదు, చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇక్కడ నుండి బస్సులు నడుస్తాయి. యెన్.హెచ్ 30 రోడ్ తిరువూరు మీదుగా వెళుతుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో మధిర (ఖమ్మం జిల్లా) 32 కిలోమీటర్లోస్ లో వుంది. మల్లెమడుగు, రామవరప్పాడు, విజయవాడ 73 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

 1. శ్రీ వాహిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీ
 2. నాగర్జున డిగ్రీ కళాశాల.
 3. ప్రతిభ కళాశాల.
 4. ప్రభుత్వ డిగ్రీ కళాశాల
 5. ప్రశాంతి డిగ్రీ కళాశాల
 6. సాయి డిగ్రీ కళాశాల
 7. శ్రీ లక్కినేని రామయ్య ప్రతిభ మోడల్ డిగ్రీ కళాశాల
 8. ప్రభుత్వ జూనియర్ కళాశాల,
 9. శ్రీ నిధి జూనియర్ కళాశాల
 10. నాగర్జున జునియర్ కళాశాల.
 11. అక్షర జూనియర్ కళాశాల

పాఠశాలలుసవరించు

 1. లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, తిరువూరు.
 2. భాష్యం సైంటిఫిక్ ఉన్నత పాఠశాల{EM}, తిరువూరు.
 3. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరువూరు
 4. శ్రీ నిధి -టెక్నో స్కూల్ {EM}, తిరువూరు.
 5. శ్రీ చైతన్య -టెక్నో స్కూల్{EM}, తిరువూరు.
 6. ప్రశాంతి విద్యానికేతన్, తిరువూరు.
 7. నోబుల్ ఉన్నత పాఠశాల, తిరువూరు.
 8. నాగార్జున మెరిట్ పాఠశాల{EM}, తిరువూరు.
 9. సెయింట్.ఆన్స్ స్కూల్ {EM}, తిరువూరు.
 10. శ్రీ నిధి టెక్నొ స్కూల్ (E.M); tiruvru.
 11. ఆంధ ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల.
 12. విజయ బాల నికేతన్ ఉన్నత పాఠశాల
 13. సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

వైద్య సదుపాయలుసవరించు

1.కల్యాణి నర్సింగ్ హొమ్ - (బొసు బొమ్మ సెంటర్-తిరువూరు).

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

మల్లమ్మ చెరువు:- చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు పథకం క్రింద, 2015,ఆగస్టు-14వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువులోని సారవంతమైన మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]

నగర పంచాయతీసవరించు

 1. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనందు రెండవ పెద్ద గ్రామపంచాయితి.
 2. 2011 సం.లో తిరువూరు పురపాలక సంఘంగా ఏర్పడింది. 2011 సం.నకు మొత్తము జనాభా సుమారు 50,000. మొత్తము వార్డులు 20. వార్షిక ఆదాయము సుమారు 90 లక్షలు.

తిరువూరులోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

 • శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, శాంతి నగర్
 • శ్రీ రామాలయం, నడిమ తిరువూరు
 • శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, పాతూరు.
 • శ్రీ అయ్యప్పస్వామి సహిత శ్రీ పంచముఖ హనుమత్ క్షేత్రం, బైపాస్ రోడ్:- ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా, 2015,నవంబరు-5వ తేదీ గురువారంనాడు, ఈ క్షేత్రంలో నెలకొన్న 58 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహానికి విద్యుత్తు మోటార్లద్వారా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదలను అందజేసినారు. [5]
 • శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, నడిమ తిరువూరు
 • శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, బస్సు స్టాండ్ సెంటర్ (ప్రధాన అర్చకులు : భవాని రాధాకృష్ణ)
 • పాత శివాలయం, నడిమ తిరువూరు
 • శ్రీ వినాయకస్వామివారి ఆలయం, బైపాస్ రోడ్
 • శ్రీ అష్టలక్ష్మి ఆలయం, రాజుపేట
 • శ్రీ రంగానాయక స్వామి వారి ఆలయం, పాతూరు
 • శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, బస్సు స్టాండ్ సెంటర్
 • శ్రీ శ్యామవేది మందిరం, చీరాల సెంటర్ దగ్గర.
 • శ్రీ సీతా రామస్వామి వారి ఆలయం, పాతూరు.

శ్రీ వెంకటాచలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో పెద్ద జియ్యరు స్వామి ప్రతిష్ఠించిన శ్రీరామ క్రతువు స్థూపం, 60వ వార్షికోత్సవం, 2020,నవంబరు-6వతేదీ శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించినారు.[7]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
 2. 2.0 2.1 2.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-11. Retrieved 2016-06-16.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-10, 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,ఆగస్టు-15; 15వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-15; 15వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,నవంబరు-6; 16వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2016,మే-3; 11వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,నవంబరు-6; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తిరువూరు&oldid=3380793" నుండి వెలికితీశారు