రామెన్ దేక
రామెన్ దేక అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో మంగళ్‌దోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1] 2024 జులై 27న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితుడై 2024 జులై 31 నుండి అధికారంలో కొనసాగుచున్నారు.[2][3]
రామెన్ దేక | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
మంగళదోయ్ నియోజకవర్గం | |||
పదవీ కాలం 16 మే 2009 – 23 మే 2019 | |||
ముందు | నారాయణ్ చంద్ర బోర్కటకీ | ||
---|---|---|---|
తరువాత | దిలీప్ సైకియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సువాల్కుచి, అస్సాం, భారతదేశం | 1954 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | సురేంద్రనాథ్ దేక | ||
జీవిత భాగస్వామి | రాణీ దేకాకకోటి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | గౌహతి యూనివర్సిటీ (బి.ఏ (ఫిలాసఫీ & ఎకనామిక్స్)) |
జననం, విద్యాభాస్యం
మార్చురామెన్ దేక 1954 మార్చి 1 లో అసోం లోని సువాల్కుచిలో జన్మించాడు. అతను అసోం విశ్వ విద్యాలయంలో బీఏ పూర్తి చేశాడు. రామెన్ విద్యార్థి దశలో 1972లో ఏబివిపి పూర్వాంచల్ జనరల్ సెక్రటరీగా, హోల్ సేల్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, 1974 -75 వరకు గౌహతి విశ్వవిద్యాలయం కోర్ట్ మెంబర్‌గా, 1979లో అసోం సాహిత్య సభకు కల్చరర్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేశాడు.
రాజకీయ జీవితం
మార్చురామెన్ దేక చదువు పూర్తికాగానే జనతాపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977లో అసోం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. జనతాపార్టీలో భారతీయ జనతా పార్టీగా మారిన తరువాత ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా ఉన్నాడు.
నిర్వహించిన పదవులు
మార్చు- 1977 లో అసోం జనతాపార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
- 1980 లో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు
- 2005లో బీజేపీ అధికార ప్రతినిధి
- బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, అసోం బీజేపీ ఉపాధ్యక్షుడిగా, బిజెపి ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేషన్ కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు.
- 2006 లో బీజేపీ అసోం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు
- 2009లో అసోంఅసోంలోని మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు.
- 2009 ఆగస్టు 31 నుంచి 2014 మే వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
- 2010 మే 1 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో సభ్యుడు
- కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
- 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగలదోయ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
- 2014 జూన్ 9 నుంచి లోక్ సభ ప్యానల్ చైర్ పర్సన్స్ లో సభ్యుడు
- 2014 ఆగస్టు 14 నుంచి ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యుడు
- 2014 సెప్టెంబరు 1 కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడు
- విదేశాంగ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
- ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కేంద్ర అడ్వైజరీ కమిటీలో సభ్యుడు
- 2015 జనవరి 29 నుంచి సాధారణ ప్రయోజనాల కమిటీలో కమిటీలో సభ్యుడు
- జులై 3, 2015 నుంచి ఎస్టిమేట్స్ కమిటీ, సబ్ కమిటీ -II లో కమిటీలో సభ్యుడు[4]
మూలాలు
మార్చు- ↑ Lok Sabha (2014). "Ramen Deka". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ "Press Trust Of India". www.ptinews.com. Retrieved 2024-09-08.
- ↑ "Ramen Deka appointed CG Guv". The Times of India. 2024-07-29. ISSN 0971-8257. Retrieved 2024-09-08.
- ↑ The Times of India (2018). "RAMEN DEKA : Bio, Political life, Family & Top stories". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.