ఛత్తీస్‌గఢ్ గవర్నర్ల జాబితా
ఛత్తీస్‌గఢ్ గవర్నరు, భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్. 2000లో నవంబరులో మధ్య ప్రదేశ్ విభజన ఫలితంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది.అప్పటినుండి ఛత్తీస్‌గఢ్ గవర్నర్ పదవి ఉనికిలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2000 - 2003 మధ్య పనిచేసిన దినేష్ నందన్ సహాయ్ మొదటి గవర్నరు. ప్రస్తుత గవర్నరు రామెన్ దేకా 2024 జూలై 31 నుండి ఛత్తీస్‌గఢ్ గవర్నరుగా పదవిలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్ (రాయ్‌పూర్) |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | ఐదు సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | డి.ఎన్ సహాయ్ |
నిర్మాణం | 1 నవంబరు 2000 |
అధికారాలు, విధులు
మార్చుగవర్నరుకు అనేక రకాల అధికారాల ఉంటాయి:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
- విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.
గవర్నర్లుగా పనిచేసినవారి జాబితా
మార్చువ.సంఖ్య | పేరు (జననం – మరణం) |
చిత్తరువు | స్వరాష్ట్రం | పదవీకాలం | దీనికి ముందు చేపట్టిన పదవి | నియమించినవారు | ||
---|---|---|---|---|---|---|---|---|
నుండి | వరకు | పదవీకాల సమయం | ||||||
1 | దినేష్ నందన్ సహాయ్[1] | బీహార్ | 2000 నవంబరు 1 | 2003 జూన్ 1 | 2 సంవత్సరాలు, 212 రోజులు | బీహార్ పోలీస్ డైరెక్టర్ జనరల్ | కె. ఆర్. నారాయణన్ (రాష్ట్రపతి) | |
2 | కృష్ణ మోహన్ సేఠ్ | ఉత్తర ప్రదేశ్ | 2003 జూన్ 2 | 2007 జనవరి 25 | 3 సంవత్సరాలు, 237 రోజులు | త్రిపుర గవర్నరు | ఎ.పి.జె.అబ్దుల్ కలాం (రాష్ట్రపతి) | |
3 | ఈ. ఎస్. ఎల్. నరసింహన్[2] | తమిళనాడు | 2007 జనవరి 25 | 2010 జనవరి 23 | 2 సంవత్సరాలు, 362 రోజులు | ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ | ||
4 | శేఖర్ దత్ | అసోం | 2010 జనవరి 23 | 2014 జూన్ 19[3] | 4 సంవత్సరాలు, 147 రోజులు | డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ | ప్రతిభా పాటిల్ (రాష్ట్రపతి) | |
– | రామ్ నరేష్ యాదవ్ | ఉత్తర ప్రదేశ్ | 2014 జూన్ 19 | 2014 జూలై 14 | 25 రోజులు | మధ్యప్రదేశ్ గవర్నరు
(కొనసాగారు) |
ప్రణబ్ ముఖర్జీ (రాష్ట్రపతి) | |
5 | బలరామ్ దాస్ టాండన్ (1927–2018) |
పంజాబ్ | 2014 జూలై 18 | 2018 ఆగస్టు 14 [†] |
4 సంవత్సరాలు, 27 రోజులు | క్యాబినెట్ మంత్రి, పంజాబ్ (2002 వరకు) | ||
– | ఆనందీబెన్ పటేల్ (అదనపు బాధ్యత) | గుజరాత్ | 2018 ఆగస్టు 15[4] | 2019 జూలై 28 | 347 రోజులు | మధ్యప్రదేశ్ గవర్నరు (పదవిలో కొనసాగారు) | రామ్‌నాథ్ కోవింద్ (రాష్ట్రపతి) | |
6 | అనుసూయ ఉయికే[5] | మధ్య ప్రదేశ్ | 2019 జూలై 29 | 2023 ఫిబ్రవరి 22 | 3 సంవత్సరాలు, 208 రోజులు | వైస్-ఛైర్‌పర్సన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ | ||
7 | బిశ్వభూషణ్ హరిచందన్[6] | ఒడిశా | 2023 ఫిబ్రవరి 23 | 2024 జూలై 30 | 1 సంవత్సరం, 158 రోజులు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ | ద్రౌపది ముర్ము (రాష్ట్రపతి) | |
8 | రామెన్ దేక[7] | అసోం | 2024 జూలై 31 | అధికారంలో ఉన్నారు | 103 రోజులు | పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The Economic Times (29 January 2018). "Chhattisgarh's first governor D N Sahay passes away". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ "Former IB chief Narasimhan sworn in Chhattisgarh governor". Indo Asian News Service. 25 January 2007. Archived from the original on 27 September 2007. Retrieved 13 February 2007.
- ↑ India TV (19 June 2014). "Chhattisgarh Governor Shekhar Dutt quits". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ "Anandiben Patel to hold additional charge as Chhattisgarh Governor". 14 August 2018. Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ India Today (17 July 2019). "Senior tribal BJP leader Anusuiya Uikey appointed as Chhattisgarh Governor". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ NTV Telugu (23 February 2023). "ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణం". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ "Ramen Deka sworn in as Chhattisgarh Governor - The Hindu". web.archive.org. 2024-09-08. Archived from the original on 2024-09-08. Retrieved 2024-09-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)