రాయన గిరిధర్ గౌడ్
రాయన గిరిధర్ గౌడ్ 1965 - ఆంధ్రప్రదేశ్ లో తెనాలికి 20 కి.మీ. దూరంలో తపాలా కార్యాలయం కూడా లేని మారుమూల పల్లెటూరు గరువుపాలెంలో చిత్రకళా సృజన చేస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చిత్రకారుడు. ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన చిత్రకారుడు.
రాయన గిరిధర్ గౌడ్ | |
---|---|
జననం | రాయన గిరిధర్ గౌడ్ 1965 గుంటూరు , గూడవల్లి |
ఇతర పేర్లు | గిరిధర్ గౌడ్ |
ప్రసిద్ధి | సుప్రసిద్ద ఛిత్రకారుడు |
తండ్రి | రాధాకృష్ణమూర్తి |
తల్లి | మునెమ్మ |
జీవిత విశేషాలు
మార్చురాయన గిరిధర్ గౌడ్ 1965 న గుంటూరు జిల్లా, గూడవల్లి గ్రామంలో ఒక తెలుగు పండితుడు కుటుంబంలో జన్మించారు. అడవి బాపిరాజు శిష్యుడు అయిన దివి సుబ్బరాయశాస్తి చిత్రకళలో ఓనమాలు దిద్దారు. గిరిధర్ చిత్రకళపై ఆసక్తి గమనించిన తండ్రి మైసూరులోని చామరాజేంద్ర ఆర్టు కాలేజిలో మొదటి బ్యాచ్లో బి.ఎఫ్.ఎ.లో చేర్చాడు. తర్వాత రాజస్థాన్ వెళ్లి బనస్థలి విద్యాపీఠంలో జైపూర్, ఇటాలియన్ కుడ్య చిత్రాల మీద సాంకేతిక శిక్షణ పొందాడు. ఈ సమయంలో వాడిన సహజ వనరులు, అవి వాడే మాధ్యమం, తయారీ విధానం తన మినియేచర్ చిత్రకళకు ఎంతో దోహదపడ్డాయి. రాజస్థాన్లో వనస్థలి విద్యాపీఠా విశ్వవద్యాలయంలో మ్యూరల్ కోర్సు, జయపురి ఫ్రెస్కో, ఇటాలియన్ ఫ్రెస్కో, సాంకేతిక విద్యలో మెళకువలు నేర్చుకొన్నాడు. తర్వాత జయపూర్, ఉదయ్ఫుడ్, బోధ్ పూర్, శోభవటి, జైసల్ మీర్, సాలార్జింగ్ మ్యూజియంలోనున్న మినియేచర్ చిత్రాలు చూసి మినియేచర్స్ చిత్ర రచనకు సోపానాలుగా మార్చుకున్నాడు. తర్వాత బరోడా వెళ్లి ఎం.ఎన్. విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎఫ్.ఎ. చేశాడు. అక్కడ విభాగ అధిపతిగా నున్న గులాం మహమ్మద్ షేక్ వద్ద కుడ్య చిత్రకళలో ప్రత్యేక శిక్షణ పొందాడు. పెద్ద చిత్రాలు నిర్భీతితో వేయడానికి ఇది దోహదపడింది. తర్వాత అనంతపురం జిల్లాలోని లేపాక్షి చిత్రాలను, అక్కడి చిత్రకారులు అనుసరించిన విధానాల్ని లోతుగా పరిశీలన చేశాడు.
కృష్ణా జిల్లా ఆత్మకూరు వాస్తవ్యులు కుదరవల్లి రాజారావు ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన చూసి స్పూర్తి పొంది వృషభ-1 సిరీస్లో 125, వృషభ-2లో 83, వృషభ-3లో 83 చిత్రాలు గీశాడు. అదే విధంగా పోతన భాగవతం ఋతువర్ణనపై వర్ణ చిత్రాలు, తల్లీ బిడ్డల సిరీస్లో బిడ్డగా గణేశుడు, తల్లి దండ్రులుగా శివపార్వతులు ఇందులో ప్రధాన పాత్రధారులు, పౌరాణిక ప్రధాన లక్షణాలకు విరుద్ధంగా, ఇప్పటి తల్లీ బిడ్డల్ని ఆధునిక రీతుల్లో భంగిమలు, బిడ్డల్ని చూపించడం ఈ చిత్రాల ప్రత్యేకత. దేవతలు కూడా రాగద్వేషాలకు, ప్రేమ, మమతల వంటి మానవ సహజభావాలకు వారు అతీతం కాదు అన్నీ ఊహతోనే తల్లిబిడ్డలు సిరీస్ చేశాడు.
చిత్రరచనా శైలి
మార్చుతల్లీ బిడ్డల సిరీస్లో బిడ్డగా గణేశుడు, తల్లి దండ్రులుగా శివపార్వతులు ఇందులో ప్రధాన పాత్రధారులు, పౌరాణిక ప్రధాన లక్షణాలకు విరుద్ధంగా, ఇప్పటి తల్లీ బిడ్డల్ని ఆధునిక రీతుల్లో భంగిమలు, బిడ్డల్ని చూపించడం ఈ చిత్రాల ప్రత్యేకత. దేవతలు కూడా రాగద్వేషాలకు, ప్రేమ, మమతల వంటి మానవ సహజభావాలకు వారు అతీతం కాదు అన్నీ ఊహతోనే తల్లిబిడ్డలు సిరీస్ చేశాడు. మినీయేచర్ చిత్రాలపై ఎంతో కృషి చేశాడు.
గిరిధర్ చిత్రాలన్నీ దేనికదే ఒక ప్రత్యేకత కల్గి వుంటుంది. ఏ చిత్రం మరో చిత్రంతో సంబంధం వుండదు. ఆ చిత్రాల్లో లాలిత్యం కంటే గంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ. సునిశిత పరిశీలన, పట్టుదల, కృషి, రాజీపడకపోవడం అతన్నీ స్థానంలో నిలిపాయి. రిబ్రాంట్ లా వ్యాపార ఆసక్తితో కాక, తృప్తి కోసం చిత్రరచన చేస్తున్నారు. ఒకే విధమైన ముద్ర పడకుండా, వివిధ విషయాలి, అనేక అంశాల్ని సృజిస్తూ, వేర్వేరు మాధ్యమాల్లో అవిశ్రాంతంగా కృషి కొనసాగించడం ఆయన ప్రత్యేకత! ఆయన దృక్పధంలో రంగు అనేది ఒక ఆయుధం, ఒక సౌకర్యం. బసోలి స్కూల్ ప్రభావం వీరి రంగుల మేళవింపులో ఎక్కువగా వుంటుంది. సొంతంగా బ్రష్లు, రంగులు తయారు చేసుకోవడం ఈయన ప్రత్యేకత.
అవార్డులు
మార్చు- 2013 లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం
- 2016 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం
- 2019 లో విభో కందాలం ఫౌండేషన్ ‘సరి లేరు నీ కెవ్వరు' విశిష్ట చిత్రరచనా పురస్కారం
మూలాలు
మార్చు- Courtesy with Surya Telugu daily news paper 04 jan 2013.