రాయప్రోలు సుబ్బరామయ్య


రాయప్రోలు సుబ్బరామయ్య ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం, వేములకోట గ్రామంలో 1925 లో జన్మించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసాడు.

ఇతను "రాసురామ" అను కలం పేరుతో రచనలు చేశాడు. విక్రమ ఘటోత్కచ(శశిరేఖాపరిణయం)అనే నాటకం రాసాడు. నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించాడు. అష్టావధానం కూడా చేశారు. యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతిజ్ఞ వీరి ఇతర రచనలు. అనేక సన్మానాలు సత్కారాలు పొందాడు.

రాయప్రోలు సుబ్బరామయ్య ధర్మపత్ని కోటమ్మ. వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర శర్మ హార్మోనియం వాద్యకారునిగా ప్రతిభ చాటగా, రెండవ కుమారుడు వేంకటేశ్వర్లు గాత్ర సంగీతంలో పేరు గాంచారు.

రాయప్రోలు సుబ్బరామయ్య 1986లో మరణించారు.వీరి ధర్మపత్ని కోటమ్మ (పద్మావతమ్మ) 28-5-2020 తేదీన స్వర్గస్తులైనారు.