రావిపాటి లక్ష్మీనారాయణ

రావిపాటి లక్ష్మీనారాయణ (1909-1970) కవితా కోవిద, ఉభయ కవి శేఖర బిరుదాంకితులైన తెలుగు కవి .

రావిపాటి లక్ష్మీనారాయణ - సుందరమ్మ దంపతులు

బాల్యం - ఉద్యోగం - వివాహం మార్చు

రావిపాటి లక్ష్మీనారాయణ 1909వ సంవత్సరంలో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని రావిపాడు అనే చిన్న గ్రామంలో చలమయ్య, పిచ్చమ్మ దంపతులకు జన్మించాడు. అతను తన నలుగురు సహోదరులలో రెండవవాడు. నరసరావుపేటలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివి న్యాయశాఖలో ఉద్యోగంలో చేరాడు. అప్పటి గుంటూరు జిల్లాలోని ఒంగోలు, తెనాలి, నరసరావుపేట, గురజాల తదితర ప్రాంతాల్లో పనిచేసి సబ్ కోర్టులో శిరస్తాదార్‌గా పదవీ విరమణ చేశాడు. అతని సతీమణి పేరు సుందరమ్మ .

సాహిత్య ప్రస్థానం మార్చు

చాలా చిన్న వయస్సు లోనే కవిత్వం లో ప్రావీణ్యం సంపాదించాడు . తెలుగు, సంస్కృత భాషల్లో లో చాలా లోతైన పరిజ్ఞానం కలిగి ఆ వయస్సులోనే అతను - నిర్వచన భారత గర్భ రామాయణం[1] అనే ద్వ్యర్థి కావ్యాన్ని రచించడం ద్వారా గొప్ప సాహిత్య ఔన్నత్యాన్ని సాధించాడు. ఇది సాహిత్యం లోనే అద్భుత ప్రక్రియ. ఇది అతని రచనలలో తలమానికముగా పరిగణించబడుతుంది. ఈ పుస్తకంలోని పద్యాలు భారతకథను సూచిస్తూనే అంతర్గతంగా రామాయణాన్ని కూడా అన్వయించే విధముగా వుంటాయి. ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో అధునాతన పరిశోధన కోసం, డాక్టరల్ థీసిస్ కోసం తప్పక చదవవలసినదిగా పరిగణించబడుతుంది. వీరి ఇతర రచనలు - సర్వేశ్వర శతకము, [2], మాచర్ల చెన్న కేశవ శతకము , పల్నాటి చరిత్ర [చరిత్ర] [3], సమస్యాపూరణము. అతని పల్నాటి చరిత్ర సరళమైన వచన రచన.

నిరాడంబరజీవి మార్చు

సమకాలిక కవులలో గుర్తింపు ఉన్నప్పటికీ ఎటువంటి కీర్తి ప్రతిష్టాలకోసం వెంపరలాడిన వ్యక్తి కాదు. వీరు నరసరావుపేటలో స్థిరపడి 1970 లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. నిర్వచన భారతగర్భ రామాయణము, 1933 ముద్రణ ప్రతి ఆర్కీవులో పూర్తి పుస్తకం.[1]
  2. సర్వేశ్వర శతకము, 1935 ముద్రణ ప్రతి, ఆర్కీవులో పూర్తి పుస్తకం.[2]
  3. 1953 ముద్రణ ప్రతి, ఆర్కీవులో పూర్తి పుస్తకం.[3]