రాష్ట్రపతి పోలీసు పతకం

రాష్ట్రపతి పోలీసు పతకం అనేది భారతదేశంలో చట్టాన్ని అమలు చేసే సభ్యులకు అందించే పురస్కారం. 1951 మార్చి 1 న స్థాపించిన ఈ పతకాన్ని మొదట ప్రెసిడెంట్స్ పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ మెడల్ అని పిలిచేవారు. పతకం శౌర్య ప్రదర్శనకు, విశిష్ట సేవకూ ఇస్తారు. ఈ రెంతి లోనూ శౌర్య పతకానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన, స్వాతంత్ర్య దినోత్సవాన ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు.

రాష్ట్రపతి పోలీసు పతకం (పోలీసులకిచ్చే అతున్నత పురస్కారం)

Ribbon for gallantry

Ribbon for distinguished service
Typeపోలీసు పతకం
దేశం భారతదేశం
అందజేసినవారురాష్ట్రపతి
Post-nominalsPPMG (gallantry)
PPM (service)
Established1 మార్చి 1951; 73 సంవత్సరాల క్రితం (1951-03-01)
ధరించే వరస[1]
Next (lower)
  • రాష్ట్రపతి పోలీసు/ ఫైర్ సర్వీసు శౌర్య పతకం
  • రాష్ట్రపతి పోలీసు/ ఫైర్ సర్వీసు విశిష్ట సేవా పతకం

చరిత్ర

మార్చు

1950 జనవరి 26 న భారత రాజ్యాంగ ప్రకటన తర్వాత భారతదేశంలో కామన్వెల్తుకు సంబంధించిన పురస్కారాలు, గౌరవాలను ఆపేసారు. గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత, భారతదేశం తన స్వంత పురస్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కింగ్స్ పోలీస్, ఫైర్ సర్వీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్‌ల స్థానంలో పోలీసు పతకాలను నెలకొల్పారు. రాష్ట్రపతి పోలీసు పతకాన్ని భారత రాష్ట్రపతి 1951 మార్చి 1న స్థాపించారు. నిజానికి ఈ పతకాన్ని ప్రెసిడెంట్స్ పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ మెడల్ అని పిలిచేవారు. అదే సమయంలో దానికంటే తక్కువ ర్యాంకు ఉండే పోలీసు పతకం పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేసారు. [2]

ప్రమాణాలు

మార్చు
శౌర్యం

రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం "జీవితాన్ని, ఆస్తినీ రక్షించడంలో లేదా నేరాలను నిరోధించడంలో లేదా నేరస్థులను అరెస్టు చేయడంలో శౌర్య ప్రదర్శన" కు గాను ఇస్తారు. భారతదేశంలోని పోలీసు సేవలో ఉన్న ఏ సభ్యునికైనా పతకం అందించవచ్చు. ర్యాంకుతో గాని, పని చేసిన వ్యవధితో గానీ సంబంధం లేకుండా ఇస్తారు. పతక గ్రహీతలకు నెలవారీ స్టైపండు ఇస్తరు. పదవీ విరమణ తరువాత కూడా దీన్ని కొనసాగిస్తారు. గ్రహీత మరణిస్తే ఆ తర్వాత వారి జీవిత భాగస్వామి జీవించి ఉంటే వారికి చెల్లిస్తారు. [3]

విశిష్ట సేవ

పోలీసు సేవలో గాని, కేంద్ర పోలీసు, భద్రతా సంస్థల్లో గానీ కనీసం 21 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు చేసిన విశిష్ట సేవకు గాను రాష్ట్రపతి పోలీసు పతకం ఇస్తారు. ఆ వ్యక్తులు అంతకు ముందు ఉన్నతమైన సేవ చేసినందుకు గాను పోలీసు పతకాన్ని స్వీకరించి ఉండాలి. కనీసం ఆరేళ్ళు ముందు నుండి అ పతకాన్ని కలిగి ఉండాలి. [2] [3]

స్వరూపం

మార్చు

పోలీసు పతకాన్ని కాంస్యంతో తయారు చేస్తారు. అది వృత్తాకారంలో 35 మి.మీ. వ్యాసంతో ఉంటుంది. పతకానికి ఎదర వైపున మధ్యలో భారత జాతీయ చిహ్నంపై పోలీసు మెడల్ అనేది పైన, జాతీయ నినాదమైన సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో క్రింద వైపున రాసి ఉంటుంది. పతకానికి ఇరువైపులా రెండు ఐదు కోణాల నక్షత్రాలు ఉంటాయి. మెడల్ వెనుక వైపున పైన INDIAN అని, క్రింద POLICE అనే పదాలతో పుష్పగుచ్ఛం ఉంటుంది. మధ్యలో ఇచ్చే పతకాన్ని బట్టి ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అని గాని, ఫర్ గ్యాలంట్రీ అని గానీ చెక్కి ఉంటుంది. పతకపు అంచుపై గ్రహీత పేరు చెక్కబడి ఉంటుంది.

పతకపు రిబ్బను ముదురు నీలం రంగులో 35 మి.మీ. వెడల్పుతో, వెండి అంచులతో, మధ్యలో క్రిమ్సన్ రంగులో గీతతో ఉంటుంది. శౌర్యం పతకాలు ముదురు నీలం రంగు విభాగాన్ని సగానికి విభజిస్తూ సన్నని వెండి చారలు ఉంటాయి. [4]

మూలాలు

మార్చు
  1. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 9 సెప్టెంబరు 2014.
  2. 2.0 2.1 "Chapter XIX, Rewards and Medals" (PDF). police.pondicherry.gov.in. Puducherry Police. Archived from the original (PDF) on 11 September 2014. Retrieved 9 September 2014. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "manual" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 "Medals & Decoration" (PDF). mahapolice.gov.in/. Maharashtra State Police. Archived from the original (PDF) on 5 March 2015. Retrieved 9 September 2014. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "msp" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. https://police.py.gov.in/Police%20manual/Chapter%20PDF/CHAPTER%2019%20Rewards%20and%20Medals.pdf