రాష్ట్రీయ పరివర్తన్ దళ్

భారతీయ రాజకీయ పార్టీ

రాష్ట్రీయ పరివర్తన్ దళ్ (నేషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పార్టీ) అనేది భారతదేశంలోని డిపి యాదవ్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ. జనతాంత్రిక్ బహుజన్ సమాజ్ పార్టీ నుండి విడిపోయిన డిపి యాదవ్ ఈ కొత్త పార్టీని స్థాపించాడు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రీయ పరివర్తన్ దళ్ కి 2 సీట్లు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు డిపి యాదవ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ సముజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభినవ్ శుక్లా. యాదవ్ కుమారుడు వికాస్ యాదవ్ 2002 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. వికాస్ యాదవ్ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు.[1] 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరాడు. అతని నేర చరిత్ర ఉన్నప్పటికీ అతన్ని అంగీకరించినందుకు బిజెపి లోపల విపరీతమైన విమర్శల కారణంగా పార్టీలో అతని ప్రాధాన్యత చాలా తక్కువైంది. బిజెపి నుండి బహిష్కరించబడిన తరువాత, యాదవ్ రాష్ట్రీయ పరివర్తన్ దళ్ ని పునర్నిర్మించారు.

మూలాలు

మార్చు
  1. "Nitish Katara Murder: Delhi HC Dismisses Vikas Yadav's Parole Plea on Ground of Mother's Illness". News18 (in ఇంగ్లీష్). 2020-08-26. Retrieved 2022-04-03.