రాష్ట్ర సంగ్రహాలయం హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని ఒక ప్రాచీనమైన సంగ్రహాలయం.

తెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం లేదా హైదరాబాదు మ్యూజియం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని ఒక ప్రాచీనమైన సంగ్రహాలయం. పురతత్వవేత్త హెన్రీ కోసెన్స్ 19 వ శతాబ్ద ప్రారంభంలో దీని స్థలం గూర్చి అన్వేషించారు. 1940 లలో నిజాం చే ఇది ప్రారంభించబడింది. త్రవ్వకాలలో లభించిన పురాతత్వ వస్తువులను పురాతన స్థలంలో ఉంచేవారు. 1952లో ఈ పురాతత్వ వస్తువులను ఈ సంగ్రహాలయానికి మార్చారు. ఈ సంగ్రహాలయం భారత పురాతత్వ సర్వే విభాగం చే నిర్వహింపబడుతున్నది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

తెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం
Telangana State Archeology Museum
పటం
Established1930
Locationనాంపల్లి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ఈజిప్టు మమ్మీ

చరిత్ర

మార్చు

1930 సంవత్సరంలో VII మిర్ ఒస్మాన్ అలీఖాన్ మొదట తన కూతురి బొమ్మల కోసం నిర్మించినా, మూఢనమ్మకాల మూలంగా మ్యూజియంగా మార్చాడు. దీనిని తొలుత "హైదరాబాదు మ్యూజియం" అనేవారు. దీనిలో అజంతా చిత్రపటాలు, షాజహాన్ ముద్ర కలిగిన ఖురాన్ ప్రత్యేక ఆకర్షణలు.[2] దీనిని 1960లో "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియం"గా మార్చారు.[2] ఆ తరువాత డా వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియమ్ గా మార్చబడింది. తెలంగాణ ఏర్పాటు తరువాత దీనిపేరు స్టేట్ మ్యూజియమ్ హైదరాబాదు గా మారింది. [3]

రాష్ట్రవిభజన ఫలితంగా, శేష ఆంధ్రప్రదేశ్ నుంచి సేకరించినవాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించవలసివుంది.[4]

సేకరణ

మార్చు

ఈ సంగ్రహాలయంలో ప్రధాన ఆకర్షణ ఈజిప్టు మమ్మీ. దీనిని ఆరవ నిజాం మహబూబ్ ఆలీఖాన్ యొక్క అల్లుడు హైదరాబాదుకు చేర్చారు. దీనిని ఆఖరి నిజాం అయిన మిర్ ఒస్మాన్ అలీఖానుకు విరాళంగా యిచ్చారు. ఆయన 1000 పౌండ్లకు కొన్నాడు.

ఇచట గత శతాబ్దంలో బుద్ధునికి సంబంధించిన పెద్ద గ్యాలరీ ఉంది. ఈ మ్యూజియంలో నిజాం, కాకతీయ సామ్రాజ్యంలో గల పురాతన వస్తువులు ఉన్నాయి.

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Archaeological Museum. Kondapur (Andhra Pradesh)". Archaeological Survey of India. Archived from the original on 5 జనవరి 2016. Retrieved 16 July 2012.
  2. 2.0 2.1 Murali, D (22 April 2006). "Floods proved a blessing in disguise". The Hindu. Chennai, India. Archived from the original on 14 మే 2006. Retrieved 7 July 2012.
  3. "State museum Hyderabad (Department of Heritage website)". Archived from the original on 2021-10-19. Retrieved 2022-01-10.
  4. "Telanagana effect: Hyderabad's oldest museum faces division - The Times of India". The Times Of India.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.