రాసలీల ఒక విధమైన జానపపద నాటకము. ఇందు ప్రజాభిరుచి వ్యక్తమగుచున్నది.ఇది అభినయానుకూలము. ఇవి నేడు శృంగార లీలకు ఆలవాలమైనది.గుజరాత్ లోని వ్రజ ప్రాంతము దీనికి కేంద్రము.ద్వాపరయుగములోని శ్రీ కృష్ణుడు అవతరించినదాది రాసలీల లున్నవని పరంపరానుగత విశ్వాసము. అటుపై జానపదులందీ కృష్ణలీలలు అభినవరూపము ఆశ్రయించినవి.దానలీల, మానలీల, మాఖనచోరి (వెన్నదొంగతనము) ఆది అభినయనములు, సూరదాసు మొదలగు కవుల పదములనాధారముగా గాని, ఈ లీలలు రూపొందినవి.15,16 వ శతాబ్దము లందీ పద్ధతి వ్రజ ప్రాంతమున విలసిల్లి యున్నది. నందదాసు, వ్రజవాసీదాసు, ధ్రువదాసు మొదలగు భక్తులు రాసో రచనలను గావించి రాస వికాసమునకు తోడ్పడిరి.నేటి రాసలీలందు కథోస కథన పద్ధతి, గీతబద్దశైలి, సంగీతము జోడింపబడినవి. వ్రజవాసీదాస కృత వ్రజ విలాసము నారాయణస్వామి విరచిత వ్రజ విహారము రాస రసికజన పారాయణ గ్రంథములు.వీటినే కొందరు రహస్యలీలలని కూడా అంటారు.

హిందీ నాటక వికాసమునకు రాసలీల లెంతో తోడ్పడినవి అని పలువురు గ్రంథకారుల అభిప్రాయము. దీనికి కారణము ఈనాటకములు ఛంధోబద్ధమై; గేయరూపమున ఉండుటయే.ఇందు గద్యము ఉపేక్షింపబడింది. పాత్రలు ప్రారంభము నుండి చివరివరకు వేదికపై నుందురు. ప్రవేశ నిష్క్రమణలు సూచించబడవు. ఇవి నృత్యగీత ప్రధానములు. మంగళాచరణము, ప్రశస్తిపాఠము, స్వాంగు నాట్యము వలే నుండును.రచనా ప్రయోజనము చివర తెలుపబడును. రాసో గ్రంథములను బట్టి హిందీ నాటకారంభము 13వశతాబ్దమున నుండి ప్రారంభమైనదని తెలియుచున్నది. రాస పరంపరయే హిందీ సాహిత్యమున వందలయేండ్లు సాగినది.రాసలీలలొక శాస్త్రనాట్య పద్ధతులకు మహా సేతువు.రాసలీల ప్రచలితార్ధము, ప్రకారము కృష్ణచరిత్రకు సంబందిచినవి.నృత్యాభినయమునకు అనవగు వివిధలీల లిందు పొందువరుచబడినవి. ఇందు సంగీతమునకు ప్రధాన స్థానమున్నది. కాని, సంవాద అంశరూపమున విలుసిల్లుచుండును.అందువలన రాసలీల కతిపయ నాటక తత్వములను పుంజుకొని, జానపద నాట్యకళా రూపమున వేదిక నెక్కిన నాట్యకళాదేవి.

రాస శబ్దార్ధము

మార్చు

రాసలీలలు రసప్రదానములు. రస సమూహమే రాసము. మహారాసమునందు కృష్ణుని అనేక రూపములను కల్పింపబడెను.ఇద్దరు గోపికలనడుమ ఒక్కొక్క కృష్ణుడు ఉండును. ఇది ఒక రసవత్తర ఘట్టము.రాసములందు నృత్యము, అభినయము, సంగీతము ద్వారా రససృష్టి యేర్పడును. కృష్ణుడు గోపికలతో మండలాకార నృత్యమొనరించును.ఇదియే రాసము. నృత్యము చేయునపుడు బిగ్గరగా అరుచుచుందురు.ఈ అరుపులు జానపదనృత్యములందు సహజముగా వినుదుము. రాస శబ్దము దేశీయ శబ్దము.తదుపరి సంస్కృత శబ్దమైనది.రాసమను జానపదనృత్యము నాట్యభేధముగా స్వీకరించబడి సంస్కృత నాట్యశాస్త్రములందు చేరినది. రాసో, రాసక ప్రయోగము లీనాటకీ రాజస్థానులో ఉన్నాయి.రాసక్రీడలు గోపికలకు సంబంధించినవి. ఇది గొల్లలందు ప్రచలితమైన నృత్యము కావచ్చును.

రాస-రాసో పద్దతులు

మార్చు

రాస-రాసో శబ్దములకు పరస్పర సంబంధము ఉంది. రస ప్రధాన రచన రాసో అనియు, రాజస్థాన ప్రాంతమున వర్ణనాత్మక గ్రంథములను రాసో అంటారు.ప్రాచీన జైన కృతులందు రాస శబ్దము ప్రయోగించబడింది.కానీ, రాసో రబ్దము ప్రయోగించబడలేదు.17వ శతాబ్దమున, 18వ శతాబ్దమున రచించబడిన కొన్ని వినోద పూర్ణక రచనలయదు రాస-రాసో శబ్దములు కనపడుచున్నవి.

రాసము గీతనృత్యపరకము.రాస కావ్యధారకు చెందినది.రాసో ఛందో వైవిధ్యపరకము. అపభ్రంశ సాహిత్యమునందు రాసాబంధ సాహిత్యము ఉంది. రాసా ఛందస్సులో వ్రాయబడుటచే దీనికి రాసాబంధ మని పేరు వచ్చింది.

రాసలీలలు లోకనృత్యములు. ఇవి లోకగీతముల రూపమున వెలువడి 2 పాయలుగా చీలినవి. మొదటిపాయ నృత్యగానము కొరకు ఉద్దేశించబడింది. రెండవది చదువుటకు, అభినయనమునకు అనుకులముగా ఉంది. మొదటికోవకు చెందినవి రాగ్రంధములు. జైనమత ప్రభావము వలన దీని రుపము కొంతమారినది. రెండవకోవకు చెందినవి రాసో కావ్యములు.ఇవి గేయానుకూలములు.ఇవియు చరిత్ర కావ్యములవలె రూపొందినవి.రాజచరిత్రను గానము చేయుటకు ఇవి ఉద్దేశించబడినవి.15,16,17 వ శతాబ్దములందు కొన్ని రాసగ్రంధములు చరిత్రనాధారముగా, కొన్ని మతవిషయములనాధారముగా, కొన్ని స్వతంత్ర కథావస్తువుల నాధారముగా కొన్ని వ్రాయబడినవి.

రాసలీలలు-ప్రాచీన కధలు

మార్చు

జనస్రుతిని అనిసరించి రాసలీలలు మణిపురి నృత్యమున కాధారమని అంటారు. ఒకనాడు శివుడు రాసలీలలును ఏర్పాటుచేసాడు. అప్పుడు పార్వతి నృత్యము, చిరుగజ్జెల ధ్వనిని వినెను. రాసలీలలు చూడవలెనని ఉన్నదని పార్వతి శివుని కోరినది.శ్రీ కృష్ణుడు దీనికి మొదట ఒప్పుకొనలేదు. ఒక రహస్య స్థానమున దీని ఏర్పాటు చేయుటకు శ్రీకృష్ణుడొప్పుకొనెను. దేవతలను, గంధర్వులను, అప్సరసలను రాసలీలలను పిలిచిరి.నంది మృదంగమును, బ్రహ్మ శంఖమును, ఇంద్రుడు వేణువును తీసుకొని వచ్చిరి.నాగరాజు కృపవలన స్థల మాలోక పూర్ణమాయెను.గంధర్వులు సంగీతమును ఆరంభించిరి. రాసలీల ప్రారంభమాయెను.7 దినములు, 7 రాత్రులీ ఉత్సవము జరిగింది. మణిపురీ నృత్యమునకు ఇదే ఆధారము.

భాగవతములో మరియొక కథ పేర్కొన బడెను, రాధకు అహంకారము, అభిమానమావరించెను. ప్రధాననాయకుడు శ్రీకృష్ణుడు అంతర్ధానమయెను.మరల వారిని స్మరించుచు, వారిలీల లాడుట మొదలిడిరి. శ్రీకృష్ణుడు పునర్దర్శనము లభించెను. వియోగ శృంగారము రాసలీలలకు ఆధారమైని ఈకథ తెలుపుచున్నది.

రాసలీలలు- మతప్రచారము

మార్చు

కాళీయమర్దన మొనరించిన తరువాత శ్రీ కృష్ణుడు బృందావన వాసులతో నృత్యము చేసెను.అందులో నొకటి రాస లీల.మహాప్రభు వల్లభాచార్యుడు భాగవతపురాణము లోని రాసలీలను వివరించెను. అందు రాసలీలలందు రాధా కృష్ణులే కాకా బృందావన వాసులందరూ పాల్గొనిరి. ఇది మండలాకార నృత్యము.భాగవత పరంపారనుగత రాసలీలలు శరత్ పౌర్ణిమకు చేయుదురు. గీతగోవింద పరంపారునుగుణ రాసలీలలను వసంత ఋతువులో వాడుదురు. సూరదాసు సమయమునకీ రెండు పద్ధతులు జరుపుకొనినట్లు తెలియుచున్నది.

జైనమత ప్రభావము వలన రాసలీలలలో కొన్ని మార్పులు జరిగినవి. (1) నృత్యగానతత్వము నెమ్మదిగా మాసిపోనారంభించింది.జైన మందిరములలో భైరవరాసము, తాలరాసము నిషేధించబడినవి. (2) ధార్మిక నాటకములలో వలె అభినయము వస్తువాయెను. బలబద్రుడు, చక్రవర్తి జినుడు మొదలగువారి గుణ గణములిందు పొందుపరుచబడినవి.

ధార్మిక గ్రంథములందు రాసశబ్దము దార్సనిక భావ విలసితమై బ్రహ్మము యొక్క పూర్ణస్వరూప సన్నద్దమై రహస్య ప్రక్రియ రూపమును దాల్చింది. ఈ లీలా శబ్దము దార్సనిక శబ్దజాలమునందు ప్రవేశించింది.

14వ శతాబ్దము తరువాతి వైష్ణవాచార్యులు రాసలీలలకు మహత్వపూర్ణ స్థానమిచ్చుటకు లీలలను జోడించిరి.జైనరాస గ్రంథములు ధార్మిగ్రంధములు. ఇవి వీర రస ప్రధానములు కావు. ధార్మిక వైష్ణవము ఇందుకు తోడ్పడినది. వల్లభాచార్యుడు శృంగార క్రీడలను రాసలీలలలో చేర్చలేదు. స్వామి హరిదాసు, హితహరివంశరాయ (1559) ఘమండేదేవ, నారాయణభట్ట మొదలగువారు వల్లభాచార్యునకు తోడ్పడిరి.

"https://te.wikipedia.org/w/index.php?title=రాసలీల&oldid=2328791" నుండి వెలికితీశారు