రాహుల్ విజయ్
రాహుల్ విజయ్, తెలుగు సినిమా నటుడు. 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో రాహుల్ సినీరంగ ప్రవేశం చేశాడు.[1]
రాహుల్ విజయ్ | |
---|---|
జననం | రాహుల్ విజయ్ 1992 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం |
జీవిత విషయాలు
మార్చురాహుల్ 1992లో హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి సినిమా స్టంట్ మాస్టర్ విజయ్.[1] హైదరాబాదులోని ఓబల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో విద్యను అభ్యసించిన రాహుల్, సెయింట్ మేరీస్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పూర్తిచేశాడు. డ్యాన్స్, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడంతోపాటు నాటక ప్రదర్శనలలో కూడా పాల్గొన్నాడు. నటుడిగా సినిమాలలో నటించాలన్న ఆసక్తితో, సింగపూర్ నగరంలో మూవీ ఫైటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.
సినిమారంగం
మార్చుతొలిచిత్రం తరువాత మహిళా నేపథ్యంలో 2019లో వచ్చిన సూర్యకాంతం సినిమాలో నటించాడు. "ఈ సినిమాలో అభి పాత్రలో రాహుల్ విజయ్, నటనలో తన మునుపటి చిత్రం కంటే పరిణితిని కనబరుచాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది.[2] కన్నడ చిత్రం కాలేజ్ కుమార్ అనే తమిళ, తెలుగు రీమేక్ లలో కూడా నటించాడు.[3][4][5]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | ref |
---|---|---|---|---|
2018 | ఈ మాయ పేరేమిటో | శ్రీ రామచంద్ర మూర్తి (చందు) | నామినేటెడ్- ఉత్తమ తొలిచిత్ర నటుడిగా సైమా అవార్డు | |
2019 | సూర్యకాంతం | అభి | ||
2020 | కాలేజీ కుమార్ | శివ కుమార్ | ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) | |
2022 | పంచతంత్రం | సుబాష్ | "శుభ-లేఖ" విభాగంలో | |
2023 | కోట బొమ్మాళి పీ.ఎస్ | పిసి సత్తారు రవి కుమార్ | ||
2024 | విద్య వాసుల అహం | వాసు |
స్ట్రీమింగ్ టెలివిజన్
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | వేదిక | గమనికలు |
---|---|---|---|---|
2021 | కుడి ఎడమైతే | ఆది | ఆహా | వెబ్ డెబ్యూ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "'Ee Maya Peremito': Stunt master Vijay's son Rahul Vijay shows his mettle in his debut film's trailer - Times of India". The Times of India. Retrieved 7 March 2021.
- ↑ "Suryakantham movie review {2.5/5}: A wacky tale turns into a sob-fest!". The Times of India. Retrieved 7 March 2021.
- ↑ "'College Kumar', a stepping stone to my career: Rahul Vijay". Telangana Today. Retrieved 7 March 2021.
- ↑ "Poster of Rahul Vijay's next 'College Kumar' released! - Times of India". The Times of India. Retrieved 7 March 2021.
- ↑ "Back to college for director Hari Santhosh as he plans on Tamil remake of 'College Kumar'". The New Indian Express. Retrieved 7 March 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాహుల్ విజయ్ పేజీ