ఈ మాయ పేరేమిటో

రాము కొప్పుల దర్శకత్వంలో 2018లో విడుదలైన తెలుగు సినిమా

ఈ మాయ పేరేమిటో, 2018 సెప్టెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానరులో దివ్య విజయ్ నిర్మించిన ఈ సినిమాకు రాము కొప్పుల దర్శకత్వం వహించాడు. ఇందులో రాహుల్ విజయ్, కావ్య థాపర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించగా, మణిశర్మ సంగీతం సమకూర్చాడు.[1][2]

ఈ మాయ పేరేమిటో
ఈ మాయ పేరేమిటో సినిమా పోస్టర్
దర్శకత్వంరాము కొప్పుల
రచనరాము కొప్పుల
నిర్మాతదివ్య విజయ్
తారాగణంరాహుల్ విజయ్
కావ్య థాపర్
రాజేంద్ర ప్రసాద్
మురళీ శర్మ
పోసాని కృష్ణ మురళి
Narrated byనాని
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పునవీన్ నూలి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్
విడుదల తేదీs
21 సెప్టెంబరు, 2018
సినిమా నిడివి
113 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం మార్చు

చందు నిరుద్యోగుడు కాగా, శీతల్ ధనవంతుడైన వ్యాపారవేత్త కుమార్తె. చందు మంచితనాన్ని చూసిన శీతల్ అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి ప్రమోద్, తన కుమార్తెకు అర్హుడని నిరూపించుకోవాలని చందును కోరుతూ, వాళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చగా, శ్రీమణి పాటలు రాశాడు. ఇందులోని పాటలు మ్యాంగో మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.[3] 2018, జూలై 28న హైదరాబాదులో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[4]

సం.పాటపాట నిడివి
సం.పాటగాయకులుపాట నిడివి
1."అరిహంతనం"అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి4:39
2."మంచిపేరే"అనురాగ్ కులకర్ణి4:27
3."సూర్యుడికే నేరుగా"అనుదీప్ దేవ్, సాహితి చాగంటి4:30
4."ఒకటే ప్రాణమై"దీపు3:55
5."నాలో నేను"హేమంత్3:55
మొత్తం నిడివి:21:26

వివాదం మార్చు

ఈ సినిమాలోని అరిహంతనం పాటలో పవిత్ర జైన మత శ్లోకాన్ని ఉపయోగించడంపై జైన సమాజం అభ్యంతరం తెలిపింది.[5]

మూలాలు మార్చు

  1. "'Ee Maya Peremito': A typical love story". Telangana Today.
  2. "'Ee Maya Peremito' (Review)". The Times of India.
  3. "Ee Maaya Peremito (Songs)". Cineradham.[permanent dead link]
  4. "NTR boosts up a small film". NTV. Archived from the original on 2019-01-29. Retrieved 2021-03-09.
  5. "Ee Maya Peremito: Jains want Arihanthanam song removed". India Today.

బయటి లింకులు మార్చు