కుడి ఎడమైతే (2021 వెబ్‌సిరీస్‌)

కుడి ఎడమైతే 2021లో విడుదలైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తెలుగు వెబ్‌సిరీస్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & పవన్ కుమార్ స్టూడియోస్ బ్యానర్ల పై టీజీ. విశ్వా ప్రసాద్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. అమలా పాల్, రవిప్రకాశ్ , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్ ను 14 జూన్ 2021న,[3] వెబ్‌సిరీస్‌ను 16 జూన్ 2021న ఆహా ఓటిటీలో విడుదల చేశారు.

కుడి ఎడమైతే
జానర్సస్పెన్స్ థ్రిల్లర్
సృష్టికర్తరామ్ విఘ్నేశ్
రచయితరామ్ విఘ్నేశ్
పవన్ కుమార్
దర్శకత్వంపవన్ కుమార్
తారాగణంఅమలా పాల్
రాహుల్ విజయ్
Theme music composerదీపక్ అలెగ్జాండర్
సంగీతంపూర్ణచంద్ర తేజస్వి
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8 ఎపిసోడ్స్
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్విజయ రాజేష్
ప్రొడ్యూసర్టీజీ. విశ్వా ప్రసాద్
ఛాయాగ్రహణంఅద్వైత గురుమూర్తి
ఎడిటర్సురేష్ ఆరుముగం
నిడివి35–45 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీపీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఆహా [1]
చిత్రం ఫార్మాట్హీచ్.డి.టీవీ 1080p
ఆడియో ఫార్మాట్స్టీరియోఫోనిక్
వాస్తవ విడుదల16 జూలై 2021 (2021-07-16)[2]
బాహ్య లంకెలు
Website

ఆది (రాహుల్ విజయ్) నటుడిగా మారాలని కలలు కంటూ ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. దుర్గా గౌడ్ (అమలాపాల్) ఖైరతాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్. నగరంలో వరుసగా జరుగుతున్న పిల్లల కిడ్నాప్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. ఆది, దుర్గ వీరిద్దరి జీవితాల్లో ఫిబ్రవరి 29 న కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి సన్నివేశాలు జరిగాయి ?? ఆది, దుర్గా ఎలా కలుసుకున్నారు ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు

మార్చు
  • అమలా పాల్
  • రవిప్రకాశ్
  • రాహుల్ విజయ్
  • రాజ్ మాదిరాజు
  • సూర్య శ్రీనివాస్
  • ప్రదీప్ రుద్రా
  • నిత్య శ్రీ
  • నవీన్ ఇటిక
  • మేఘాలేఖ
  • కార్తీక్ శబరీష్
  • పవన్ కుమార్
  • రామ్ సందీప్ వర్మ
  • మీసం సురేష్
  • రచిరాజు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & పవన్ కుమార్ స్టూడియోస్
  • నిర్మాతలు: టీజీ. విశ్వా ప్రసాద్
  • దర్శకత్వం: పవన్ కుమార్
  • సహా నిర్మాతలు: వివేక్ కూచిబొట్ల, పవన్ కుమార్
  • సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
  • సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి
  • కథ, స్క్రీన్ ప్లే:రామ్ విఘ్నేష్
  • ఎడిటర్: సురేష్ ఆరుముగం

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (26 June 2021). "Aha: ఆహా అందిస్తున్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్.. అమలపాల్ ప్రధాన పాత్రలో 'కుడి ఎడమైతే'". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. https://tv9telugu.com/entertainment/ott/kudi-yedamaithe-trailer-amala-paul-rahul-vijay-500787.html
  3. Andrajyothy (15 July 2021). "'కుడి ఎడమైతే' ట్రైలర్ విడుదల". Archived from the original on 15 జూలై 2021. Retrieved 17 July 2021.
  4. NTV (16 July 2021). "రివ్యూ: కుడి ఎడమైతే (వెబ్ సీరిస్, ఆహా)". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.
  5. TV9 Telugu (16 July 2021). "అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఎన్నో మలుపులతో అమలాపాల్ "కుడి ఎడమైతే".. ఎలా ఉందంటే". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)