రిచర్డ్ రీడ్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.

రిచర్డ్ బ్రూస్ రీడ్ (జననం 1958, డిసెంబరు 3) న్యూజీలాండ్ మాజీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 1988 - 1991 మధ్యకాలంలో తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇతని తండ్రి, జాన్ రీడ్, 1949 నుండి 1965 వరకు న్యూజిలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.[1]

రిచర్డ్ రీడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ బ్రూస్ రీడ్
పుట్టిన తేదీ (1958-12-03) 1958 డిసెంబరు 3 (వయసు 66)
లోయర్ హట్, వెల్లింగ్టన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులుజాన్ రిచర్డ్ రీడ్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 62)1988 మార్చి 9 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1991 ఫిబ్రవరి 16 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1984/85వెల్లింగ్టన్
1981/82Transvaal B
1985/86–1989/90Auckland
1990/91–1991/92Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 9 43 47
చేసిన పరుగులు 248 1,789 1,376
బ్యాటింగు సగటు 27.55 24.84 30.57
100s/50s 0/2 1/11 0/12
అత్యధిక స్కోరు 64 107 97
వేసిన బంతులు 7 24 7
వికెట్లు 1 2 1
బౌలింగు సగటు 13.00 7.00 13.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 2/5 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 27/– 12/–
మూలం: Cricinfo, 2017 మే 13

జననం, విద్య

మార్చు

రీడ్ 1958, డిసెంబరు 3న వెల్లింగ్టన్‌లోని లోయర్ హట్‌లో జన్మించాడు. వెల్లింగ్టన్‌లోని స్కాట్స్ కళాశాలలో చదివాడు. అక్కడ మొదటి XIకి కెప్టెన్‌గా ఉన్నాడు.[2] తన తల్లిదండ్రులు నివసించే జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్ళేముందు వెల్లింగ్‌టన్ క్రికెట్ జట్టుతో రెండు మధ్యస్థ విజయవంతమైన సీజన్‌లను కలిగి ఉన్నాడు.[3]

వృత్తిజీవితం

మార్చు

రీడ్ జోహన్నెస్‌బర్గ్‌లోని సెయింట్ జాన్స్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్, గణితం బోధించాడు. ట్రాన్స్‌వాల్ బి కోసం ఒక ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఇతను దక్షిణాఫ్రికాలో నైక్ కోసం పనిచేశాడు. 1980ల మధ్యలో, అక్టోబరు 1984లో జింబాబ్వేలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్‌లను సందర్శించిన తర్వాత, న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్ళి తన క్రికెట్ కెరీర్‌ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.[3]

రీడ్ 1985లో ఆక్లాండ్‌లో స్థిరపడ్డాడు. ఆక్లాండ్ క్రికెట్ జట్టుకు కొన్ని విజయాలన్ని అందించాడు. 1986లో పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియన్ జట్టుతో అనుసంధాన అధికారిగా వ్యవహరించాడు.[3] 1989 ఏప్రిల్ లో డెబ్బీ కిట్టోను వివాహం చేసుకున్నాడు.[3]

1990లో నైక్ న్యూజీలాండ్‌కి సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేయడానికి రీడ్ వెల్లింగ్‌టన్‌కు తిరిగి వచ్చాడు.[3] వెల్లింగ్టన్ తరపున వన్డే మ్యాచ్‌లలో బ్యాటింగ్ ప్రారంభించి, 1990–91 షెల్ కప్ పోటీలో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 69.60 సగటుతో 348 పరుగులు, 100 బంతులకు 109.77 పరుగుల స్కోరింగ్ రేట్ చేశాడు.[4] ఆ సీజన్‌లో ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ సిరీస్‌లో న్యూజీలాండ్ జట్టులో చేర్చబడ్డాడు. రెండవ ఫైనల్‌లో[5] పరుగులతో న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొన్ని రోజుల తర్వాత వెల్లింగ్టన్ షెల్ కప్ ఫైనల్ గెలిచినప్పుడు 44 బంతుల్లో 47 పరుగులు చేసి ఇరువైపులా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.[6]

ఆ సీజన్ తర్వాత రీడ్ ఫామ్ పడిపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతని దేశవాళీ క్రికెట్ చివరి సీజన్ 1991–92.[3] రీడ్ 2001 వరకు నైక్ న్యూజీలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఇతను క్రికెట్, రగ్బీ అడ్మినిస్ట్రేషన్‌లో కెరీర్ ప్రారంభించాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Richard Reid". CricketArchive. Retrieved 21 May 2023.
  2. Joseph Romanos, John Reid: A Cricketing Life, Hodder Moa Beckett, Auckland, 2000, p. 251.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Joseph Romanos, Great New Zealand Cricket Families, Random House, Auckland, 1992, pp. 130–34.
  4. "Batting and Fielding in Shell Cup 1990/91". CricketArchive. Retrieved 21 May 2023.
  5. "2nd Final (D/N), Melbourne, January 15, 1991, Benson & Hedges World Series". ESPNcricinfo. Retrieved 21 May 2023.
  6. "Wellington v Central Districts 1990-91". CricketArchive. Retrieved 21 May 2023.
  7. "Canterbury chief executive set to depart". ESPNcricinfo. Retrieved 19 May 2023.

బాహ్య లింకులు

మార్చు