ఋతుపర్ణ ఘోష్

(రితుపర్ణో ఘోష్ నుండి దారిమార్పు చెందింది)

ఋతుపర్ణ ఘోష్ (బెంగాలీ: ঋতুপর্ণ ঘোষ, జననం: 31 ఆగస్టు 1963 - మరణం: 30 మే 2013) బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్ర పట్టా పొందిన పిమ్మట కొన్నాళ్ళు ప్రకటనా పరిశ్రమలో సృజనాత్మక కళాకారునిగా తన వృత్తి జీవనాన్ని ప్రారంభించారు. 1994 లో ఇతని మొదటి చిత్రం హీరేర్ ఆంగటీ (వజ్రపుటుంగరం) విడుదలయ్యింది. అదే యేడాది తెరమీదికొచ్చిన తదుపరి చిత్రం ఉనీషే ఏప్రిల్ (ఏప్రియల్ పంతొమ్మిది) జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికై విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

Rituparno Ghosh
Rituparno Ghosh at MAMI festival
జననం(1963-08-31)1963 ఆగస్టు 31
మరణం2013 మే 30(2013-05-30) (వయసు 49)
ఇతర పేర్లుRitu
వృత్తిFilm director
క్రియాశీల సంవత్సరాలు1992-2013
గుర్తించదగిన సేవలు
Unishe April
Dahan
Raincoat
The Last Lear

రమారమి ఇరవయ్యేళ్ళ తన చలనచిత్ర జీవితంలో ఋతుపర్ణకు 12 జాతీయ బహుమతులు, కొన్ని అంతర్జాతీయ బహుమతులూ కూడా లభించాయి.[2] తన శైలికి ఒఱవడి సత్యజిత్ రే స్ఫూర్తి అని చెప్పుకున్న ఋతుపర్ణ, రవీంద్రనాథ్ ఠాగూర్ కృతుల అభిమాని, పరిశోధకుడు కూడా.

2013 మే 30 న కలకత్తా లోని తన స్వగృహంలో 49 వ యేటనే తీవ్ర గుండెపోటు కారణంగా మృత్యువాత పడ్డాడు ఋతుపర్ణ ఘోష్. ఈయన మరణం బెంగాలీ, భారత చిత్ర పరిశ్రమలకు తీరని లోటు అని అనేక చలనచిత్ర, ఇతర రంగ ప్రముఖులు వాపోయారు.[3]