రిమోట్ సెన్సింగ్ అంటే ఒక వస్తువును తాకకుండా దూరం నుంచి గమనించి అందులో ఏముందో చెప్పగలిగే విధానం. అంతరిక్ష శాస్త్రంలో ఈ విధానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పద్ధతిని ఉపయోగించి ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి భూమి ఛాయాచిత్రాలు సేకరిస్తారు. ఈ చిత్రాలను విశ్లేషించడం ద్వారా భూగర్భంలోని ఖనిజ నిక్షేపాల గురించి తెలుసుకోవచ్చు. వాతావరణం గురించి, అగ్ని పర్వతాల ఆచూకీ, నీటి జాడలు, అడవులు, వ్యవసాయ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

ఎలా చేస్తారుసవరించు

భూమి ఉపరితలం వివిధ రకాలైన తరంగ దైర్ఘ్యాలతో విద్యుదయస్కాంత శక్తిని విడుదల చేస్తుంటుంది. ఇది నేల భౌతిక, రసాయనిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఈశక్తిని ప్రత్యేకమైన పరికరాలతో గుర్తించి భద్రపరిచి తిరిగి భూమి మీదకు పంపుతారు. భారతదేశంలో హైదరాబాదులో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ఉపగ్రహం పంపిన బొమ్మలను విశ్లేషిస్తూ ఉంటుంది.

ఆధార గ్రంథాలుసవరించు

  • వి. వి. బాలకృష్ణ (1991), అందరికీ అవసరమైన అంతరిక్ష విజ్ఞానం, విజయవాడ: నవరత్న బుక్ సెంటర్, archived from the original on 2019-01-14, retrieved 2019-03-14 CS1 maint: discouraged parameter (link)