రిస్ట్ స్పిన్
రిస్ట్ స్పిన్ అనేది క్రికెట్ క్రీడలో ఒక రకమైన బౌలింగు పద్ధతి. బంతిని నిర్దుష్ట దిశలో స్పిన్ చేసేందుకు ఉద్దేశించిన సాంకేతికతనూ, నిర్దుష్టమైన చేతి కదలికలనూ ఇది సూచిస్తుంది. దీనికి వ్యతిరేక దిశలో బంతిని తిప్పే మరొక స్పిన్ పద్ధతిని ఫింగర్ స్పిన్ అంటారు. మణికట్టు స్పిన్‌లో బంతిని చేతి వెనుక నుండి వదులుతారు. తద్వారా బంతి చిటికెన వేలు మీదుగా వెళుతుంది. కుడిచేతి వాటం బౌలరు వేసే ఈ రకమైన బౌలింగులో బంతి, బౌలర్ దృష్టికోణం నుండి చూసినపుడు, అపసవ్య దిశలో తిరుగుతూ వెళ్తుంది. ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నరు బంతిని సవ్యదిశలో తిప్పుతాడు.
మణికట్టు స్పిన్ అనే పేరు వాస్తవానికి తప్పు పేరు - ఎందుకంటే బంతిని స్పిన్ చెయ్యడంలో మణికట్టు ముఖ్యమైన భాగం కాదు. మణికట్టు స్పిన్‌లో అరచేయి లోపలివైపు చూసేలా చేతిని ఉంచి, వేళ్ళు బంతిని లోపలివైపు పట్టుకుని (కుడిచేతి వాటం బౌలరు విషయంలో వేళ్ళు ఎడమవైపు చూస్తూ ఉంటాయి) విడుదల చేస్తారు. చేయి ఇలా లోపలి వైపుకే చూస్తూ ఉండేలా పెట్టి బంతిని విడుదల చేసినపుడు, వేళ్లు సహజంగా బంతిని అడ్డంగా తిప్పుతూ దానికి అపసవ్యదిశలో స్పిన్‌ను కలిగిస్తాయి. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నరు బిల్ ఓ'రైలీ ఈ పద్ధతి లెగ్ స్పిన్ బౌలింగుకు ప్రసిద్ధి చెందాడు. [1] బంతికి రెండు ఇతర మార్గాల ద్వారా అదనపు స్పిన్‌ను కలిగించవచ్చు: ముందు అరచేతిని బయటి వైపు చూసేలా ఉంచి, బంతిని విడుదల చేయడానికి ముందు దాన్ని లోపలి వైపుకు తిప్పడం ఒక పద్ధతి కాగా, విడుదల సమయంలో మణికట్టును సాగదీయడం రెండవ పద్ధతి. ఈ రెండు పద్ధతులూ బంతిని కట్టింగ్ చేసే మెకానిజం ప్రభావాన్ని పెంచుతాయి. స్పిన్ బౌలరు బంతిని ఎంత తక్కువ వేగంగా వేస్తే, అంత ఎక్కువగా అది తిరిగేలా దానిని మరింత ఎక్కువ స్పిన్ చేయడానికి ప్రయత్నించాలి. [2]
మణికట్టు స్పిన్ బయోమెకానికల్ వివరాలు కుడి, ఎడమ చేతి బౌలర్లిద్దరికీ ఒకేలా ఉన్నప్పటికీ, పిచ్‌పై బౌన్స్ అయ్యాక బంతి ఏ దిశలో పోతుందనే దాన్ని బట్టి వారిని వర్గీకరిస్తారు.
- కుడిచేతితో వేసే మణికట్టు స్పిన్‌ను సాధారణంగా లెగ్ స్పిన్ అంటారు.
- ఎడమచేతితో వేసే మణికట్టు స్పిన్‌ను సాధారణంగా ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ అని, రిస్ట్ స్పిన్ అనీ అంటారు.
డెలివరీల్లో రకాలు
మార్చులెగ్ బ్రేక్
మార్చులెగ్-స్పిన్ డెలివరీ వెయ్యడం కోసం, సీమ్ అరచేతికి సమాంతరంగా ఉండేలా బంతిని అరచేతిలో పట్టుకుంటారు. మొదటి రెండు వేళ్లు ఎడంగా ఉండి బంతిని పట్టుకుంటాయి. మూడవ, నాల్గవ వేళ్లు ఒకదానికొకటి ఆనుకుని బంతికి పక్కన ఆనుకుని ఉంటాయి. మూడవ వేలు మొదటి కణుపు సీమ్‌ను పట్టుకుని ఉంటుంది. బొటనవేలు బంతికి ఒకవైపున ఆనుకుని ఉంటుంది. కానీ ఒత్తిడి కలిగించదు. బంతిని బౌల్ చేసినప్పుడు, మూడవ వేలు దానికి స్పిన్‌ను ఇస్తుంది. చేయి కటి వద్ద నుండి పైకి లేచేటపుడు మణికట్టు కుడి నుండి ఎడమ వైపుకు బాగా తిరిగి, బంతిని విడుదల చేస్తూ బంతికి మరింత స్పిన్‌ను ఇస్తుంది. బంతికి ఫ్లైటును ఇచ్చేందుకు బంతిని పైకి వేస్తారు. బంతిని విడుదల చేసినప్పుడు అరచేయి బ్యాటరును చూస్తూ ఉంటుంది.
రాంగ్ వన్
మార్చురాంగ్ వన్ లేదా గూగ్లీ అనేది మణికట్టు స్పిన్ బౌలరు వేసే ఒక రకమైన డెలివరీ. దీనిని బోసీ అని కూడా పిలవడం కద్దు. దాన్ని కనిపెట్టిన బెర్నార్డ్ బోసాంక్వెట్ గౌరవార్థం ఆ పేరు పెట్టారు.
మామూలుగా లెగ్ బ్రేక్ బంతి, లెగ్ నుండి ఆఫ్ సైడ్‌కి, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నుండి దూరంగా పోతుంది. గూగ్లీ, బ్యాటరు కుడిచేతి వాటమైతే, దీనికి వ్యతిరేక దిశలో బంతి బ్యాటరు మీదికి వస్తుంది (ఇది ఆఫ్ బ్రేక్ డెలివరీ కంటే భిన్నంగా ఉంటుంది). సాధారణ లెగ్ బ్రేక్ డెలివరీ స్థానం నుండి మణికట్టును తీవ్రంగా వంచడం ద్వారా బౌలర్ ఈ స్పిన్ మార్పును సాధిస్తాడు. ఈ వంపుని సాధించడానికి డెలివరీకి ముందు, అరచేయి కిందకి చూసేలా ముంజేతిని వంచాల్సి ఉంటుంది. అలాగే భుజాన్ని లోపలికి తిప్పడం అవసరం: సాధారణంగా డెలివరీ సమయంలో మోచేతి కొన, కుడి చేతి బౌలరుకు కుడి వైపున, పైకి చూస్తూ ఉంటుంది. సాధారణంగా బౌలర్ వెనుక వైపు చూస్తూ ఉండే చేతి వెనుక భాగం ముందు వైపు చూస్తూ ఉంటుంది. బంతి చేతి నుండి బయటకు వచ్చినప్పుడు (చిటికెన వేలు దగ్గర నుండి, సాధారణ లెగ్ బ్రేక్‌లో వలె), అది సవ్యదిశలో స్పిన్‌తో (బౌలర్ దృష్టి నుండి చూసినపుడు) బయటకు వస్తుంది. బంతిని సంప్రదాయ లెగ్ బ్రేక్‌గా బౌలింగ్ చేయడం ద్వారా గూగ్లీ కూడా సాధించవచ్చు. ఇందుకోసం, బంతిని విడుదల చేసేముందు వేళ్లతో మరింత ముందుకు తిప్పాలి.
మణికట్టు చర్య లోని మార్పును నైపుణ్యం కలిగిన బ్యాటర్లు చూడగలరు. తక్కువ నైపుణ్యం కలిగిన బ్యాటర్లు లేదా ఏకాగ్రత కోల్పోయిన వారు, బంతి పిచ్ అయ్యాక ఒక దిశలో కదులుతుందని ఆశించి, భంగపడవచ్చు. బ్యాటరు లెగ్ బ్రేక్ ఆశించినట్లయితే, బంతి స్పిన్ అయిన తర్వాత వారు లైన్ వెలుపల ఆడతారు. దీని అర్థం బంతి LBW అప్పీల్ కోసం ప్యాడ్‌లను తాకవచ్చు లేదా బ్యాట్ ప్యాడ్‌ల మధ్య ఎగిరి వికెట్‌ను తాకవచ్చు.
లెగ్ స్పిన్ బౌలరు ఆయుధాగారంలో గూగ్లీ ఒక ప్రధాన ఆయుధం. బౌలరు వద్ద ఉన్న వికెట్-తీసుకునే బంతుల్లో ఇది ఒకటి. ఈ బంతి బ్యాటరుకు కలిగించే ఆశ్చర్యం, దీని ప్రభావాల్లో అతి ముఖ్యమైనది. అంచేత బౌలర్లు దీన్ని చాలా అరుదుగా వాడతారు. బంతి పట్టు సాంప్రదాయిక లెగ్-బ్రేక్‌లో బంతిని పట్టుకునే పట్టు లాగానే ఉంటుంది. అదనపు మణికట్టు భుజం భ్రమణం మాత్రమే తేడా, తద్వారా బంతి విడుదలైనప్పుడు బ్యాట్స్‌మన్ చేతి వెనుక భాగాన్ని చూస్తాడు.
టాప్ స్పిన్నర్
మార్చుటాప్ స్పిన్నర్ అనేది రిస్ట్ స్పిన్ బౌలరు, ఫింగర్ స్పిన్ బౌలరు ఇద్దరూ వేసే ఒక డెలివరీ. ఈ ఇద్దరు బౌలర్లూ బంతిని విడుదల చేసే ముందు వేళ్లతో మెలితిప్పడం ద్వారా టాప్ స్పిన్‌తో వేస్తాడు. ఈ ఇద్దరికీ, టాప్ స్పిన్నర్ అనేది మామూలుగా వేసే డెలివరీకీ, రాంగ్ వన్‌కీ - మణికట్టు స్పిన్నర్ విషయంలో గూగ్లీ, ఫింగర్ స్పిన్నర్ విషయంలో దూస్రా - మధ్య ఉన్న డెలివరీ ఇది.