రీతా సాహు
రీతా సాహు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బిజేపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) భాద్యతలు చేపట్టింది.[1]
రీటా సాహు | |||
| |||
చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2022 జూన్ 5 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | బిజేపూర్ నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 28 ఫిబ్రవరి 2018 – 24 మే 2019 | |||
ముందు | సిబాల్ సాహు | ||
తరువాత | నవీన్ పట్నాయక్ | ||
పదవీ కాలం 24 అక్టోబర్ 2019 – ప్రస్తుతం | |||
ముందు | నవీన్ పట్నాయక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 16 జూన్ 1971 | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | లక్ష్మి నారాయణ్ మహారణా | ||
జీవిత భాగస్వామి | సుబల్ సాహు | ||
సంతానం | 2 |
రాజకీయ జీవితం
మార్చురీతా సాహు తన భర్త నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సుబల్ సాహు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2018లో బిజేపూర్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైంది.[2] ఒడిశా శాసనసభకు 2019లో జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ బిజేపూర్ & హింజిలి స్థానాల నుండి పోటీ చేసి రెండు స్థానాలలో గెలవడంతో ఆయన బిజేపూర్ స్థానానికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా రీతా సాహు పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[3] 2022 జూన్ 5న నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో చేనేత, వస్త్ర, హస్తకళలు శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) భాద్యతలు చేపట్టింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ The Indian Express (28 February 2018). "MP, Odisha bye-election results 2018 highlights: BJD sweeps Bijepur; Mungaoli, Kolaras stays with Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ The Hindu (24 October 2019). "BJD's Rita Sahu secures impressive victory in Bijepur bypoll" (in Indian English). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.