పులుపు అనేది షడ్రుచులలో ఒకటి. దీనిని ఆమ్లరసం అని కూడా అంటారు. ఇది పుల్లగా ఉండే రుచి.

ఆయుర్వేద పరంగాసవరించు

దీనివలన శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ బయటకు పోవటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కణాలని ఇది పోషణ యిస్తుంది. జ్ఞానేంద్రియాల పుష్టికిది మంచిది. శరీరంలోని స్రావాలు అంటే గ్రంధుల నుండి స్రవించేవి, జాయింట్స్ లో ఉండే వాటిని పెంచుతుంది. ఈ రుచి కూడా సాధారణంగా అహార పదార్థాలలోనే ఎక్కువగా కనబడుతుంది. ఔషధాల రూపంలో ఈ రుచి తక్కువ. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే కడుపులో మంట, హైపవర్ ఎసిడిటీ దురద, త్వరగా ముసలితనం, తల తిరగడం, ఇంకా తల వెండ్రుకలు తెల్లబడటం కూడా జరుగుతుంది.

శాస్త్ర పరంగాసవరించు

పులుపు అనే రుచి అసిడిటీ ని గుర్తించేది. ఈ పులుపుదనం అనునది ఉదజహరికామ్లం (హైడ్రోక్లోరికామ్లము) యొక్క పులుపుదానానికి సాపేక్షంగా తెలుపుతారు. దీని పులుపుదన సూచిక 1 గా నిర్ణయించారు. దీనితో పోలిస్తే టార్టారికామ్లం యొక్క పులుపుదనం 0.7 , సిట్రికామ్లము యొక్క పులుపుదనం 0.46, కార్బానికామ్లం(సోడా) యొక్క పులుపుదనం 0.06 ఉంటుంది[1]<[2]

పులుపు అనే రుచి మొగ్గలు నాలుకపై కల రుచి మొగ్గలలో ఉప ప్రాంతం పై ఉంటాయి. ఈ రుచి కణాలను PKD2L1 ప్రోటీన్ ను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.[3] కానీ పులుపు స్పందనలు తెలుసుకోవడానికి ఈ జన్యువు అవసరం లేదు.పులుపుదనాన్ని రుచికణాలు అధారంగా ప్రోటాన్ల ద్వారా నెరుగా తెలుసుకొవడానికి ఆధారాలు ఉన్నాయి. కణ లోనికి ధనాత్మక ఆవేశాన్ని యొక్క ఈ బదిలీ కూడా ఒక విద్యుత్ ప్రతిస్పందన ఏర్పడగలదు. బలహీన అమ్లాలైన అసిటిక్ ఆమ్లం పూర్తిగా శరీరధర్మ పి.హెచ్ విలువల వద్ద పూర్తిగా విఛ్ఛేదం కాదు. యిది రుచి కణాల గుండా పోతుంది, ఒక విద్యుత్ స్పందనలను బయటకు రప్పించవచ్చు. జంతువులు ఈ రకం రుచులను గుర్తించే విధానం యిప్పటికింకా అవగతం కాలేదు.

ఆహారం లో సాధారణంగా పులుపు పదార్థాలైన పడ్లు అనగా నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, చింతపండు, కొన్నిసార్లు పుచ్చ, వైన్ కూడా పులుపుదనాన్ని కలిగి ఉంటాయి. పాలు పాడైనప్పుడుపులుపుదనాన్ని పొందుతాయి. పిల్లలు పెద్దలకంటే పులుపు వస్తువులను యిష్టపడతారు.[4], సోర్ కాండీ అనునది ఉత్తర అమెరికా లో ప్రసిద్ధమైనది.[5]. దీనిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది.

మూలాలుసవరించు

  1. Guyton, Arthur C. (1991) Textbook of Medical Physiology. (8th ed). Philadelphia: W.B. Saunders
  2. McLaughlin, Susan, & Margolskee, Rorbert F (November–December 1994), The Sense of Taste American Scientist, 82, pp. 538–545CS1 maint: multiple names: authors list (link)
  3. "Biologists Discover How We Detect Sour Taste". Sciencedaily.com. 2006-08-24. Retrieved 2012-08-04.
  4. Djin Gie Liem and Julie A. Mennella (2003). "Heightened Sour Preferences During Childhood". Chem Senses. 28 (2): 173–180. Unknown parameter |month= ignored (help)
  5. http://www.hersheys.com/vending/lib/pdf/sellsheets/SweetSourSS.pdf

యితర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పులుపు&oldid=3109553" నుండి వెలికితీశారు