రుద్రంకోట (2023 సినిమా)

రుద్రంకోట 2023లో విడుదలైన తెలుగు సినిమా. జ‌య‌ల‌లిత సమర్పణలో ఏఆర్‌కె విజువ‌ల్స్ బ్యానర్స్‌పై అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి నిర్మించిన ఈ సినిమాకు రాము కోన దర్శకత్వం వహించాడు. అనీల్‌, విభీష‌, అలేఖ్య‌, జ‌య‌ల‌లిత ప్రధాన పాత్రల్లో నటించిన సెప్టెంబర్ 22న విడుదలైంది.[1][2] ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం రుద్రంకోట, ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలానికి చెందిన గ్రామం లో జరిగినది.[3][4] విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ గ్రామం స‌మీపంలో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు.[5]

రుద్రంకోట
దర్శకత్వంరాము కోన
రచనరాము కోన
నిర్మాత
  • అనిల్ ఆర్కా కండవల్లి
తారాగణం
ఛాయాగ్రహణంఆదిమల్ల సంజీవ్
సంగీతంసంతోష్ ఆనంద్, యువి నిరంజన్
నిర్మాణ
సంస్థ
ఏఆర్‌కె విజువ‌ల్స్
విడుదల తేదీs
22 సెప్టెంబరు 2023 (2023-09-22)(థియేటర్)
2023 (2023)( ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి
  • విభీషా జాను
  • అలేఖ్యా
  • సీహెచ్ జయలలిత
  • భాస్కర్ రావు

రుద్రంకోట కోట‌మ్మ (జ‌య‌ల‌లిత‌) ఆ ఊరికి పెద్ద మనిషిలా ఊరిని కాపాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో ఆమె చెబితే అది జరగాల్సిందే. ఆ ఊరిలో ప్రేమలో నిజాయితీతో కూడిన‌ ప్రేమికుల్ని కోట‌మ్మ క‌లుపుతుంటుంది, ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్లను, కోట‌మ్మ ఆజ్ఞతో శ్మశానంలో ఉండే రుద్ర (అనిల్ ఆర్కా) వారిని శిక్షిస్తుంతాడు. పట్నం నుండి ఊరిలోకి కోటమ్మ మనవరాలు ధృతి (అలేఖ్య) వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఊరికి దూరంగా రుద్ర శ్మశానంలో బ‌త‌క‌డానికి కార‌ణం ఏమిటి ? అనేదే మిగతా సినిమా క‌థ‌.[6]

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఏఆర్‌కె విజువ‌ల్స్
  • నిర్మాత: అనిల్ ఆర్కా కండవల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము కోన[7]
  • సంగీతం: సంతోష్ ఆనంద్, యువి నిరంజన్
  • సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (7 September 2023). "'రుద్రంకోట‌' రిలీజ్‌కు రెడీ." Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Andhra Jyothy (26 September 2023). "మంచి స్పందన వస్తోంది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. "Rudramkota: శ్మశానంలో పెరిగిన యువకుడి కథ". EENADU. Retrieved 2023-09-26.
  4. ABN (2023-09-19). "Ramu Kona: ఈ 'రుద్రంకోట‌' దర్శకుడికి స్ఫూర్తి ఎవరో తెలుసా? | Rudram Kota Director Ramu Kona Special Interview KBK". Chitrajyothy Telugu News. Retrieved 2023-09-26.
  5. "సీరియల్స్‌కు సినిమాకు తేడా అదే : దర్శకుడు". Sakshi. 2023-09-19. Retrieved 2023-09-26.
  6. Sakshi (22 September 2023). "'రుద్రంకోట' మూవీ రివ్యూ". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Andhra Jyothy (19 September 2023). "ఈ 'రుద్రంకోట‌' దర్శకుడికి స్ఫూర్తి ఎవరో తెలుసా?". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.