రుద్రమదేవి (ధారావాహిక)

రుద్రమదేవి (సాటిలేని మహారాజు), 2021 జనవరి 18న స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు భాషా చారిత్రక ధారావాహిక.[1][2] రాణి రుద్రమ దేవి జీవితం ఆధారంగా ఈ సీరియల్ రూపొందించబడింది.[3][4] పెనిన్సులా పిక్చర్స్ బ్యానర్‌లో అలింద్ శ్రీవాస్తవ, నిస్సార్ పర్వేజ్ నిర్మించిన ఈ సీరియల్[5] స్టార్ మాతోపాటు[6] డిస్నీ + హాట్‌స్టార్‌లో డిజిటల్‌గా కూడా అందుబాటులో ఉంది. శక్తి సాగర్ చోప్రా, లక్ష్మీ జయకుమార్ రాసిన ఈ సీరియల్ ఖరీదైన తెలుగు టెలివిజన్ ధారావాహికలలో ఒకటి.[7] ఇందులో అనన్య ద్వివేది యంగ్ రుద్రమ దేవిగా, ఆనంద్ గణపతి దేవుడు పాత్రలో నటించారు.

రుద్రమదేవి
జానర్చారిత్రక
ఆధారంగారాణి రుద్రమ దేవి జీవిత చరిత్ర
అభివృద్ధి చేసినవారుదీపం ఛటర్జీ
ఉదయ భాస్కర్
అలింగ్ శ్రీవాస్తవ
నిస్సార్ పర్వేజ్
రచయితశక్తి సాగర్ చోప్రా
లక్ష్మీ జయకుమార్
ఉదయభాస్కర్(మాటలు)
కథఅంజలి బహుర
తపస్య ఉద్యావర్
దర్శకత్వంసంతోష్ బాదల్
క్రియేటివ్ డైరక్టరుసూరజ్ రావు
తారాగణంఅనన్య ద్వివేది
ఆనంద్
రతి అరుముగం
అమృత గౌరీ రాజ్
Theme music composerలెనిన్ నంది
సంగీతంనకుల్ అభ్యంకర్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య100
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్అలింద్ శ్రీవాస్తవ
నిస్సార్ పర్వేజ్
ఛాయాగ్రహణంకునాల్ వి. కడం
ఎడిటర్లుగంగ కాచర్ల
మొఘుల్ స్వలేహ బేగ్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి21 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీపెనిన్సులా పిక్చర్స్
డిస్ట్రిబ్యూటర్స్టార్ ఇండియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
వాస్తవ విడుదల18 జనవరి 2021 - 26 మే 2021
బాహ్య లంకెలు
Website

కథా సారాంశం

మార్చు

13వ శతాబ్దంలో కాకతీయులు ఓరుగల్లు రాజ్యాన్ని పాలించడంతో కథ ప్రారంభమవుతుంది. గణపతి దేవుడు ఇతర రాజులతో యుద్ధానికి వెళ్ళాడు. రాణి సోముల్లాదేవి/సోమాంబ గర్భవతిగా ఉంటుంది. రాజ్య వారసుడైన మగపిల్లవాడికి జన్మనివవ్వాలని భావిస్తోంది. సోమాంబ సోదరి తిరుమల దేవి మంచిదానిలా నటిస్తుంది, కానీ ఆమె తన సోదరుడు, సోదరుడు భార్య సుమతితో కలిసి తన కుమారుడు విశ్వనాథ్ ను రాజ్యానికి రాజుగా చేయటానికి కుట్రలు పన్నుతుంది. గణపతిదేవుడు చాలా దయగల, నమ్రతగల రాజు. సోమల్లాదేవికి ఒక అమ్మాయి పుడుతుందని గ్రహించగా, గూండాలు సోమంబాపై దాడి చేస్తారు. కానీ ఆమె తప్పించుకుంటుంది. చివరకు, సోమాంబకు ఆడ శిశువుకు జన్మిస్తుంది.

10 సంవత్సరాల తరువాత: రుద్రదేవుడిని, గణపతి దేవ్ యోధుల నైపుణ్యాలతో పెంచారు. గణపతి దేవుడు అన్ని అవాస్తవాల నుండి తప్పించి ఆమె యోధుల నైపుణ్యాలను బోధిస్తాడు. తిరుమల దేవి నిరంతరం రుద్రపై దాడి చేస్తుంటుంది, అయినాకానీ రుద్ర తప్పించుకోగలుగుతుంది. తరువాత, ఆమె విద్యలు నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్ళి గురుకుల ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తుంది. రుద్ర వివాహం గణపతి దేవుడు స్నేహితుడి కుమార్తెతో ఏర్పాటు చేయబడింది, కాని సోమల్లాదేవి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని అంగీకరించలేనందున దానిని వ్యతిరేకిస్తుంది. తిరుమల దేవి కుమారుడు విశ్వ, రుద్రుడిని కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తాడు. కాని వీరభద్రుడు, గోన గన్నారెడ్డి (రుద్రుడి స్నేహితులు) విశ్వను తమ గురువు జ్ఞానేశ్వర్‌కు నిజం చెప్పేలా తారుమారు చేస్తారు.

నటవర్గం

మార్చు

ప్రధాన నటవర్గం

మార్చు
  • అనన్య ద్వివేది: రుద్రమ దేవి/రుద్ర; దేవగణపతి దేవుడు, సోమాంబ కుమార్తె; గణపంభ అక్క; జన్మించిన వెంటనే గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమదేవిని మగపిల్ల రుద్రదేవ (2021) గా ప్రకటించాడు
  • ఆనంద్: గణపతి దేవుడు; సోమాంబ భర్త; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ, గణపంభ తండ్రి; రాజమత కుమారుడు; హరిహర దేవా, మురారీ దేవా సోదరుడు; కాకతీయ రాజవంశం రాజు (2021)
  • రతి అరుముగం: సోమాంబ; గణపతి దేవుని భార్య; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ, గణపంభ తల్లి; కాకతీయ రాజవంశ రాణి (2021)
  • అమృత గౌరీ రాజ్: తిరుమల దేవి; హరిహర దేవుని భార్య; విశ్వ తల్లి; రాయల్ కుటుంబానికి నమ్మకమైన అల్లుడిగా పనిచేస్తున్న తిరుమల దేవి తనకు, తన కుమారుడు విశ్వ (2021) కోసం రాజ్యాన్ని కోరుకుంటున్నారు.
  • శ్రీధర్ రావు: మురారీ దేవుడు; సుమతి భర్త; అమరావతి తండ్రి; రాజమత కుమారుడు; గణపతి దేవుడు, హరిహర దేవుని సోదరుడు; అతను తనకోసం రాజ్యాన్ని కోరుకుంటాడు (2021)
  • సుందీప్ వేద్: హరిహర దేవుడు; తిరుమల దేవి భర్త; విశ్వ తండ్రి (2021)
  • అభినవ్ సింగ్ రాథోడ్: ప్రసాదిత్య; కాకతీయ రాజవంశం విశ్వసనీయ కమాండర్ (2021)
  • జయ కవి: సుమతి; మూరారిదేవుని భార్య; అమరావతి తల్లి (2021)

ఇతర నటవర్గం

మార్చు
  • ఉదేషా: మందాకిని; హరిహర దేవుని సేవకురాలు కాని తరువాత గూఢాచారి అని తెలుస్తుంది (2021)
  • హన్సిక్ జమ్ముల: చాళుక్య వీరభద్ర; రుద్రమదేవి (లేదా) రుద్రదేవుడి స్నేహితుడు చాలా ప్రతిభావంతుడు, బలవంతుడు (2021-ప్రస్తుతం) తరువాత ఆమె భర్త
  • అమిత్ సిన్హా: కల్లూరి; సుమతి జ్యోతిష్కుడు (2021)
  • షిర్లీ: రాజమాత; కాకతీయ రాజవంశ రాణి తల్లి; గణపతిదేవ, హరిహర దేవుని, మురారీ దేవుని తల్లి; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ, విశ్వ, గణపంభ, అమరావతి నానమ్మ; ఆమె మూస ధోరణి, మగ వారసుల పట్ల పాక్షికంగా ఉండే కఠినమైన వ్యక్తి. రుద్రదేవుడు అబ్బాయి అని తెలుసుకున్నప్పుడు, గణపతి దేవున్ని మగ వారసుడి కోసం మళ్ళీ వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. (2021-ప్రస్తుతం)
  • దుర్గా ప్రసాద్: గోపాల; హరిహర దేవా సైడ్ కిక్ (2021-ప్రస్తుతం)
  • గుండ్ర శ్రీనివాస్ రెడ్డి: జ్ఞానేశ్వర దీక్షితులు; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ గురువు (2021-ప్రస్తుతం)
  • మౌతిక శర్మ: గణపంభ; గణపతి దేవుడు, సోమంబ కుమార్తె; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ చెల్లెలు (2021-ప్రస్తుతం)
  • మన్నన్: విశ్వేశ్వర దేవా "విశ్వ"; హరిహర దేవుని, తిరుమల కుమారుడు; రుద్రమదేవి (లేదా) రుద్రదేవుని (2021-ప్రస్తుతం) అసూయపడే మోసపూరిత కుర్రాడు
  • సియా మక్వానా: అమరావతి; మురారిదేవుడు, సుమతి కుమార్తె; రుద్రమదేవి (లేదా) రుద్రదేవ బంధువు (2021-ప్రస్తుతం)
  • రోహన్ జాదవ్: గోన గన్నారెడ్డి; గురుకుల్‌లో రుద్రమదేవి (లేదా) రుద్ర స్నేహితుడు (2021-ప్రస్తుతం)
  • సోహం జాదవ్: మహాదేవుడు; యాదవ రాజ్య యువరాజు, రుద్రమదేవి (లేదా) రుద్రదేవుని ప్రత్యర్థి (2021-ప్రస్తుతం)
  • విరాజ్ మోడ్గిల్: అంబ దేవుడు; గురుకుల్ విద్యార్థి (2021-ప్రస్తుతం)

నిర్మాణం

మార్చు

ఈ సీరియల్ 2020, నవంబరులో ప్రారంభించబడి, డిసెంబరులో టీజర్‌ విడుదల చేయబడింది.[8] [9] 2021 జనవరి 18న ప్రసారం చేయబడి, 2021 మే 26న ముగిసింది.

మూలాలు

మార్చు
  1. "Catch the revolutionary Rudrama Devi on Star Maa". Telugu Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-18. Retrieved 2021-01-26.
  2. Telugu360 (2021-01-18). "The epic journey of Queen Rudrama Devi on Star Maa". Telugu360.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Press Note : Watch Star Maa's New show Rani Rudrama Devi". 123telugu.com (in ఇంగ్లీష్). 2021-01-18. Retrieved 2021-01-26.
  4. santosham. "రాణీ రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా నూతన సీరియల్‌ను ప్రకటించిన స్టార్‌ మా - Santosham Magazine" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-01-26.
  5. Rajesh, Srividya (2020-12-14). "Peninsula Pictures to make RudraMaa Devi for Star Maa: Amit Sinha roped in". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-26.
  6. "Rudramadevi: బుల్లితెర‌పై వీర‌నారి 'రుద్ర‌మ‌దేవి' ధారావాహిక.. ఇవాళ్టి నుంచే ప్రసారం". News18 Telugu. 2021-01-18. Retrieved 2021-01-26.
  7. "మహాసామ్రాజ్ఞి వీర గాథ". ntnews. 2021-01-17. Retrieved 2021-01-26.
  8. "Star Maa announces new fiction show Rudhrama Devi; launches promo in Bigg Boss 4 grand finale". MediaNews4U (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-21. Retrieved 2021-01-26.
  9. "బుల్లితెరపై 'రుద్రమదేవి'.. హైప్ ఇచ్చిన బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున". Samayam Telugu. Retrieved 2021-01-26.