ఆనంద్ (జ.1968 ఫిబ్రవరి 21) భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించాడు. కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. అతను అనేక మలయాళ టెలివిజన్ సీరియళ్లలో నటించాడు.

ఆనంద్
జననం
ఆనంద్

(1968-02-21)1968 ఫిబ్రవరి 21
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
ఎత్తు6
జీవిత భాగస్వామిపూర్ణిమ
పిల్లలు1

ఈ నటుడు ఇప్పటివరకు చేసిన అతిపెద్ద చిత్రం మణిరత్నం బ్లాక్ కామెడీ చిత్రం తిరుడా తిరుడా, కానీ ఆ చిత్రంలో అతని సహనటుల మాదిరిగా పురోగతి చెందకుండా తిరోగమనంలోకి వెళ్ళాడు. కమల్ హాసన్ నటించిన సత్య, విజయకాంత్ నటించిన పూంతొట్టా కావల్కరన్ వంటి అనేక చిత్రాలలో అతను ద్వితీయ శ్రేణిలో ప్రధాన పాత్రలు, సహాయక పాత్రలను పోషించాడు.[1]

జీవితం

మార్చు

అతను 1987లో వన్నా కనవుగై సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు.[2][3] అతను టొరంటోలో ప్రదర్శించబడిన సత్య (1988), అంబే ఎన్ అంబే (1988), అపూర్వ సగోదరగై (1989), ఊర్ మరియాదై (1992), తిరుద తిరుద (1993) వంటి చిత్రాలలో అతనికి మంచి పేరు వచ్చింది[4][5]

ఆనంద్ మలయాళ లఘు చిత్రం "కస్సు పనం తుట్టు మనీ మనీ"ను నిర్మించి దర్శకత్వం వహించాడు.[6][7] క్యారెక్టర్ యాక్టర్‌గా ఆయన ఇటీవల నటించిన సినిమాలలో 1: నేనొక్కడినే (2014), రింగ్ మాస్టర్ (2014), ఇవాన్ మర్యాదరామన్ (2015), శ్రీమంతుడు (2015), జెంటిల్‌మన్ (2016) వంటి హిట్స్ ఉన్నాయి.[8]

వ్యక్తిగత జీవితం

మార్చు

అతను హైదరాబాదులో వి.ఎస్.భారతి, రాజ్యలక్ష్మి దంపతులకు చిన్న కుమారునిగా 1968 ఫిబ్రవరి 21న జన్మించాడు. అతని తండ్రి బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్ లో పనిచేసేవాడు. అతని తల్లి గృహిణి. అతని సోదరుడు బి. రమేష్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక ఉపాధ్యక్షుడు. బి.సురేష్ ఇంగ్లీష్ వివేకానంద కళాశాలలో ఉపాధ్యాయుడు. మూడవ సోదరుడు భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ అయిన భరత్ అరుణ్. ఆనంద్ తిరువనంతపురంలో జెంజెర్రో అనే రెస్టారెంట్ కూడా కలిగి ఉన్నారు.[7][6]

సినిమాలు

మార్చు

తెలుగు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Google Groups". Groups.google.com. Retrieved 2020-04-07.
  2. "Rediff On The NeT, Movies: Our weekly box office update". Rediff. Retrieved 2012-05-18.
  3. "rediff.com, Movies: Gossip from the southern film industry". Rediff. 2000-06-30. Retrieved 2012-05-18.
  4. Nayar, Parvathi (25 June 2010). "Jewel of Indian cinema". AsiaOne. Retrieved 19 May 2012.
  5. Ramya Kannan (9 August 2002). "Facts on films". The Hindu. Archived from the original on 26 సెప్టెంబరు 2014. Retrieved 24 November 2014.
  6. 6.0 6.1 {{url=http://www.imdb.com/name/nm0025606/bio?ref_=nm_ov_bio_sm / |accessdate=24 October 2017}}
  7. 7.0 7.1 {{url=http://actoranand.com/about-anand/ |accessdate=24 October 2017}}
  8. "Burglars strike at actor Anand's house ". The Times of India. 2008-08-01. Archived from the original on 2013-11-19. Retrieved 2012-05-18.

బాహ్య లంకెలు

మార్చు