రుబెల్లా టీకా

రుబెల్లా నివారణకు ఉపయోగించే టీకా

రుబెల్లా టీకాను రుబెల్లా నివారణకు ఉపయోగించుతారు. ఒక మోతాదు తీసుకున్న రెండు వారాల తర్వాత ప్రభావం చూపడం ఆరంభమవుతుంది. సుమారు 95% మంది రోగనిరోధక శక్తిని పొందుతారు. అధిక శాతం రోగనిరోధకత ఉన్న దేశాలలో ఇకపై రుబెల్లా వ్యాధి కానీ లేదా పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్ (సి.ఆర్.ఎస్.) కేసులను కనపడకపోవచ్చు. పిల్లలలో రోగనిరోధకత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, పుట్టుకతో వచ్చే రుబెల్లా కేసులు పెరగడం సాధారణంగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు టీకాలు వేయడం లేదా వ్యాధికి గురికాకుండా పిల్లలను కనే వయస్సులో ఉంటారు. అందువల్ల, 80% కంటే ఎక్కువ మందికి టీకాలు వేయడం చాలా ముఖ్యం[1]. రుబెల్లాకి టీకాలను ఇవ్వడం ద్వారా, 2020 మధ్య నాటికి 81 దేశాలలో రుబెల్లా నిర్మూలించబడింది[2].

రుబెల్లా టీకా
తట్టు వ్యాధి, గవదబిళ్ళల వ్యాధి టీకాలతో కలిపిన MMR టీకా
Clinical data
వాణిజ్య పేర్లు మేరువాక్స్,
MedlinePlus a601176
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి ?
Identifiers
ATC code ?
Synonyms MR టీకాగా, MMR టీకా, MMRV టీకా
Chemical data
Formula ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రుబెల్లా టీకాను సాధారణంగా ఇచ్చే టీకాలలో చేర్చాలని సిఫార్సు చేస్తుంది. ప్రజలందరికీ రోగనిరోధక శక్తికి టీకా (ఇమ్మునైజేషన్ ) ఇవ్వకపోయినా తప్పనిసరిగా కనీసం పిల్లలను కనే వయస్సు గల మహిళలకు ఇవ్వాలి. అయితే ఇది వారికి గర్భం ధరించినప్పుడు లేదా చాలా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇవ్వకూడదు. జీవితకాల రక్షణకు కేవలం ఒక మోతాదు సరిపోతుంది, అవసరమైతే, తరచుగా రెండు మోతాదులు ఇస్తారు [1].

ఈ టీకా వలన కలిగే దుష్ప్రభావాలు సాధారణంగా తేలికపాటివి. వాటిలో జ్వరం, దద్దుర్లు, ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో నొప్పి, ఎరుపు ఉండవచ్చు. మహిళల్లో టీకా తీసుకున్న తరువాత ఒకటి నుండి మూడు వారాల మధ్య కీళ్ల నొప్పి అని చెపుతుంటారు. తీవ్రమైన అలెర్జీలు అరుదు. రుబెల్లా టీకా అనేది సజీవంగా క్షీణింపచేసిన టీకా. ఇది కేవలం రుబెల్లా టీకాగా లేదా ఇతర టీకాలతో కలిపి అందుబాటులో ఉంటుంది. సాధారణంగా తట్టు వ్యాధి టీకా తో కలిపి MR టీకాగా, తట్టు వ్యాధి, గవదబిళ్ళల వ్యాధి టీకాలతో కలిపి MMR టీకా, ఇంకా తట్టు వ్యాధి, గవదబిళ్ళు వరిసెల్లా టీకా కలిపి (MMRV vaccine) గాఉపయోగిస్తారు[1].

మొదటిసారిగా రుబెల్లా టీకా 1969లో అనుమతులు (లైసెన్స్) పొందింది[3]. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చింది [4]. 2009 నాటికి , 130 పైగా దేశాలు తాము సాధారణంగా ఇచ్చే టీకాలలో దీనిని చేర్చాయి[1]. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో MMR టీకా టోకు ధర 2014 నాటికి మోతాదుకు US $0.24[5]. యునైటెడ్ స్టేట్స్ లో దీని ధర US $50 మరియు US $100 మధ్య ఉంటుంది[6].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 World Health Organization (July 2011). "Rubella vaccines : WHO position paper". Weekly Epidemiological Record. 86 (29): 301–16. hdl:10665/241786. PMID 21766537.
  2. Suryadevara, Manika (2021). "27. Rubella". In Domachowske, Joseph; Suryadevara, Manika (eds.). Vaccines: A Clinical Overview and Practical Guide (in ఇంగ్లీష్). Switzerland: Springer. pp. 323–332. ISBN 978-3-030-58416-0. Archived from the original on 2022-01-06. Retrieved 2022-01-06.
  3. Atkinson, William (2011). Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (12 ed.). Public Health Foundation. pp. 301–323. ISBN 9780983263135. Archived from the original on 2017-05-01. Retrieved 1 March 2015.
  4. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  5. "Vaccine, Measles-Mumps-rubella". International Drug Price Indicator Guide. Archived from the original on 16 January 2016. Retrieved 8 December 2015.
  6. Hamilton, Richart (2015). Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition. Jones & Bartlett Learning. p. 315. ISBN 9781284057560.