రుబెల్లా

రుబెల్లా వైరస్ వల్ల కలిగే సంక్రమణం

రుబెల్లా అనేది రుబెల్లా వైరస్ వల్ల కలిగే సంక్రమణం. దీనిని జర్మన్ తట్టు లేదా మూడు రోజుల తట్టు అని కూడా పిలుస్తారు[1][2]. "రుబెల్లా" అనే పేరు లాటిన్ నుండి వచ్చింది, అంటే చిన్న ఎరుపు అని అర్ధం. దీనిని మొట్టమొదట 1814లో జర్మన్ వైద్యులు ఒక ప్రత్యేక వ్యాధిగా వర్ణించారు, ఫలితంగా దీనికి "జర్మన్ మీజిల్స్" అనే పేరు వచ్చింది[3].

రుబెల్లా
ఇతర పేర్లుజర్మన్ తట్టు లేదా మూడు రోజుల తట్టు
పిల్లల వీపుపై రుబెల్లా కారణంగా లేత ఎరుపు రంగులో దద్దుర్లు..
ప్రత్యేకతవైరస్ సంక్రమణం.
లక్షణాలుదద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, అలసటగా అనిపించడం
సంక్లిష్టతలుజ్వరం, గొంతు నొప్పి, అలసట, కీళ్ల నొప్పి, రక్తస్రావం సమస్యలు, వృషణ వాపు, నరాల వాపు ఉండవచ్చు.
సాధారణ ప్రారంభందద్దుర్లు బహిర్గతం అయిన రెండు వారాల తర్వాత
కాల వ్యవధి3 రోజులు
కారణాలురుబెల్లా వైరస్ వల్ల కలిగే సంక్రమణం
రోగనిర్ధారణ పద్ధతిరక్తం, గొంతు లేదా మూత్రంలో వైరస్‌ని గుర్తించే పరీక్షలు
నివారణరుబెల్లా టీకా
తరుచుదనముసాధారణం

లక్షణాలు

మార్చు

ఈ వ్యాధి సాధారణముగా తేలికపాటిది, సగం మంది తమకు వ్యాధి సోకిందని కూడా గ్రహించరు[3][4]. దద్దుర్లు బహిర్గతం అయిన రెండు వారాల తర్వాత ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగవచ్చు. ఇది సాధారణంగా ముఖం మీద ప్రారంభమై శరీరం మిగిలిన భాగాలకు వ్యాపిస్తుంది. దద్దుర్లు కొన్నిసార్లు దురదగా ఉంటాయి, మీజిల్స్ (తట్టు) లాగా ఇవి ప్రకాశవంతంగా ఉండవు. సాధారణంగా శోషరస కణుపులలో వాపు ఉంటుంది, ఇది కొన్ని వారాల పాటు ఉండవచ్చు. జ్వరం, గొంతు నొప్పి, అలసట కూడా సంభవించవచ్చు[3][5]. దీని వలన పెద్దవాళ్లలో కీళ్ల నొప్పి సర్వసాధారణంగా కనపడుతుంటుంది. సంక్లిష్టతలలో రక్తస్రావం సమస్యలు, వృషణ వాపు, నరాల వాపు ఉండవచ్చు[3]. గర్భధారణ ప్రారంభంలో సంక్రమణకు గురైతే గర్భస్రావం జరగవచ్చు లేదా జన్మించే బిడ్డకు పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్ (సి.ఆర్.ఎస్.) ఏర్పడవచ్చు. సి.ఆర్.ఎస్. ఫలితంగా కంటిశుక్లం వంటి కళ్ళ సమస్యలు, చెవిటితనం, అలాగే గుండె, మెదడుతో సమస్యలు ఏర్పడవచ్చు. అయితే గర్భం దాల్చిన 20వ వారం తర్వాత ఇలాంటి సమస్యలు చాలా అరుదు[2].

వ్యాధి నిర్ధారణ

మార్చు

సాధారణంగా రుబెల్లా సోకిన వ్యక్తుల దగ్గు ద్వారా, గాలి ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది[6]. దద్దుర్లు కనిపించే ముందు, తరువాత వారంలో కూడా ప్రజలు అంటువ్యాధి సంక్రమణం జరుగవచ్చు. సిఆర్ఎస్ తో ఉన్న పిల్లలు ఒక సంవత్సరానికి పైగా వైరస్ వ్యాప్తి చెందించగలుగుతారు[3]. మానవులకు మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది [2]. కీటకాలు వ్యాధిని వ్యాప్తి చేయవు[3]. కోలుకున్న తర్వాత, ప్రజలు భవిష్యత్తులో సంక్రమించే వ్యాధులకు నిరోధకత (ఇమ్మ్యూనిటి) కలిగి ఉంటారు. రోగనిరోధక శక్తిని ధృవీకరించే పరీక్షలు అందుబాటులో ఉన్నాయి[2]. రక్తంలో, గొంతు లేదా మూత్రంలో వైరస్ ను గుర్తించడం ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది. ప్రతిరక్షకాల ఉనికి కోసం రక్తాన్ని పరీక్షించడం కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు[3].

నివారణ

మార్చు

రుబెల్లా టీకా రుబెల్లాను నివారించగలదు, ఒకే మోతాదు 95% పైగా ప్రభావవంతంగా ఉంటుంది. తరచుగా ఇది తట్టు టీకా, గవదబిళ్ళ టీకా కలయికతో ఇస్తారు. దీనిని MMR టీకా (మీజిల్స్ , మంప్స్, రుబెల్లా) అని పిలుస్తారు[3]. జనాభాలో 80% కంటే తక్కువ మందికి టీకాలు వేసినప్పుడు, చాలా మంది మహిళలు ఈ వ్యాధి సంక్రమణం సోకకుండా అంటే టీకా ద్వారా రోగనిరోధక శక్తిని పొందకపోయినా, పిల్లలను కనే వయస్సుకు చేరుకోవచ్చు. అయితే తద్వారా బహుశా సిఆర్ఎస్ రేట్లు పెరుగే అవకాశం ఉంది[2]. ఒకసారి వ్యాధి సోకినప్పుడు నిర్దిష్ట చికిత్స లేదు[5].

వ్యాప్తి

మార్చు

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో రుబెల్లా ఒక సాధారణ వ్యాధి[5]. ప్రతి సంవత్సరం పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్ కేసులు100,000 సంభవిస్తున్నాయి[2]. టీకా ఫలితంగా అనేక ప్రాంతాల్లో వ్యాధి ఉధృతం తగ్గింది[5][4]. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని నిర్మూలించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. [2]. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 2015లో అమెరికాను రుబెల్లా సంక్రమణ రహితంగా ప్రకటించింది[7][8].

మూలాలు

మార్చు
  1. Neighbors, M; Tannehill-Jones, R (2010). "Childhood diseases and disorders". Human diseases (3rd ed.). Clifton Park, New York: Delmar, Cengage Learning. pp. 457–79. ISBN 978-1-4354-2751-8.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 (7 January 2015). "Rubella.".
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Atkinson, William (2011). Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (12 ed.). Public Health Foundation. pp. 301–323. ISBN 9780983263135. Archived from the original on 2017-05-01. Retrieved 2017-05-05.
  4. 4.0 4.1 (15 July 2011). "Rubella vaccines: WHO position paper.".
  5. 5.0 5.1 5.2 5.3 Huong McLean (2014). "3 Infectious Diseases Related To Travel". CDC health information for international travel 2014 : the yellow book. ISBN 9780199948499. Archived from the original on 2015-04-24.
  6. "Rubella (German Measles, Three-Day Measles)". cdc.gov. December 17, 2014. Archived from the original on 2 April 2015. Retrieved 30 March 2015.
  7. Donald G. McNeil Jr. (April 29, 2015). "Rubella Has Been Eliminated From the Americas, Health Officials Say". The New York Times. Archived from the original on May 1, 2015. Retrieved April 30, 2015.
  8. "Americas region is declared the world's first to eliminate rubella". PAHO. 29 April 2015. Archived from the original on 18 May 2015. Retrieved 6 May 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=రుబెల్లా&oldid=4340925" నుండి వెలికితీశారు