రుస్తోమ్జీ జంషెడ్జీ

రుస్తోమ్జీ జంషెడ్జీ దొరాబ్జీ జంషెడ్జీ (1892 నవంబరు 18 - 1976 ఏప్రిల్ 5) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.[1]

రుస్తోమ్జీ జంషెడ్జీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుస్తోమ్జీ జంషెడ్జీ దొరాబ్జీ జంషెడ్జీ
పుట్టిన తేదీ(1892-11-18)1892 నవంబరు 18
బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ
మరణించిన తేదీ1976 ఏప్రిల్ 5(1976-04-05) (వయసు 83)
బొంబాయి, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left arm orthodox
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 14)1933 డిసెంబరు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 29
చేసిన పరుగులు 5 291
బ్యాటింగు సగటు 11.19
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 4* 43
వేసిన బంతులు 210 5,835
వికెట్లు 3 134
బౌలింగు సగటు 45.66 22.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 3/137 7/61
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 7/–
మూలం: ESPNcricnfo, 2022 జూన్ 9

జంషెడ్జీ భారతదేశం తరపున ఒకే టెస్టు ఆడిన ఎడమ చేతి స్పిన్నరు. అతను 41 సంవత్సరాల 27 రోజుల వయస్సులో తన తొలి టెస్టు ఆడాడు. అంత పెద్ద వయసులో తొలి టెస్టు ఆడిన భారతీయులలో అతనిది ఇప్పటికీ రికార్డు.[2] 1933/34లో ఇంగ్లండ్‌తో బాంబే జింఖానాలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

జంషెడ్జీ సాధించిన విజయాలు చాలా వరకు బాంబే క్వాడ్రాంగులర్‌లో ఉన్నాయి. పార్సీల తరఫున ఆడుతూ, అతను 1922/23 ఫైనల్‌లో హిందువులపై 122 పరుగులకు 11 వికెట్లు తీసుకున్నాడు. 1928/29 ఫైనల్‌లో యూరోపియన్‌లపై 104 పరుగులకు 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ రెండో సందర్భంలో, 'మ్యాచ్ తర్వాత ఆనందోత్సాహాల దృశ్యాలు కనిపించాయి. పార్సీ జట్టు అభిమానులు గుమిగూడారు'. జంషెడ్‌జీ కుర్చీలో కూచోబెట్టి పెవిలియన్‌కు మోసుకెళ్లారు.


జంషెడ్జీ 1920ల ప్రారంభంలో బాంబే టోర్నమెంటులో ఆడినప్పుడు ఇంగ్లీష్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విల్‌ఫ్రెడ్ రోడ్స్‌ను చూశాడు. రోడ్స్ జంషెడ్‌జీకి ఇలా చెప్పాడని అంటారు: మీకున్న స్పిన్ నేర్పు నా దగ్గర ఉంటేనా, అవతలి జట్టును వంద కూడా చెయ్యనివ్వను. జంషెడ్‌జీ తన వేలిని మృదువుగా ఉంచుకోవడానికి వయోలిన్ రెసిన్‌ని జేబులో పెట్టుకునేవాడు.

గమనికలు మార్చు

  • తన క్రిక్‌ఇన్‌ఫో కథనంలో ఫ్రమ్ పాల్వాంకర్ టూ నాయుడు, పర్తాబ్ రాంచంద్ అతనికి "రుసి" జంషెడ్‌జీ అని పేరు పెట్టారు. [3] రామచంద్ర గుహ అతన్ని "జమ్సు" అని పిలుచుకుంటారు.

మూలాలు మార్చు

  1. "Rustomji_Jamshedji". ESPN Cricinfo. Retrieved 15 May 2020.
  2. "Steven Lynch-Debut stands, Patto's improvement". ESPN Cricinfo. Retrieved 15 May 2020.
  3. "From Palwankar to Nayudu". ESPN Cricinfo. Retrieved 15 May 2020.