పార్సీ క్రికెట్ జట్టు
పార్సీ క్రికెట్ జట్టు వార్షిక బొంబాయి టోర్నమెంట్‌లో పాల్గొనే భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఈ జట్టును బొంబాయిలోని జొరాస్ట్రియన్ కమ్యూనిటీ సభ్యులు స్థాపించారు. ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉండేది.
మారుపేరు | Parsees |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
యజమాని | పార్సీ జింఖానా |
జట్టు సమాచారం | |
నగరం | ముంబై |
స్థాపితం | 1877 |
స్వంత మైదానం | పార్సీ జింఖానా మైదానం |
చరిత్ర | |
బాంబే టోర్నమెంటు విజయాలు | 10 |
అధికార వెబ్ సైట్ | https://www.parseegymkhana.in |
పార్సీ క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు ముంబై క్రికెట్ జట్టు లోను, భారత జాతీయ క్రికెట్ జట్టు లోనూ ఆడారు.
బొంబాయి చతుర్భుజి
మార్చుపార్సీలు 1877లో బాంబే టోర్నమెంట్‌లో పోటీ చేసారు. వారు బొంబాయి జింఖానాలో యూరోపియన్ల క్రికెట్ జట్టును రెండు రోజుల మ్యాచ్‌కి సవాలు చేశారు. అప్పుటి నుండి మొదలైన ఆ రెండు జట్ల పోటీని ప్రెసిడెన్సీ మ్యాచ్ అని పిలిచేవారు. [1] దీన్ని 1892-93 నుండి 1945-46లో చివరి దశ వరకు ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌గా గుర్తించారు. పార్సీలు ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌ను సొంతంగా 10 సార్లు గెలుచుకోగా, మరో 11 సార్లు వేరే జట్టుతో విజయాన్ని పంచుకున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలు
మార్చు1880లలో పార్సీలు ఇంగ్లండ్‌లో రెండు సార్లు పర్యటించారు. అయితే వాళ్ళు అక్కడ ఆడిన మ్యాచ్‌లలో దేన్నీ ఫస్ట్-క్లాస్‌గా గుర్తించలేదు.[2]
ప్రముఖ ఆటగాళ్లు
మార్చుపార్సీ క్రికెట్ జట్టులో ఆడిన ఆడుతున్న ప్రముఖ ఆటగాళ్ల జాబితా ఇద: [3]
మూలాలు
మార్చు- ↑ Guha, p. 16.
- ↑ Guha, pp. 29–33.
- ↑ https://timesofindia.indiatimes.com/sports/cricket/news/parsee-gymkhana-create-history-by-winning-third-successive-title/articleshow/88520509.cms%7Cwebsite=www.timesofindia.indiatimes.com%7Cstatus=live%7Ctitle=Parsee Gymkhana create history by winning third successive title