రూఖ్మాబాయ్
రూఖ్మాబాయ్ ( నవంబర్ 22, 1864 - సెప్టెంబర్ 25, 1955 ) వైద్యురాలు, స్త్రీవాది.
రూఖ్మాబాయ్ | |
---|---|
జననం | 1864 నవంబరు 22 |
మరణం | 1955 సెప్టెంబరు 25 | (వయసు 90)
వృత్తి | వైద్యురాలు, స్త్రీవాది. |
తొలినాళ్ళ జీవితం
మార్చుఈమె నవంబర్ 22, 1864 న జనార్ధన్ పాండురంగ్, జయంతిబాయి దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి తన రెండు సంవత్సరాల వయస్సులో, తల్లి తన పదిహేడేళ్ళ వయసులో కన్నుమూశారు. తన భర్త మరణించిన ఆరు సంవత్సరాల తరువాత, జయంతిబాయి ముంబైలో ఒక వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన వితంతువు డాక్టర్ సఖారామ్ అర్జున్‌ను వివాహం చేసుకుంది.[1][2][3] తన 11 ఏళ్ల ప్రాయంలో తన సవతి తండ్రి బంధువు అయినటువంటి 19 ఏళ్ల దాదాజీ భికాజీని వివాహం చేసుకుంది.[2]
కెరీర్
మార్చుఈమె చదువుకు డాక్టర్ ఎడిత్ పెచే వంటి వారి నుండి ఆర్థిక సహాయం లభించింది, ఆమె తదుపరి విద్య కోసం శివాజీరావ్ హోల్కర్, ఇవా మెక్లారెన్, వాల్టర్ మెక్లారెన్ వంటి వాళ్ళు 500 రూపాయలను తన చదువు కోసం విరాళంగా ఇచ్చారు. ఇలా కొంత మంది సామాజిక కార్యకర్తల సహకారంతో ఈమె 1889 లో ఇంగ్లాండ్ లో మెడిసిన్ అధ్యయనం కోసం బయలుదేరారు. 1894 లో, రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లో చదువుకున్న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టాను అందుకుంది. వైద్యులు కదంబిని గంగూలీ, ఆనంది గోపాల్ జోషి 1886 లో వైద్య డిగ్రీలు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళలు. తన చదువు పూర్తి అయిన అనంతరం 1895 లో ఈమె భారతదేశానికి తిరిగి వచ్చి సూరత్‌లోని మహిళా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. 1929 లో పదవీ విరమణ చేసే వరకు రాజ్‌కోట్‌లోని జెనానా (ఉమెన్స్) స్టేట్ హాస్పిటల్‌లో పనిచేశారు. ఈమె తన పదవీ విరమణ తర్వాత ముంబై లో స్థిరపడింది.[4]
గుర్తింపులు
మార్చుసూరత్లోని ఒక ఆసుపత్రికి ఈమె పేరు పెట్టారు. నవంబర్ 22, 2017 న తన 153 వ పుట్టినరోజును పురస్కరించుకొని గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ లో గూగుల్ డూడుల్‌తో మొదటి పేజీలో పెట్టింది.
మరిన్ని విశేషాలు
మార్చుఈమె 1929 లో తన పదవి విరమణ చేసిన అనంతరం "పర్దా - దాని రద్దు చేయవలసిన అవసరం" అనే పేరుతో ఒక కరపత్రాన్ని ప్రచురించింది. ఈ కరపత్రం యువ వితంతువులు సమాజంలో ఎలా నడుచుకోవాలనే దానిపై వివరించారు. 2008 లో రుఖ్మాబాయి, ఆమె భర్త మధ్య జరిగిన న్యాయ కేసు యొక్క ప్రత్యేకతలులను రచయిత సుధీర్ చంద్ర రాసిన "ఎన్స్లేవ్డ్ డాటర్స్: కలోనియలిజం, లా అండ్ ఉమెన్స్ రైట్స్" అనే పేరుతో పుస్తకం ప్రచురించబడింది. ఈమె జీవిత కథను 2016లో డాక్టర్ రాఖ్మాబాయి అనే పేరుతో అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో తన్నిష్తా ఛటర్జీ ప్రధాన పాత్రలో సినిమాగా చిత్రీకరించారు. ఈ సినిమాను డాక్టర్ స్వాప్నా పాట్కర్ నిర్మించారు. ఈమెకు "రుఖ్మాబాయి రౌత్" అని పేరు పెట్టినప్పటికీ ఆమె తన తండ్రి, సవతి తండ్రి లేదా దాదాజీ ఇంటిపేరును ఉపయోగించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఆమె తన వైద్య వృత్తిలో "రుఖ్మాబాయి" గా సంతకం చేసింది. ఈమె తన పేరును జనరల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్తో కూడా "రుఖ్మాబాయి" గానే నమోదు చేసింది.
సంస్కరణవాది
మార్చురూఖ్మాబాయి వివాహం అయిన తర్వాత సవితి తండ్రి చదవడానికి ప్రోత్సాహం, సహకారం ఎంతో గానో అందించాడు. రూఖ్మాబాయికి ఇరవై ఏళ్ళు నిండగానే భర్త భికాజీ కాపురం చేయడానికి పిలవడం ప్రారంభించాడు. రూఖ్మాబాయి కాపురానికి వెళ్లనని చెప్పింది, దీంతో భికాజీ కోర్టును ఆశ్రయించాడు. క్రింది స్థాయి న్యాయస్థానంలోరూఖ్మాబాయికి అనుకూలంగా తీర్పురావడం, అయితే భర్త భికాజీ హైకోర్ట్ కు వెళ్లినాడు. హైకోర్టులో తీర్పు భికాజీ కి అనుకూలంగా తీర్పు రావడం, రూఖ్మాబాయి తాను జరిమినా కట్టగలనని, కాపురంకు మాత్రం వెళ్లనని చెప్పింది. చివరకు రూఖ్మాబాయి కేసు సమాజములో ఉన్న బాల్య వివాహాలపై వెళ్ళి రూఖ్మాబాయి సవితి తండ్రి, సమాజములో ఉన్న బాల్య వివాహాల వ్యతిరేకంగా ఉన్న సంస్కరణవాదుల మద్దతు, ప్రోత్సాహం రావడం జరిగింది . ఈ విషయం గురించి రుక్మాబాయి బ్రిటిష్ రాణి విక్టోరియాకు ఈ దురాగతం పై లేఖను రాసింది. బ్రిటిష్ రాణి విక్టోరియా చొరవ తీసుకుని, రూఖ్మాబాయికి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పెళ్లిని రద్దుచేయడం, జరిమానా / జైలు శిక్షనుంచి తప్పిస్తూ ప్రత్యేకమైన ఆదేశాలను బ్రిటిష్ రాణి విక్టోరియా ఇచ్చింది. తదుపరి బ్రిటిష్ ప్రభుత్వం 1891 సంవత్సరంలో “ఏజ్ ఆఫ్ కాన్సెన్ట్ (లైంగికచర్యకు అంగీకారం) చట్టం తీసుకరావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం లైంగికచర్య అంగీకార వయస్సును 12 సంత్సరాలుగా నిర్ణయించబడినది. ఒక వైపు స్వాతంత్ర్య సమరము జరగడం, మరో వైపు సామజిక మార్పు చట్టాలు రావడానికి రూఖ్మాబాయి వంటి ఎందరో సంస్కరణ వాదులు రావడం ఆనాటి నుంచి మొదలైనదని, ఈ బలమైన మార్పుకు రుక్మాబాయి శ్రీకారం చుట్టిందని పేర్కొనవచ్చును.[5]
మరణం
మార్చుఈమె నవంబర్ 25, 1955 న మరణించారు.
మూలాలు
మార్చు- ↑ Anagol-Mcginn, Padma (1992). "The Age of Consent Act (1891) Reconsidered: Women's Perspectives and Participation in the Child-Marriage Controversy in India". South Asia Research. 12 (2): 100–118. doi:10.1177/026272809201200202.
- ↑ 2.0 2.1 Chandra, Sudhir (2008). Enslaved Daughters: Colonialism, Law and Women's Rights (in ఇంగ్లీష్). Oxford University Press. doi:10.1093/acprof:oso/9780195695731.001.0001. ISBN 978-0-19-569573-1.
- ↑ Burton, Antoinette (1998-03-30). At the Heart of the Empire: Indians and the Colonial Encounter in Late-Victorian Britain (in ఇంగ్లీష్). University of California Press. ISBN 978-0-520-91945-7.
- ↑ Jayawardena, Kamari (2014). White Women's Other Burden: Western Women and South Asia during British Rule. Routledge.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2021-12-18.