రూపల్ పటేల్
రూపల్ పటేల్, మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. సాత్ నిభానా సాథియా సీరియల్ లో కోకిలా మోడీ పాత్రను, యే రిష్టే హై ప్యార్ కే సీరియల్ లో మీనాక్షి రాజ్‌వంశ్ పాత్రను పోషించింది.[1] 2020లో షోను ప్రమోట్ చేయడంకోసం సాథ్ నిభానా సాథియా రెండవ సీజన్‌లోకోకిల మోడీ పాత్రను తిరిగి పోషించింది.[2]
రూపల్ పటేల్ | |
---|---|
జననం | 1974/1975 (age 49–50) |
విద్య | ముంబయి విశ్వవిద్యాలయం (బికాం) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (లలిత కళలు) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1991–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సాథ్ నిభానా సాథియా యే రిష్టే హై ప్యార్ కే తేరా మేరా సాథ్ రహే |
జీవిత భాగస్వామి | రాధాకృష్ణ దత్ |
జననం, విద్య
మార్చురూపల్ పటేల్ 1974 లేదా 1975లో మహారాష్ట్ర రాజధాని బొంబాయిలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. కామర్స్‌లో డిగ్రీతోపాటు న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో శిక్షణ పొందింది.[3][4]
వ్యక్తిగత జీవితం
మార్చునటుడు రాధాకృష్ణ దత్‌తో రూపల్ పటేల్ వివాహం జరిగింది.[5]
నటనారంగం
మార్చు1985–2009
మార్చుపిల్లల నాటకాల కోసం పనోరమా ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను ఏర్పాటుచేసింది.[1] రేపాల్ పటేల్ 1985లో మెహక్ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదట బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1] అంతర్నాద్ (1991), సూరజ్ కా సత్వన్ ఘోడా (1992), పపీహా (1993), మమ్మో (1994), సమర్ (1999) వంటి ఇతర బాలీవుడ్ చిత్రాలలో నటించింది.[3] వీటిలో కొన్ని చిత్రాలకు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించారు.[6]
2001లో స్టార్ ప్లస్‌లో జరీనా మెహతా తీసిన షాగున్ సీరియల్ తో లఖీ పాత్ర ద్వారా హిందీ టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించింది.[7] 2002లో సౌ దాదా ససునాలో ఆశాలత పాత్రను, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో క్రైమ్ పెట్రోల్ అనే ప్రసిద్ధ క్రైమ్ థ్రిల్లర్ షో కొన్ని ఎపిసోడ్‌లలో నటించింది.[4] 2009లో కలర్స్ టివిలో[5] లిమిటెడ్ ప్రొడక్షన్ జానే క్యా బాత్ హుయ్‌లో వృందా పాత్రను పోషించింది.
2010–ప్రస్తుతం
మార్చు2010 నుండి 2017 వరకు స్టార్ ప్లస్‌లో వచ్చిన సాథ్ నిభానా సాథియాలో స్ట్రిక్ట్ కోకిల మోడీగా నటించి, తన నటనకు విపరీతమైన ప్రజాదరణ, ప్రశంసలు పొందింది.[8][9]
2019లో జీ టీవీలో ప్రతీక్ శర్మ తీసిన మన్మోహినిలో ఉష/కుబర్జ్రా పాత్రలో అతిథి పాత్రలో నటించింది.[10] 2019 మార్చి నుండి 2020 అక్టోబరు వరకు స్టార్ ప్లస్‌లో ప్రసారమైన డైరెక్టర్స్ కుట్ ప్రొడక్షన్స్ టెలివిజన్ షో యే రిష్టే హై ప్యార్ కేలో మీనాక్షి రాజ్‌వంశ్ కపాడియా బూడిద పాత్రను పోషించింది.[11][12]
2020 అక్టోబరులో యే రిష్టే హై ప్యార్ కే స్థానంలో సాథ్ నిభానా సాథియా 2 పేరుతో సాథ్ నిభానా సాథియా రెండవ సీజన్‌లో మళ్ళీ తన పాత్రను కోకిలా మోడీగా పోషించింది.[13][14] గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్‌లో అతిథిగా నటించింది.[15]
ఇతరాలు
మార్చుస్వచ్ఛ భారత్ ఇండియా ప్రాజెక్ట్‌కు అంబాసిడర్‌గా ఉన్న రూపల్ పటేల్, భారత ప్రధాని నరేంద్ర మోడీ నుండి రెండుసార్లు గౌరవం పొందింది.[6]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చు- మెహక్ (1985)
- అంతర్నాడ్ (1991)
- సూరజ్ కా సత్వన్ ఘోడా (1992)
- పపీహా (1993)
- మమ్మో (1994)
- సమర్ (1999)
- జాగో (2004) – అతిథి పాత్ర
- పెహచాన్: ది ఫేస్ ఆఫ్ ట్రూత్ (2005)
- సాంబార్ సల్సా (2007) – ఆర్ట్ డైరెక్టర్
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1999-2000 | గుబ్బరే | "మసాలా మామి" ఎపిసోడ్‌లో సింధీ లేడీ | |
2001 | షాగున్ | లఖీ | [3] |
2002 | సౌ దాదా ససూనా | ఆశాలతా శేత్ | [4] |
2009 | జానే క్యా బాత్ హుయీ | బృందా | |
2010–17 | సాథ్ నిభానా సాథియా | కోకిల పరాగ్ మోడీ | [9] |
2019 | మన్మోహిని | కుబర్జ్ర/ఉష | అతిథి పాత్ర[10] |
2019–20 | యే రిష్టే హై ప్యార్ కే | మీనాక్షి రాజ్‌వంశ్/మీనాక్షి మెహుల్ కపాడియా | [11][12] |
2020 | సాథ్ నిభానా సాథియా 2 | కోకిల పరాగ్ మోడీ | ఎపిసోడ్ 1-31 |
గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్ | అతిథి[15] | ||
2021–2022 | తేరా మేరా సాథ్ రహే | మిథిలా మోడీ | [16] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Actress Rupal Patel, The Original Rasode Mein Kaun Tha Questioner: Feel Blessed To Touch People In Such A Way". Mid Day. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Saath Nibhana Saathiya Season 2 to launch in October". The Indian Express (in ఇంగ్లీష్). 28 August 2020. Retrieved 2023-01-19.
- ↑ 3.0 3.1 3.2 "The 'me' in the Kokilaben meme". The Times of India. Archived from the original on 12 December 2020. Retrieved 2023-01-19.
- ↑ 4.0 4.1 4.2 Das, Soumitra (18 February 2012). "Rupal Patel is different from reel life". The Times of India. Retrieved 2023-01-19.
- ↑ 5.0 5.1 "No place for men in TV soaps: Radhakrishna Dutta". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 6.0 6.1 "Saath Nibhaana Saathiya actor Rupal Patel gets honour from PM Modi for special cause". The Asian Age. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rupal Patel gives comedy a shot". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "I am done with my journey of playing Kokila Modi in Saath Nibhaana Saathiya: Rupal Patel". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 9.0 9.1 "I am not quitting Saath Nibhana Saathiya, I'm too happy playing Kokila: Rupal Patel". The Indian Express. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 10.0 10.1 "saath-nibhaana-saathiya-actress-rupal-patel-returns-to-tv-with-manmohini". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 11.0 11.1 "Rupal Patel Says Kokila Modi and Meenakshi Rajvansh are like Twins". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 12.0 12.1 "Right in the act". The Tribune. Archived from the original on 2019-12-08. Retrieved 2023-01-19.
- ↑ "Saath Nibhaana Saathiya 2 Maker Confirms Return of Gopi Bahu and Kokilaben". 28 August 2020. Retrieved 2023-01-19.
- ↑ "Saath Nibhana Saathiya Season 2 to launch in October". 28 August 2020. Retrieved 2023-01-19.
- ↑ 15.0 15.1 "Rupal Patel will make a guest appearance in the Gangs of Filmistan". The Tribune. Archived from the original on 2022-09-02. Retrieved 2023-01-19.
- ↑ "Rupal Patel to begin shooting for Tera Mera Saath Rahe". The Times of India. Retrieved 2023-01-19.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రూపల్ పటేల్ పేజీ