రెంజూషా మీనన్ (మలయాళం:രഞ്ജുഷ മേനോൻ; 1988 – 2023 అక్టోబరు 30) భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళ టెలివిజన్ సీరియల్స్‌లో నటించి ప్రసిద్దిచెందింది.[1]

రెంజూష మీనన్
జననం1988
కొచ్చి, కేరళ, భారతదేశం
మరణం2023 అక్టోబరు 30
తిరువనంతపురం, కేరళ, భారతదేశం
మరణ కారణంఉరి వేసుకుని ఆత్మహత్య
వృత్తినటి

టెలీవిజన్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె చివరిసారిగా ఆనందరాగం అనే టీవీ షోలో లీడ్‌ రోల్ పాత్ర పోషించింది.[2]

కెరీర్

మార్చు

కైరాలీ ఛానెల్‌లోని మలయాళ సెలబ్రిటీ రియాలిటీ షో నక్షత్ర దీపాంగళ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె మొదట సెన్సేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నది. ఆ తర్వాత, ఆమె సూర్య టీవీలో ఆనందరాగం, కౌముది రూపొందించిన వరణ్ డాక్టర్, ఎంత మాథవు వంటి సీరియల్స్‌లో నటించింది.[3]

ఆమె మొదటగా స్త్రీ అనే సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత నిజాలట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి అనేక సీరియల్స్‌తో పాటు తాళ్లప్పావు (2008), బొంబాయి మార్చి 12 (2011), లిజమ్మయుడే వీడు (2013), సిటీ ఆఫ్ గాడ్ (2011), మరిక్కుండోరు కుంజడు (2010 )వంటి చిత్రాలలో కూడా నటించింది. పలు ధారావాహికలకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది.

ఆమె క్లాసిక్ డ్యాన్సర్ కూడా, భరతనాట్యంలో పట్టా తీసుకుంది.[4]

ఫిల్మోగ్రఫీ

మార్చు
  • తాళ్లప్పావు (2008)
  • మరిక్కుండోరు కుంజాడు (2010)
  • సిటీ ఆఫ్ గాడ్ (2011)
  • బాంబే మార్చి 12 (2011)
  • లిసమ్మయుడే వీడు (2013)

తిరువనంతపురంలోని తన నివాసంలో 2023 అక్టోబరు 30న, వివాహిత[5] ఆయిన ఆమె ఉరి వేసుకుని కనిపించింది.[6]

మూలాలు

మార్చు
  1. "35-year-old Malayalam actress Renjusha Menon found dead at her residence". The Times of India. 2023-10-30. ISSN 0971-8257. Retrieved 2023-10-30.
  2. "ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య! | Malayalam industry TV actress Renjusha Menon has passed away - Sakshi". web.archive.org. 2023-10-30. Archived from the original on 2023-10-30. Retrieved 2023-10-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ആദ്യവിവാഹവും പ്രശ്നങ്ങളും, പങ്കാളിയുമായുള്ള ബിസിനസ്സും സ്വപ്നങ്ങളും; രഞ്ജുഷയുടെ മരണത്തിന് കാരണം തേടി സോഷ്യൽ മീഡിയ". Samayam Malayalam (in మలయాళం). Retrieved 2023-10-30.
  4. "സിനിമ– സീരിയല്‍ നടി രഞ്ജുഷ മേനോൻ തൂങ്ങി മരിച്ച നിലയില്‍". www.manoramaonline.com (in మలయాళం). Retrieved 2023-10-30.
  5. "మలయాళీ నటి అనుమానాస్పద మృతి.. ఆర్థిక ఇబ్బందులే కారణమా..? | malayalam actor renjusha menon found dead in her house". web.archive.org. 2023-10-30. Archived from the original on 2023-10-30. Retrieved 2023-10-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Daily, Keralakaumudi. "Actress Renjusha Menon found hanging, body found in flat". Kerala Kaumudi (in ఇంగ్లీష్). Retrieved 2023-10-30.