పరిచయం

మార్చు

ఎరిక్స్ జాన్నీ
 
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Subfamily:
Genus:
Species:
E. johnii

రెండు తలల పాము అనగా బోయ్ డే (Boide) కుటుంబానికి చెందిన విషరహిత సర్పం. దీని శాస్త్రీయ నామం ఎరిక్స్ జాన్నీ (Eryx Johnii), ఆంగ్ల నామం రెడ్ సాండ్ బోవా (Red Sand Boa) . ఇది ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్, భారత దేశం లలో కనిపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో దీన్ని బోగి అని అంటారు. ఈ రకపు పాములు పొడి వాతావరణం ఉన్న తేలికపాటి ఎడారులలోను, మెట్ట ప్రాంతాల్లో ఉండే రాతి ఇసుక నేలల బొరియల లోను నివసిస్తాయి.

వివరణ

మార్చు
 
E. johnii

ఇవి 2 మీటర్ల నుండి 3 మీటర్ల పొడవు ఎదుగుతాయి. శరీరం నున్నగా ఉండి లేత గోధుమ రంగు లేక ముదురు గోధుమ రంగు లేదా లేత పసుపు - గోధుమ సమ్మేళన రంగులో ఉంటుంది. ఆడ పాము సుమారు 14 పిల్లల వరకూ ప్రసవిస్తుంది. తోక చివరి భాగం గుండ్రంగా ఉండి, తలను పోలి ఉండుట వలన రెండు తలల పాము అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా ఎలుకలను, చుంచులను వేటాడి ఆహారంగా తింటాయి.

ఈ తరహా పాములలో లైంగిక సామర్థ్యం కలిగించే గుణం ఉందని, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిని నయం చేసే గుణం ఉందని కొంతమంది నమ్ముతారు. తాంత్రికులైతే ఈ పాములు అదృష్టాన్ని, ధనాన్ని తీసుకొస్తాయని నమ్ముతారు. పాములను పట్టేవాళ్ళు వీటి తోకలపై తల రూపం వచ్చేటట్లు నలుపు రంగువేస్తారు. నల్ల బజారులో 'డబుల్ ఇంజన్' అనే పేరుతో పాము ధర 3 నుండి 10 లక్షల రూపాయల వరకూ పలుకుతోంది. అందువల్ల వీటి అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతోంది. ఫలితంగా ఈ పాముల జాతి కనుమరుగయ్యే ప్రమాదమున్నదని అటవీశాఖ వారు భావిస్తున్నారు. ఈ పాములను పట్టుకోవడం చట్టరీత్యా నేరం.

లంకెలు

మార్చు