రెడ్డిగారి రత్నమ్మ

రెడ్డిగారి రత్నమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకురాలు. ఆమె రామాయంపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2] రెడ్డిగారి రత్నమ్మ, 1962లో తొలిసారి శాసనసభకు పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్ధి ఆర్.సత్యనారాయణపై గెలుపొంది, శాసనసభలో అడుగుపెట్టింది. 1967లో తిరిగి రామాయంపేట నియోజకవర్గం నుండి పోటీచేసి, స్వతంత్ర అభ్యర్ధి యూ.చంద్రయ్యను ఓడించి రెండవ పర్యాయం శాసనసభకు ఎన్నికైంది. 1972లో మూడోసారి ఇక్కడినుండే పోటీ చేసినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థి కొండలరావు చేతిలో ఓడిపోయింది.[1]

రెడ్డిగారి రత్నమ్మ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1962 - 1972
నియోజకవర్గం రామాయంపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1925
రామాయంపేట, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో, ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని కోరుతున్న శాసనసభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’ అనే ఫ్రంట్‌గా ఏర్పడ్డారు. శాసనసభలో 31 మంది తెలంగాణ ఐక్య సంఘటన సభ్యులలో రెడ్డిగారి రత్నమ్మ కూడా ఒకర్తె. ఈమె ప్రత్యేక తెలంగాణకు మద్దతునిచ్చింది.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sakshi (28 October 2018). "ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Sakshi (12 November 2018). "మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  3. "శాసనసభలో ప్రతిపక్షంగా తెలంగాణ ఐక్య సంఘటన". తెలంగాణ మాసపత్రిక. 1 February 2017. Retrieved 12 August 2024.