రేణుకా సింగ్ (క్రికెటర్)

రేణుకా సింగ్ ఠాకూర్ (జననం 1996 జనవరి 2) హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతున్న ఒక భారతీయ క్రీడాకారిణి.[1] సింగ్ 2019–20 సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.[2] 2021 ఆగస్టులో, సింగ్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆమె తన మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ (WT20I) అరంగేట్రం 2021 అక్టోబరు 7న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున ఆడింది.[3]

రేణుకా సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రేణుకా సింగ్ ఠాకూర్
పుట్టిన తేదీ (1996-01-02) 1996 జనవరి 2 (వయసు 28)
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్

2022 జనవరిలో, న్యూజిలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆమె భారత జట్టులో ఎంపికైంది. ఆమె 2022 ఫిబ్రవరి 18న న్యూజిలాండ్‌పై భారతదేశం తరపున మహిళల వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[4]

2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె భారత జట్టులో ఎంపికైంది. ఆమె టోర్నమెంట్‌లో 11 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచింది, అలాగే ఆమె జట్టుతో కలిసి రజత పతకాన్ని గెలుచుకుంది.

మూలాలు

మార్చు
  1. "Renuka Singh Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-28.
  2. Cricket, Team Female (2021-09-13). "Who are the Uncapped Indian Players on the Australian Tour for ODI, T20I and D/N Test?". Female Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-28.
  3. "IND WMN vs AUS WMN Scorecard 2021/22 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-28.
  4. "IND WMN vs NZ WMN Scorecard 2021/22 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-28.