రేమాల రావు
రేమాల రావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ సాఫ్టువేర్ ఇంజనీరు. మైక్రోసాఫ్ట్ లో మొట్ట మొదటి భారతీయ ఉద్యోగి. ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.[1] ఆయన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఐఐటీ కాన్పూర్ నుంచి ఎంటెక్ చేశాడు. ప్రస్తుతం ఆయన ఏంజెల్ ఇన్వెస్టరు గానూ, సేవా కార్యక్రమాలలోనూ కాలం గడుపుతున్నాడు. 2000 సంవత్సరంలో రేమాల ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.[2] లిటరసీ బ్రిడ్జ్ (అక్షరాస్యతా వారధి) అనే స్వచ్ఛంద సంస్థలో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.[2]
రేమాల రావు | |
---|---|
జననం | |
వృత్తి | సాఫ్టువేర్ ఇంజనీర్ |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చురావు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు సమీపంలోని కొత్తపాలెం గ్రామంలో జన్మించాడు.[3] ఆయన తల్లి నిరక్షరాస్యురాలు. తండ్రి ఏదో కొద్దిగా చదువుకున్నవాడు. తన ఆరుగురు పిల్లలకు మంచిగా చదువుకోవాలని ఆశించాడు.[2] రావు ప్రతి రోజు బడికి ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాడు.[4]
వృత్తి జీవితం
మార్చురావు ముందుగా హె.సి.ఎల్ సంస్థలో పనిచేసేవాడు. అర్జున్ మల్హోత్రా, శివ నాడార్ లాంటి దార్శనికులు ఆయన సమకాలికులు. 1981లో మైక్రోసాఫ్ట్ లో చేరాడు. అప్పటికి మైక్రోసాఫ్ట్ యాభైమందికి కన్నా తక్కువ మంది పనిచేసే చిన్న స్టార్టప్ కంపెనీ. ఆయన 39వ ఉద్యోగి.[3] అప్పటికి ఆయన వయసు 32 ఏళ్ళు. 23 సంవత్సరాలు సుధీర్ఘ కాలం పనిచేసిన తరువాత 2004 లో పదవీ విరమణ చేశాడు.[5] ఆయన సహచరులు చాలామంది స్టార్టప్ సంస్థలు స్థాపించినా ఆయన మాత్రం ప్రశాంత జీవనం గడపడానికి అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం ఆయన ఏంజెల్ ఇన్వెస్టరు గానూ, సేవా కార్యక్రమాల్లోనూ కాలం గడుపుతున్నాడు.
మూలాలు
మార్చు- ↑ LIFS. "Rao Remala Microsoft's First Indian Hire". littleindia.com. Archived from the original on 3 అక్టోబరు 2016. Retrieved 4 October 2016.
- ↑ 2.0 2.1 2.2 "Welcome to Literacy Bridge Board Member – Rao Remala". literacybridge.org. Retrieved 4 October 2016.[permanent dead link]
- ↑ 3.0 3.1 చిదానంద్, రాజ్ ఘట్టల్. "Dil da maamla or Bill da maamla? Part II". timesofindia.indiatimes.com. టైమ్స్ న్యూస్ నెట్వర్క్. Retrieved 4 October 2016.
- ↑ Bhatt, Amy; Banerjee, Nalini Iyer (2013). Roots & reflections South Asians in the Pacific Northwest (First edition. ed.). Seattle: University of Washington Press in association with the South Asian Oral History Project and the University of Washington Libraries. ISBN 9780295804552.
- ↑ "Microsoft's first-ever Indian logs out". economictimes.indiatimes.com. Times News Network. Retrieved 4 October 2016.[permanent dead link]