రేవతి మహాభారతంలో కకుడ్మి రాజు కుమార్తె, బలరాముడి భార్య.[1] బలరాముడు కృష్ణుడి అన్నయ్య. రేవతి కథ మహాభారతం, భాగవత పురాణం వంటి అనేక పురాణ గ్రంథాలలో వివరించబడింది.విష్ణు పురాణం రేవతి కథను వివరిస్తుంది.రేవతి కాకుడ్మి ఏకైక కుమార్తె. అతని మనోహరమైన, ప్రతిభావంతురాలైన కుమార్తెను వివాహం చేసుకోవటానికి ఏ మానవుడకు మంచి అర్హతలేదని నిరూపించాలని భావించిన కాకుడ్మి రాజు కుమార్తె రేవతిని తనతో పాటు బ్రహ్మ నివాసమైన బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. వారు వెళ్లిన సమయానికి బ్రహ్మ గంధర్వుల సంగీత ప్రదర్శనను వింటున్నాడు, కాబట్టి వారు ఓపికగా బ్రహ్మ దర్శన సమయం కొరకు వేచిఉంటారు. ప్రదర్శన పూర్తయింది.

రేవతి ప్రతిరూపచిత్రం

అప్పుడు కాకుడ్మి వినయంగా బ్రహ్మకు నమస్కరించి,తను అనుకున్న ప్రకారం అభ్యర్థన చేసి అతని అభిప్రాయలు బ్రహ్మ ముందు వెళ్లబుచ్చుతాడు. బ్రహ్మ దానికి బిగ్గరగా నవ్వి, ఉనికి వివిధ రకాలుగా సమయం భిన్నంగా నడుస్తుందని, అతనిని చూడటానికి వారు బ్రహ్మలోకాలో వేచి ఉన్న కొద్ది సమయంలో, 27 చతురు - యుగాలు భూమిపై గడిచిపోయాయని, ఆ అభ్యర్థులందరూ చాలా కాలం క్రితం మరణించారని చెపుతాడు.[2] తన స్నేహితులు, మంత్రులు, సేవకులు, భార్యలు, బంధువులు, సైన్యాలు, సంపద ఇప్పుడు భూమిమీద అదృశ్యమైనందున కాకుడ్మి ఇప్పుడు నీవు ఒంటరిగా ఉన్నావని, కలియుగం దగ్గరలో ఉన్నందున త్వరలో తన కుమార్తెను తగిన అతనిని భర్తగా స్వీకరించాలని చెపుతాడు.[3]

ఈ వార్త విని కాకుడ్మిని ఆశ్చర్యంతో భాధపడుతూ ఏమిచేయాలని మధనపడుతుంటాడు. ఏదేమైనా బ్రహ్మ అతనిని ఓదార్చి, విష్ణు సంరక్షకుడు ప్రస్తుతం కృష్ణ, బలరాముల రూపంలో భూమిపై ఉన్నారు.రేవతికి తగిన భర్తగా బలరాముడిని సిఫారసు చేస్తాడు.కొద్దిసమయం మాత్రమే మిగిలిందని వారు భావించి,వెంటనే కాకుడ్మి రేవతిని తీసుకుని తిరిగి భూమికి తిరిగి వస్తాడు.ఈ లోపు చోటుచేసుకున్న మార్పులకు వారు దిగ్బ్రాంతి చెందుతారు. ప్రకృతి దృశ్యం, పర్యావరణం మారడమే కాక, మధ్యలో ఉన్న 27 చతురు - యుగాలలో, మానవ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరిణామం చక్రాలలో, మానవజాతి వారి స్వంత సమయం కంటే తక్కువ స్థాయి అభివృద్ధిలో ఉంది. భాగవత పురాణం పురుషుల జాతి "పొట్టితనాన్ని తగ్గిస్తుంది, శక్తిని తగ్గిస్తుంది, తెలివితేటలను పెంచుతుంది" అని వారు కనుగొన్నారు.కాకుడ్మి బలరాముడిని కనుగొని రేవతిని వివాహాం చేసుకోవలసిందిగా ప్రతిపాదిస్తాడు. ఆమె మునుపటి యుగం నుండి వచ్చినందున, రేవతి తన కంటే చాలా పొడవుగా, పెద్దదిగాఉందని బలరాముడు ఆలోచించి, తన నాగలిని (అతని అయుధం) ఆమె తలపై లేదా భుజంపై నొక్కుతాడు. దాని కారణంగా ఆమె బలరామ వయస్సులో ఉన్న ప్రజల సాధారణ ఎత్తుకు తగ్గిపోయింది. అప్పుడు వారి వివాహం జరుగుతుంది..

మూలాలు

మార్చు
  1. "Revati". www.mythfolklore.net. Retrieved 2020-08-23.
  2. "Srimad Bhagavatam: Canto 9 - Chapter 3". bhagavata.org. Retrieved 2020-08-23.
  3. "The Vishnu Purana: Book IV: Chapter I". www.sacred-texts.com. Retrieved 2020-08-23.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రేవతి&oldid=3019493" నుండి వెలికితీశారు