రేవల్సార్ సరస్సు

రేవల్సార్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో ఉంది. ఇది జిల్లా ప్రధాన నగరమైన మండీ నుండి 22.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతాలలో ఉంది. పద్మసంభవుడు, మంధారవ అనే బౌద్ధ గురువులను పూజించే టిబెట్ బౌద్ధులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.[1]

రేవల్సార్ సరస్సు
రేవల్సార్ సరస్సు
రేవల్సార్ సరస్సు is located in Himachal Pradesh
రేవల్సార్ సరస్సు
రేవల్సార్ సరస్సు
హిమాచల్ ప్రదేశ్ లో రేవల్సార్ సరస్సు స్థానం
ప్రదేశంమండీ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ , భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు31°38′02″N 76°50′00″E / 31.63389°N 76.83333°E / 31.63389; 76.83333
ఉపరితల వైశాల్యం160 చదరపు కిలోమీటర్లు (62 చ. మై.)
సరాసరి లోతు10–20 మీటర్లు (33–66 అ.)
గరిష్ట లోతు25 మీటర్లు (82 అ.)
ఉపరితల ఎత్తు1,360 మీ. (4,460 అ.)
ప్రాంతాలురేవల్సార్
మూలాలుHimachal Pradesh Tourism Dept.

భౌగోళికం

మార్చు

ఇది సముద్ర మట్టం నుండి దాదాపు 1,360 మీటర్ల ఎత్తులో ఉండి, 735 మీటర్ల తీర ప్రాంతం కలిగి ఉంది. దీనిని హిందువులు, సిక్కులు, బౌద్ధులు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.[2]

దేవాలయాలు, ఉత్సవాలు

మార్చు

రేవల్సార్ సరస్సు వద్ద మూడు బౌద్ధ మఠాలు, మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. పూర్వం కొందరు సాధువులు శివునిపై భక్తితో ఈ సరస్సు దగ్గర తపస్సు చేశారనీ, సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ 22 డిసెంబర్ 1666 - 7 అక్టోబర్ 1708 మధ్య కాలంలో ఇక్కడ జీవించాడనీ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సు దగ్గర ఫిబ్రవరి చివరలో లేదా మార్చి ప్రారంభంలో కొన్ని ఉత్సవాలు, పండగలు జరుగుతాయి.[3]

పద్మనాభ విగ్రహం

మార్చు

ఈ సరస్సు దగ్గర ఏప్రిల్ 1, 2012 న, పద్మనాభుడి 37.5 మీటర్ల (123 అడుగులు) ఎత్తైన స్మారక విగ్రహాన్ని 14వ దలైలామా స్థాపించారు. ఈ విగ్రహం నిర్మించడంలో పునాదులు వేయడానికే మూడు సంవత్సరాలు పట్టింది. మొత్తం పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. దీనిని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు మాత్రమే సిమెంటుతో, యంత్రాలు వాడకుండా కేవలం చేతులతో నిర్మించారు.[3][4]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-07. Retrieved 2021-07-30.
  2. "himachaltourism.gov.in". Archived from the original on 2010-03-24. Retrieved 2021-09-29.
  3. 3.0 3.1 "Wangdor Rimpoche: Padmasambhava Project". www.customjuju.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-06-14. Retrieved 2018-07-30.
  4. "Guru Rimpoche Statue". Flickr (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-07-30.