రేవూరి శోభాదేవి
రేవూరి శోభాదేవి, తెలుగు భాషా రచయిత్రి. ఆమె పద కవితా పితామహుడు అన్నమయ్య జీవితం, భక్తి తత్వంపై పుస్తకాలు రచించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన సాహితీవేత్త. [1]
రేవూరి శోభాదేవి | |
---|---|
జననం | శోభాదేవి 1950 మే 27 |
వృత్తి | రచయిత్రి |
జీవిత భాగస్వామి | రేవూరి అనంత పద్మనాభరావు |
జీవిత విశేషాలు
మార్చుఆమె కారేడు గ్రామంలో మాతామహుల ఇంట 1950 మే 27న జన్మించింది. ఆమె విజయవాడ, రాజమండ్రి, బిట్రగుంటలో హైస్కూలు విద్య పూర్తి చేసింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో, నెల్లూరు లోని డి.కె.మహిళా కళాశాలలోనూ కళాశాల విద్యనభ్యసించింది. 1972లో డిగ్రీని పూర్తి చేసింది. 1969 మే 8న బిట్రగుంటలో అవధాని రేవూరి అనంతపద్మనాభరావు తో ఆమె వివాహం జరిగింది. ఆమె తిరుపతికి చెందిన రాజమోహన్ వద్ద సంగీతాన్ని అభ్యసించింది. భర్త రేవూరి అనంత పద్మనాభరావు [2]మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతో సారస్వత అభిరుచిని మరింత పెంచుకున్న ఆమె తిరుపతి ప్రాంతంలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో సంకీర్తనల గాన శిక్షణ పొందింది. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ సాధించింది.
రచనలు
మార్చు- అన్నమయ్య భక్తి సామ్రాజ్యం-2008*[3]
- అన్నమయ్య సంకీర్తనా సౌరభం -2009[4]; [5] [6]
- అన్నమయ్య జీవితం, రచనలు-2014 (తెలుగు అకాడమీ ప్రచురణ)
- సంభవామి యుగే యుగే(తి.తి.దే.సౌజన్యంతో)
- ఆధ్యాత్మిక విలువలు అవసరం అంటూ శోభాదేవి వివరాలతో 2018 మే 14 న ఆంధ్రజ్యోతి నెల్లూరు ఎడిషన్లో ప్రచురితమైన కథనం.
ఇతర రచనలు: ఆరాధన, సప్తగిరి, వేదాంతభేరి మాసపత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు
రేడియో ప్రసంగాలు: ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాదు, అనంతపురం కేంద్రాలలో ఉపన్యాసాలు.
పురస్కారాలు
మార్చు- అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధనకు కేంద్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ సీనియర్ ఫెలోషిప్ (2007-2009).
- అన్నమాచార్య 600వ జయంత్యుత్సవాలలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిలో గాన సత్కారం (మే 2008).
- ప్రపంచ తెలుగు మహాసభలు - తిరుపతిలో రచయిత్రిగా సన్మానం.
- కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో అప్పటి తమిళనాడు గవర్నరు కె. రోశయ్య చేతులమీదుగా ఉత్తమ రచయిత్రి పురస్కారం - యామిజాల రామచంద్రన్ అవార్డు (2018).
మూలాలు
మార్చు- ↑ అన్నమయ్య రచనలతో జాతీయస్థాయి గుర్తింపు అంటూ శోభాదేవి గురించి ఆంధ్రజ్యోతి జూబ్లీహిల్స్ (హైదరాబాద్)పేజీలో గతంలో జనవరి 25 న ప్రచురితమైన కథనం.
- ↑ "అవిశ్రాంతం అరవై తర్వాత". Sakshi. 2015-03-02. Retrieved 2021-04-17.
- ↑ సప్తగిరిలో (అక్టోబరు 2011)ఎన్.నరసింహాచార్య పుస్తక సమీక్ష ప్రకారం:రచయిత్రి చేసిన తులనాత్మక పరిశీలన రాబోయే తరాల పరిశోధనాంశాలకు దోహదకారి.
- ↑ *అన్నమయ్య సంకీర్తనా సౌరభం: రచయిత్రి:రేవూరి శోభాదేవి. ప్రచురణ:తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో. సంవత్సరం:2012(తొలి). రచయిత్రి వివరాలు:చివరి పేజీ నుంచి. ఆరో పేజీలో కె.శైలజ రాసిన ముందు మాట (మా ఇలవేలుపు) ప్రకారం: ఇలవేలుపు అయిన వేంకటేశ్వరస్వామిపైన ఆమె(శోభాదేవి)కి ఎంతో మక్కువ ఏర్పడింది. అదే నిత్యజీవితంలో ఆమెకు కొండంత బలం.
- ↑ ఈనాడు ఆదివారం (2013 జనవరి 20) సంచికలో పదకవితామృతం పేరిట మేడేపల్లి అన్నపూర్ణ చేసిన పుస్తక సమీక్ష ప్రకారం :తాత్విక చింతన,సామాజిక దృక్పథాన్ని రచయిత్రి సమన్వయించారు.
- ↑ https://tirumala.org/Downloads/RESERCH%20BOOKS/%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8C%E0%B0%B0%E0%B0%AD%E0%B0%82-sobhadevi.pdf