రైతుబిడ్డ (1971 సినిమా)

1971 సినిమా

గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన సినిమా వివరాలకోసం రైతుబిడ్డ (1939 సినిమా) చూడండి.

రైతుబిడ్డ
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎ. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ
సంగీతం సాలూరి హనుమంతరావు
నిర్మాణ సంస్థ నవభారత్ మూవీస్
భాష తెలుగు

రైతు బిడ్డ (Raitu Bidda) 1971లో వెలువడిన ఒక తెలుగు సినిమా.

ఒక రైతు కుటుంబం, బాధ్యత నెరిగిన అన్న, చదువుకున్న తమ్ముడు, వీరంటే గిట్టనివారు, అన్నకూ తమ్మునికి మధ్య కలహాలూ, చివరకు అందరూ కలవటం చిత్రకథ. రామరావు ,రైతుగా,వాణిశ్రీ టీచరుగా, తమ్మునిగా జగ్గయ్య, కథానాయకునికి మేలు చేసే పాత్రలో రాజనాల నటించారు. ఆ అనురాగం, విరిసిన మరుమల్లి, దేవుడు సృష్టించాడు లోకాలు వంటి హిట్ గీతాలున్నాయి. చిత్రకథ 'మనోజ్ కుమార్' యొక్క 'ఉప్‌కార్' చిత్రానికి దగ్గరగా ఉంటుంది. ఐతే తర్వాత ఘట్టమనేని కృష్ణ చిత్రం పాడిపంటలులో ఈ పోలికలూ మరింత స్పష్టం గా కనిపిస్తాయి.

పాటలు

1.దేవుడు సృష్టించాడు లోకాలు, ఘంటసాల బృందం, రచన: కొసరాజు.

2.రైతే రాజ్యం ఏలాలి , ఘంటసాల, సుశీల,బృందం, రచన: కొసరాజు.

3.అ అమ్మ...ఆ .... ఆవు, ఘంటసాల, సుశీల, రచన: సి.నారాయణ రెడ్డి