సాలూరి హనుమంతరావు (సంగీత దర్శకుడు)

(సాలూరి హనుమంతరావు నుండి దారిమార్పు చెందింది)

సాలూరి హనుమంతరావు (1917 - మే 27, 1980) ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. సాలూరి హనుమంతరావు సంగీత కుటుంబం నుంచి వచ్చారు. ఈయన తమ్ముడు సాలూరి రాజేశ్వరరావు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకుడే. సాలూరి రాజేశ్వరరావు కంటే నాలుగేళ్ల పెద్దవాడు ఈయన. పన్నెండేళ్ల వయసులో తమ్మునితో కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. గాలిపెంచల నరసింహారావు ఆర్కెస్ట్రాలో చేరాడు. అక్కడే వీణ, సితార, దిల్, సారంగి, హార్మోనియం, వయొలిన్, క్లారినేట్, వేణువు, వాద్యాలతో పొత్తుపెట్టుకున్నాడు.

సాలూరి హనుమంతరావు
సాలూరి హనుమంతరావు
జననంసాలూరి హనుమంతరావు
1917
శివరాంపురం, విజయనగరం జిల్లా
మరణంమే 27, 1980
వృత్తిసంగీత దర్శకత్వం
పిల్లలుకొడుకు
తండ్రిసన్యాసిరాజు

కొన్నాళ్ల తరువాత ఈ సోదరులిద్దరూ "రాజేశ్వరరావు అండ్ పార్టీ" పేరుతో ఆర్కెస్ట్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు. 1947లో "రాధిక" అను సినిమాతో స్వతంత్ర సంగీత దర్శకుని అవతారం ఎత్తారు. సోదరుడైన రాజేశ్వరరావు అస్వస్థులైన సమయంలో ఆయన ఒప్పుకున్న "చరణదాసి" సినిమాను తాను పూర్తిచేసారు. ఈ సినిమాలో కొన్ని పాటలు, రీరికార్డింగ్ ఈయనే చేసారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పనిచేసారు. మంచి మంచి సినిమాలకు స్వరకర్తగా పనిచేసినా హనుమంతురావుకు కాలం కలిసిరాలేదు. ఆయనకు రావల్సినంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు.

తొలితరం తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో హనుమంతరావు ఒకరు. సంగీత సామ్రాజ్యంలో కొంతమంది జంట సంగీత దర్శకులున్నారు. శంకర్‌ - జైకిషన్‌, కళ్యాణ్‌జీ - ఆనంద్‌ జీ, విశ్వనాథన్‌ - రామమూర్తి, రాజన్‌ - నాగేంద్ర, రాజ్‌- కోటి (ఒకప్పుడు) మొదలైనవారున్నారు. కానీ హనుమంత రావు, రాజేశ్వరరావు అన్నదమ్ములైనప్పటికీ జంటగా ఏ చిత్రానికీ సంగీతాన్ని అందించిన దాఖలా లేదు. అయితే, అనుకోని పరిస్థితిలో తమ్ముడు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని హనుమంతరావు పూర్తి చేశారు.

అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. పైన తెలిపిన జంట సంగీత దర్శకులు అన్నదమ్ములు కారు.1917లో విజయనగరం జిల్లా శివరాంపురంలో పుట్టిన సాలూరి హనుమంతరావుకు చిన్నప్పుడే సంగీతం వంట పట్టింది. తండ్రి సన్యాసిరాజు. సంగీతానికి పట్టం కట్టిన జిల్లాలో పుట్టినందువల్లేమో హనుమంతరావు పన్నెండేళ్ల వయసులో తమ్మునితో కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర సంగీతం పాఠాలు నేర్చుకున్నారు. గాలిపెంచల నరసింహారావు ఆర్కెస్ట్రాలో చేరారు. ఆయన వద్ద వీణ, సితార, దిల్‌, సారంగి, హార్మోనియమ్‌, వయొలిన్‌, క్లారినేట్‌, ఫ్లూట్‌, వాద్యాలు నేర్చుకున్నారు. కొన్నాళ్లకు అన్నదమ్ములిద్దరూ రాజేశ్వరరావు అండ్‌ పార్టీ పేరుతో ఆర్కెస్ట్రాను తయారు చేసుకొని, సంగీత కార్యక్రమాలు ఇవ్వడం ప్రారంభించారు. 1947లో ‘రాధిక’ అనే సినిమాతో సాలూరి హనుమంతరావు స్వతంత్ర సంగీత దర్శకు డయ్యారు. సోదరుడు రాజేశ్వరరావు ‘చరణదాసి’ సినిమా చేస్తున్నప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన ఒప్పుకున్న సినిమాను హనుమంతరావు పూర్తి చేసారు.

ఈ సినిమాలో కొన్ని పాటలు, రీరికార్డింగ్‌ ఈయనే చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 50 చిత్రాలకు పనిచేశారు. హను మంతరావు సంగీతాన్నందించిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీ రామారావు చిత్రాలున్నాయి. ఈ సినిమాలు బాగా ఆడడమే కాకుండా హనుమంత రావుకు పేరు తీసుకొచ్చాయి. మంచి సినిమాలకు స్వరకర్తగా పనిచేసినా హనుమంత రావుకు రావల్సి నంతగా పేరు రాలేదు. కొన్ని సినిమాలు బాగా ఆడక పోవడం ఇందుకు కారణం కావచ్చు. అయితే హను మంతరావు సాంఘిక చిత్రాలకే కాకుండా పౌరాణిక, జానపద చిత్రాలకూ సంగీతాన్ని అందించారు.

హనుమంతరావు స్వరపరిచిన పాటల్లో ఎన్నో ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి - బాంధవ్యాలు (1968) చిత్రంలో ‘మంచితనానికి ఫలితం వంచన, మనిషికి మిగిలేదేమిటి వేదన...ఆరని, తీరని వేదన ఆవేదన’. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి రాసిన ఈ పాటను ఘంటసాల ఆలపించారు. అలాగే ఉషాపరిణయం (1961) లో ‘మన ప్రేమకథా అమర కథ’ అనే పాటను సదాశివబ్రహ్మం రాయగా, హనుమంతరావు స్వరపరచగా ఘంటసాల,పి లీల పాడారు. సాలూరి హనుమంతరావు 30 దశాబ్దాలకు పైగా సినిమా సంగీత దర్శకుడిగా కొనసాగినా చాలా తక్కువ సినిమాలు చేశారు. 1947తో ప్రారంభించి 1976 వరకూ సంగీత దర్శకుడిగా కొనసాగిన సాలూరి హనుమంతరావు 1980లో మరణించారు.

సంగీతం సమకూర్చిన చిత్రాలు

మార్చు
  1. రాధిక (1947)
  2. మదాలస (1948)
  3. రాజీ నా ప్రాణం (1954) (కొన్నిపాటలు మాత్రమే)
  4. భలే అమ్మాయిలు (1957)
  5. వీర భాస్కరుడు (1959)
  6. ఉషా పరిణయం (1961)
  7. దక్షయజ్ఞం (1962)
  8. చంద్రహాస (1965)
  9. బాంధవ్యాలు (1968)
  10. రైతు బిడ్డ (1971)
  11. మహమ్మద్ బీన్ తుగ్లక్ (1972)
  12. పంజరంలో పసిపాప (1973)
  13. నిజ రూపాలు (1974)
  14. ప్రతిజ్ఞ (కన్నడం)
  15. సతీ అనసూయ (కన్నడం)
  16. ఆడదాని అదృష్టం (1974)
  17. మొగుడా పెళ్ళామా (1974)
  18. మనుషుల్లో దేవుడు (టి.వి.రాజు)తో
  19. ఆరాధన (1976)
  20. స్వామి ద్రోహులు (1976)

బయటి లింకులు

మార్చు