రైతు బజార్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రైతుల బజారు. ఇది చిన్న కమతాలున్న చిన్న రైతుల కోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలచే నిర్వహించబడుతుంది. 1999 జనవరిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో మొదటి మార్కెట్ ప్రారంభమైంది.[1]

హైదారాబాదు లోని ఎర్రగడ్డలో రైతుబజార్

మోడల్ మార్చు

ఈ మార్కెట్ లో రైతులు తాము పండించిన కూరగాయలను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తారు. ఈ మార్కెట్ లో రైతులకు, వినియోగదారులకు మధ్య మధ్యవర్తుల జోక్యం ఉండదు. రైతులు, వినియోగదారులు ఇద్దరూ మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా ఈ పద్ధతి బాగుంటుందని ఒకే అభిప్రాయానికి వచ్చారు. అందువలన వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, ఆర్థికంగా అందుబాటులో లభించగలవు. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం లేకపోవటం వలన ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండేందుకు సహాయపడింది. ఈ విధానం పండించే రైతుకు, వినియోగ దారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంది.[2]

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లలో అనేక పట్టణాలు, నగరాలలో ఈ రైతు బజార్లు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Rythu bazaar launch date and purpose" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Market AP". market.ap.nic.in. Retrieved 2020-09-03.

బాహ్య లంకెలు మార్చు