రైనర్ వెర్నర్ ఫాస్‌బైండర్

జర్మన్ ఫిలింమేర్, నటుడు, నాటకకర్త

రైనర్ వెర్నర్ ఫాస్‌బైండర్ (1945, మే 31 – 1982, జూన్ 10) [1] జర్మన్ ఫిలింమేకర్, నటుడు, నాటకకర్త. న్యూ జర్మన్ సినిమా ఉద్యమ ప్రధాన వ్యక్తులలో ఒకడిగా పరిగణించబడ్డాడు. అనేక అంశాలతో 40కి పైగా సినిమాలను రూపొందించాడు.[2][3][4] ఇతను తన ప్రాజెక్ట్‌లలో తరచుగా కనిపించే నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాడు.[3]

రైనర్ వెర్నర్ ఫాస్‌బైండర్
ఫాస్‌బైండర్ (1980)
జననం(1945-05-31)1945 మే 31
బాడ్ వోరిషోఫెన్, జర్మనీ
మరణం1982 జూన్ 10(1982-06-10) (వయసు 37)
మునిచ్, జర్మనీ
సమాధి స్థలంబోగెన్‌హౌసెనర్ ఫ్రైడ్‌హాఫ్‌, మునిచ్
ఇతర పేర్లుఫ్రాంజ్ వాల్ష్
వృత్తి
  • ఫిలింమేకర్
  • నాటకకర్త
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు1965–1982
ఉద్యమంన్యూ జర్మన్ సినిమా
జీవిత భాగస్వామి
ఇంగ్రిడ్ కేవెన్
(m. 1970; div. 1972)
పురస్కారాలుగోల్డెన్ బేర్, జర్మన్ ఫిల్మ్ అవార్డు
సంతకం

జననం మార్చు

ఫాస్‌బైండర్ 1945, మే 31న జర్మనీలోని బాడ్ వోరిషోఫెన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు.[5][6]

సినిమారంగం మార్చు

1967, 1982 మధ్యకాలంలో 40కి పైగా సినిమాలు, 24 నాటకాలు, రెండు టెలివిజన్ సీరియల్స్, మూడు షార్ట్ ఫిల్మ్‌లు, నాలుగు వీడియో ప్రొడక్షన్‌లను తీశాడు. గోల్డెన్ బేర్, జర్మన్ ఫిల్మ్ అవార్డులతోపాటు జర్మనీలో ఫీచర్ ఫిల్మ్‌కి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐదు బహుమతులను గెలుచుకున్నాడు.

ఫాస్‌బైండర్ 1967లో యాంటి-థియేటర్ అనే నటశిక్షణా సంస్థను ప్రారంభించాడు. తన నిర్మాణంలో కొన్ని నాటకాలను ప్రదర్శించాడు.[3] 1969లో తొలిసారిగా లవ్ ఈజ్ కోల్డర్ దాన్ డెత్ అనే గ్యాంగ్‌స్టర్ సినిమాను తీశాడు. 1972లో తీసిన ది మర్చంట్ ఆఫ్ ఫోర్ సీజన్స్ అనే సినిమాతో మొదటి విజయాన్ని సాధించాడు. 1974లో తీసిన అలీ: ఫియర్ ఈట్స్ ది సోల్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపుపు పొందాడు. డిస్పేయిర్ (1978), ది మ్యారేజ్ ఆఫ్ మరియా బ్రాన్ (1979), ది బిట్టర్ టియర్స్ ఆఫ్ పెట్రా వాన్ కాంట్ (1972), ఫాక్స్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ (1975), సాతాన్స్ బ్రూ (1976), ఇన్ ఎ ఇయర్ విత్ 13 మూన్స్ (1978), లిలీ మార్లీన్ (1981), లోలా (1981), క్వెరెల్లే (1982) సినిమాలను, వరల్డ్ ఆన్ ఎ వైర్ (1973), బెర్లిన్ అలెగ్జాండర్‌ప్లాట్జ్ (1980) టీవీ సిరీస్ లకు దర్శకత్వం వహించాడు.

సినిమాలు మార్చు

  • లవ్ ఈజ్ కోల్డర్ దాన్ డెత్ (1969)
  • కాట్జెల్‌మాచర్ (1969)
  • గాడ్స్ ఆఫ్ ది ప్లేగు (1970)
  • వై డజ్ హెర్ ఆర్ రన్ అమోక్? (1970)
  • ది అమెరికన్ సోల్జర్ (1970)
  • ది నిక్లాషౌసేన్ జర్నీ (1970)
  • బాల్ (1970)
  • రియో దాస్ మోర్టెస్ (1970)
  • మథియాస్ నీస్సల్ (1971)
  • వైటీ (1971)
  • బివేర్ ఆఫ్ ఏ హోలీ వోర్ (1971)
  • ది మర్చంట్ ఆఫ్ ఫోర్ సీజన్స్ (1972)
  • ది బిట్టర్ టియర్స్ ఆఫ్ పెట్రా వాన్ కాంట్ (1972)
  • ఎయిట్ అవర్స్ డోంట్ మేక్ ఎ డే (1972–1973)
  • ది టెండర్‌నెస్ ఆఫ్ వోల్వ్స్ (1973)
  • వరల్డ్ ఆన్ ఎ వైర్ (1973)
  • అలీ: ఫియర్ ఈట్స్ ది సోల్ (1974)
  • మార్తా (1974)
  • ఎఫీ బ్రీస్ట్ (1974)
  • ఫాక్స్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ (1975)
  • మదర్ కోస్టర్స్ ట్రిప్ టు హెవెన్ (1975)
  • షాడో ఆఫ్ ఏంజిల్స్ (1976)
  • ఐ వాంట్ యూ టు లవ్ మి (1976)
  • సాతాన్స్ బ్రూ (1976)
  • చైనీస్ రౌలెట్ (1976)
  • స్టేషన్ మాస్టర్స్ వైఫ్ (1977)
  • జర్మనీ ఇన్ ఆటుమ్న్ (1978)
  • డిస్పైర్ (1978)
  • ఇన్ ఎ ఇయర్ ఆఫ్ 13 మూన్స్ (1978)
  • ది మ్యారేజ్ ఆఫ్ మరియా బ్రాన్ (1979)
  • ది థర్డ్ జెనరేషన్ (1979)
  • బెర్లిన్ అలెగ్జాండర్‌ప్లాట్జ్ (1980)
  • లిలీ మార్లీన్ (1981)
  • లోలా (1981)
  • వెరోనికా వోస్ (1982)
  • కామికేజ్ 1989 (1982)
  • క్వెరెల్లే (1982)

నాటకాలు మార్చు

  • 1965: నూర్ ఐన్ స్కీబ్ బ్రొట్
  • 1966: ట్రోప్ఫెన్ ఔఫ్ హెయిస్ స్టెయిన్
  • 1968: కాట్జెల్‌మాచర్
  • 1968: డెర్ అమెరికానిస్చే సోల్డాట్
  • 1969: ప్రిపరైజ్డ్ సారీ నౌ
  • 1969: అన్ఆర్కై బేయర్న్‌
  • 1969: గెవిడ్మెట్ రోసా వాన్ ప్రౌన్‌హీమ్
  • 1969: దస్ కఫీహాస్
  • 1969: వేర్‌వోల్ఫ్
  • 1970: దాస్ బ్రెన్నెండే డార్ఫ్
  • 1971: బ్లట్ యామ్ హాల్స్ డెర్ కాట్జే
  • 1971: డై బిట్టెరెన్ ట్రానెన్ డెర్ పెట్రా వాన్ కాంట్
  • 1971: బ్రెమెర్ ఫ్రీహీట్
  • 1973: బీబీ
  • 1975: డెర్ ముల్, డై స్టాడ్ట్ అండ్ డెర్ టోడ్

మరణం మార్చు

ఫాస్‌బైండర్ తన 37 సంవత్సరాల వయస్సులో కొకైన్, బార్బిట్యురేట్‌ల ప్రాణాంతకమైన కాక్‌టైల్‌తో 1982, జూన్ 10న మరణించాడు. ఇతని అవశేషాలు మ్యూనిచ్‌లోని బోగెన్‌హౌసెనర్ ఫ్రైడ్‌హాఫ్‌లో ఖననం చేయబడ్డాయి. అతని అకాల మరణం న్యూ జర్మన్ సినిమా టైమ్‌ఫ్రేమ్ ముగింపుగా పరిగణించబడుతోంది.

మూలాలు మార్చు

  1. "Where to begin with Rainer Werner Fassbinder". British Film Institute. Retrieved 2023-05-31.
  2. "Rainer Werner Fassbinder". Turner Classic Movies. Retrieved 2023-05-31.
  3. 3.0 3.1 3.2 "Rainer Werner Fassbinder: Eine Spurensuche in München zum 40. Todestag".
  4. Rainer Werner FASSBINDER - Der Rastlose :Deutsche Lebensläufe (TV) 📽2K (in ఇంగ్లీష్), retrieved 2023-05-31
  5. (Hayman 1984)
  6. (Thomsen 2004)

బయటి లింకులు మార్చు