రైవస్ కెనాల్, కృష్ణా నది నుండి ఉద్భవించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం గుండా ప్రవహిస్తుంది.[1][2] కృష్ణ తూర్పు కాలువ వ్యవస్థలో, మూడు గురుత్వాకర్షణ కాలువలు (గ్రావిటీ కేనాల్స్) ; అనగా ఏలూరు కాలువ, రైవస్ కెనాల్, బందరు (మచిలీపట్నం) కాలువలు ఉన్నాయి. ముఖ్యంగా నీటిపారుదల, నావిగేషన్ ప్రయోజనాల కొరకు ఇవి బ్రిటీష్ సమయంలో తవ్వబడ్డాయి. రైవస్ కెనాల్ 57.70 కి.మీ పొడవుతో, 1,75,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో, 4250 క్యూసెక్కుల నీరు విడుదలతో రూపకల్పన చేయడం జరిగింది.[3][4]

రైవస్ కెనాల్
దెందులూరు గ్రామ సమీపంలో ఏలూరు కాలువ
విశేషాలు
స్థితిఓపెన్
భౌగోళికం
ఇది దేనికి శాఖకృష్ణా ఎడమ గట్టు కాలువ

చరిత్ర

మార్చు

1833 లో కృష్ణా జిల్లాలో 40% జనాభా తుడిచిపెట్టిన ఘోరమైన కరువు సంభవించింది. 1852-55 సమయంలో 5.80 లక్షల ఎకరాలకు రూ. 0.772 లక్షల ఖర్చుతో సాగు చేయటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్న ప్రభుత్వం ఒక ఆనకట్టను, కాలువ వ్యవస్థను నిర్మించింది. ఆనకట్ట ప్రతిపాదన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా సూత్రీకరించబడింది, కెప్టెన్ చార్లెస్ ఓర్‌చే నిర్వహించబడింది. ఈ ఆనకట్ట సుమారు 100 సంవత్సరాలు పనిచేసిన పిదప దీనికి సెప్టెంబరు 1952 లో ఒక పెద్ద ఉపద్రవం ఏర్పడింది. దెబ్బతిన్న, కోతకు గురైన కృష్ణా అనకట్ట స్థానంలో కొత్తగా ప్రకాశం బ్యారేజీ 1952-77 సమయంలో నిర్మించబడింది.

కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో పనిచేసిన ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయిన కెప్టెన్ జోసెఫ్ గోరే రైవ్స్ పేరుతో రైవస్ కెనాల్ అని ఈ కెనాల్ పేరు పెట్టారు.[5] కేరళలో ముళ్ళపెరియార్ డ్యామ్ నిర్మాణంతో అతను ప్రసిద్ధి చెందాడు. మొదట్లో రైవస్ కాలువ ఏలూరు కాలువ దగ్గర 7 వ మైలు నుండి ప్రారంభమైంది. తరువాతి కాలంలో డ్యాం దగ్గర ఉన్న ప్రధాన కాలువ నుండి మొదలయ్యింది.[2]

సాంకేతిక వివరాలు

మార్చు

కృష్ణ తూర్పు కాలువ వ్యవస్థలో, మూడు గురుత్వాకర్షణ కాలువలు (గ్రావిటీ కేనాల్స్) ; అనగా ఏలూరు కాలువ, రైవస్ కెనాల్, బందరు (మచిలీపట్నం) కాలువలు ఉన్నాయి. ముఖ్యంగా నీటిపారుదల, నావిగేషన్ ప్రయోజనాల కొరకు ఇవి బ్రిటీష్ సమయములో తవ్వబడ్డాయి. రైవస్ కెనాల్ 57.70 కి.మీ పొడవుతో, 1,75,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో, 4250 క్యూసెక్కుల నీరు విడుదలతో రూపకల్పన చేయడం జరిగింది.[3][4]

మూలాలు

మార్చు
  1. "Veerapandian discusses canals beautification with GIIC team". The Hindu (in Indian English). 25 March 2016. Retrieved 30 June 2016.
  2. 2.0 2.1 A Manual of the Kistna District, in the Presidency of Madras: Compiled for the Government of Madras (in ఇంగ్లీష్). Lawrence Asylum Press. 1883. p. 262. Retrieved 30 June 2016.
  3. 3.0 3.1 "Vijayawada Through the ages". Retrieved 2016-09-09.
  4. 4.0 4.1 "PRAKASAM BARRAGE". irrigationap.cgg.gov.in. Archived from the original on 2016-08-25. Retrieved 2016-09-09.
  5. "Page 154 - LIST OF INSCRIPTIONS ON TOMBS OR MONUMENTS IN MADRAS VOLUME I". www.e-books-chennaimuseum.tn.gov.in. Archived from the original on 2016-09-17. Retrieved 2016-09-09.

వెలుపలి లంకెలు

మార్చు