ఇండియన్ రోప్ ట్రిక్

(రోప్ ట్రిక్ ఇంద్ర జాలం. నుండి దారిమార్పు చెందింది)

ఒక మైదానంలో గారడి ప్రదర్శనం జరుగుతూ ఉంది. ప్రదర్శనలిస్తున్న సోదరులిద్దరిలో ఒకడు అందరిముందూ నిలబడి ఒక పొడుగైన రోప్ అంటే త్రాడును పరీక్ష కోసం ప్రేక్షకుల కిచ్చి, తరువాత దానిని గాలిలోకి వైకి విసిరాడు. అంతే మరుక్షణం ఆ త్రాడు ఒక కర్రలాగ దృఢంగా నిలబడి పోయింది. అప్పుడు అతని సోదరుడు, ఆ కర్ర లాంటి త్రాడును ఆధారంగా చేసుకుని పైకి పాకుకుంటూ వెళ్ళి అందరూ చూస్తూవుండగా అంతర్ధాన మయ్యాడు. ఈ ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులకు అది కలా నిజమా అన్నంత సందేహం కలిగింది. ఇంతలో త్రాడు క్రింద పడింది. మొదటి సోదరుడు, నా తమ్ముడేడీ? నాతమ్ముడేడీ అంటూ గట్టిగా అరవటం మొదలు పెడ్తాడు. రెండు నిముషాల అనంతరం రెండవ సోదరుడు దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు.

Advertisement for a reproduction of the trick by stage magician Howard Thurston.

ఇది కల్పించిన సంఘటన కానే కాదనీ, బి.వి.పట్టాభిరాం తెలియచేస్తున్నాడు. కృష్ణానదీ ప్రాంతంలో నివసించే విప్రవినోదులు - బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక అద్భుత కార్యం ఇది. ఆ కాలంలో ఈ ఫీట్ ను వారు మాత్రమే దేశం నలుమూలలా ప్రదర్శించేవారు. ఆ కాలంలో మన దేశానికి విచ్చేసిన విదేశీయులెందరో ఈ అద్భుతమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంసించారు. విదేశాలలోని వార్తాపత్రికలు దీనికి బహుళ ప్రచారం ఇచ్చాయి.

ప్రశంసలు

మార్చు

భారతీయ ఇంద్రజాల విద్యలో ఒకప్పుడు ప్రాముఖ్యం వహించిన రోప్ ట్రిక్ గురించి ఒక వ్వాఖ్యానం చేస్తూ ప్రముఖ లండన్ ఇంద్రజాలికుడు పాల్ డేనియల్ ఈ ఇండియన్ రోప్ ట్రిక్ ను ఏ భారతీయ ఇంద్ర జాలికుడూ ఇప్పుడు ప్రదర్శించడం లేదనీ ఆ కళ అంతరించిందని, తను వ్రాసిన మేన్ విత్ అండ్ మ్యాజిక్ పుస్తకంలో ప్రకటించాడు. ఇటీవల కాలంలో ఇండియా వారు తమ అద్భుతమైన ఆ కళను ప్రదర్శించ లేక పోవడానికి కారణం కూడా పాల్ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

ప్రదర్శన

మార్చు

ఈ ఇండియన్ రోఫ్ ట్రిక్ ఒక పెద్ద ఆరుబయలు రంగస్థలంలో ప్రదర్శిస్తారని, అప్పుడు చెట్లతో నిండియున్న ఆ ప్రదర్శనలో ఇంద్రజాలికుడు ప్రదర్శనకు ముందు రోజు రాత్రి రెండు చెట్లకు ఒక దృఢమైన త్రాడును బిగించి ఉంచుతాడని, ప్రదర్శన సమయంలో తన చేతిలో వున్న త్రాడును పట్టుకునే విధంగా విసురుతాడు. అప్పుడు ఆ త్రాడు నిలబడి ఉన్నట్లుగా ఉన్న తరువాత తన తోటి ఇంద్ర జాలికుని దానిపైకి ఎక్కి వెళ్ళమంటాడు. అప్పుడు ఆ రెండవ అతను ఎక్కి వెళ్ళి మాయమై పోతాడు. నిజానికి అతను మాయమై పోవటం జరగదు. చెట్ల గుబురుల్లో నుంచి క్రిందికి దిగి వస్తాడు. ఇదే ఆ ట్రిక్.

రానురాను ఈ ప్రాచీన కళ క్షీణించి పోయింది. ఆదరణ లేక పోవటం వల్ల వంశ పారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని అభ్యసించడానికి వారి సంతతి ఇష్టపడక పోవటం వలన ఈ కళ దాదాపు అంతరించి పోయింది. పందొమ్మిదవ శతాబ్దాంతానికి మన దేశంలో రోప్ ట్రిక్ చేసేవారు లేకుండా పోయారు.

సూచికలు

మార్చు
  • Mike Dash, Borderlands: The Ultimate Exploration of the Unknown; Overlook Press, 2000; ISBN 0-87951-724-7
  • Wiseman, R. & Lamont, P., Unravelling the rope trick. Nature, 383 (1996), 212-13.
  • Lamont, P. & Wiseman, R. The rise and fall of the Indian rope trick. Journal of the Society for Psychical Research, 65 (2001), 175-93.
  • Peter Lamont , The Rise of the Indian Rope Trick: How a Spectacular Hoax Became a History, 2005; ISBN 1-56025-661-3.
  • Dr. Karl Shuker, The Unexplained: An Illustrated Guide To The World’s Natural And Paranormal Mysteries (Carlton: London, 1996; ISBN 1-85868-186-3).

ఇవి కూడా చూడండి

మార్చు