రోవాన్ మిల్‌బర్న్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

రోవాన్ క్లైర్ మిల్‌బర్న్ (జననం 1977, జూన్ 18) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

రోవాన్ మిల్‌బర్న్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోవాన్ క్లైర్ మిల్‌బర్న్
పుట్టిన తేదీ (1977-06-18) 1977 జూన్ 18 (వయసు 46)
మోస్గిల్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
బంధువులుబారీ మిల్‌బర్న్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి వన్‌డే (క్యాప్ 54/105)2000 నవంబరు 30 
నెదర్లాండ్స్ - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2007 ఆగస్టు 30 
న్యూజీలాండ్ - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 22)2007 ఆగస్టు 10 
న్యూజీలాండ్ - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2007 ఆగస్టు 16 
న్యూజీలాండ్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2001/02ఒటాగో స్పార్క్స్
2002/03–2008/09కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 15 2 128 11
చేసిన పరుగులు 237 1 1,586 41
బ్యాటింగు సగటు 18.23 17.05 20.50
100లు/50లు 0/1 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 71 1* 82 13*
క్యాచ్‌లు/స్టంపింగులు 7/5 0/1 85/42 6/5
మూలం: CricketArchive, 18 April 2021

క్రికెట్ రంగం మార్చు

2000లో నెదర్లాండ్స్ తరపున 7 వన్డే ఇంటర్నేషనల్స్‌లో, 2007లో న్యూజిలాండ్ తరపున 8 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. న్యూజీలాండ్‌లోని ఒటాగో, కాంటర్‌బరీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

డచ్ దేశీయ పోటీలో ఆడుతున్నప్పుడు, న్యూజీలాండ్‌లో జరిగిన 2000 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ తరపున ఆడేందుకు ఎంపికైంది. ఐర్లాండ్‌పై 71 పరుగులు చేసినప్పుడు టోర్నమెంట్‌లో జట్టు ఏకైక అర్ధ సెంచరీని చేసింది.[3]

పాఠశాల ఉపాధ్యాయురాలిగా మారింది. తిమారులోని మౌంటైన్‌వ్యూ హైస్కూల్‌కి అసిస్టెంట్ ప్రిన్సిపాల్,[4] 2022 నాటికి క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ కాలేజీకి ప్రిన్సిపాల్.[5]

న్యూజీలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ బారీ మిల్బర్న్ కుమార్తె, వికెట్ కీపర్ కూడా.[2]

మూలాలు మార్చు

  1. "Player Profile: Rowan Milburn". ESPNcricinfo. Retrieved 18 April 2021.
  2. 2.0 2.1 "Player Profile: Rowan Milburn". CricketArchive. Retrieved 18 April 2021.
  3. Steve Whiting, "Cricinfo Women's World Cup, 2000-01", Wisden 2002, pp. 1306–10.
  4. McMurran, Alistair (1 April 2013). "Cricket: Keeper's advice - keep up your batting". Otago Daily Times. Retrieved 16 September 2021.
  5. "Our Staff". Hagley College. Retrieved 27 June 2022.

బాహ్య లింకులు మార్చు