రోషిణి ప్రకాష్

దక్షిణ భారత చలనచిత్ర నటి, మోడల్.

రోషిణి ప్రకాష్ దక్షిణ భారత చలనచిత్ర నటి, మోడల్. 2016లో వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.[1]

రోషిణి ప్రకాష్
రోషిణి ప్రకాష్ (2018)
జననంసెప్టెంబరు 23, 1993
మైసూర్, కర్ణాటక, భారతదేశం
వృత్తిచలనచిత్ర నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం

మార్చు

రోషిణి 1993, సెప్టెంబరు 23న కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ప్రకాష్ వ్యాపారస్తుడు. మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది.

సినిమారంగం

మార్చు

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రోషిణి 2016లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీలో ఫైనల్‌కు చేరింది.[2] రోషిణి తొలిచిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016).[3] ఆ తరువాత టైగర్ గల్లి (2017), ఎమాలి (2018), కవలుదారి (2019)[4] వంటి చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్ర భాష గమనికలు
2016 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ పూర్ణిమ తెలుగు
2017 అజరామర అంబుజ (అమ్ము) కన్నడ
టైగర్ గల్లీ మీరా సేన్
2018 యేమాలి దివ్య తమిళం
2019 కావలుదారి ప్రియా కన్నడ
జాడా తమిళం
2020 47 డేస్[5][6] పద్దు తెలుగు Zee5 విడుదలైంది
2021 11th అవర్ రాగిణి వెబ్ సిరీస్; ఆహా న విడుదలైంది
బయ్ 1 గెట్ 1 ఫ్రీ కన్నడ
2022 లక్కీ మ్యాన్ మీరా
2023 గాందీవధారి అర్జునుడు తెలుగు
వనంగాన్ తమిళం

మూలాలు

మార్చు
  1. Jonnalagedda, Pranita (4 October 2016). "Mana 'Mini Brahmanandam', Saptagiri, hero ayipoyadochh!". The Times of India. Archived from the original on 10 January 2019. Retrieved 7 January 2020.
  2. The New Indian Express, Entertainment. "Roshini Prakash's innocence wins her lead role in Kavalu Daari". A Sharadhaa. Archived from the original on 10 November 2019. Retrieved 7 January 2020.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
  4. Deccan Herald, Metro Life (5 October 2018). "Roshni plays strong role in 'Kavaludaari'". Tini Sara Anien. Retrieved 7 January 2020.
  5. ప్రజాశక్తి, మూవీ (18 April 2019). "బాలచందర్‌ '47 డేస్‌' గుర్తుకొచ్చింది - తమ్మారెడ్డి భరద్వాజ". Retrieved 7 January 2020.
  6. సాక్షి, సినిమా (19 April 2019). "47 రోజుల సస్పెన్స్‌". Archived from the original on 7 January 2020. Retrieved 7 January 2020.

ఇతర లంకెలు

మార్చు