47 డేస్ (2020 సినిమా)

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు సినిమా

47 డేస్, 2020 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానరులో విజయ్ డొంకాడ, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, దబ్బార శశి భూషణ్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. ఇందులో సత్యదేవ్ కంచరాన, పూజ ఝవేరి నటించగా, రఘు కుంచె సంగీతం అందించాడు.[1][2]

47 డేస్
47 డేస్ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రదీప్ మద్దాలి
నిర్మాత
  • విజయ్ డొంకాడ
  • రఘు కుంచె
  • శ్రీధర్ మక్కువ
  • దబ్బార శశి భూషణ్ నాయుడు
తారాగణం
ఛాయాగ్రహణంజికె
కూర్పుఎస్ఆర్ శేఖర్
సంగీతంరఘు కుంచె
నిర్మాణ
సంస్థ
టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీs
30 జూన్, 2020
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

ఏసిపి సత్యదేవ్, భార్య పద్దు మరణిస్తుంది. తన భార్య మరణానికి కారణమైన కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, సత్యదేవ్ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి, తన భార్య మరణానికి కారణం తెలుసుకున్నాడా, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

నిర్మాణం మార్చు

పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్ మద్దాలి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2017లో రోగ్ సినిమా షూటింగ్ లో సత్యదేవ్ ను కలిశాడు. 2011లో ప్రదీఫ్ తీసిన జూలియట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది, 2018లో సినిమా షూటింగ్ ప్రారంభించబడింది. ఈ సినిమాలో ఏసిపి పాత్ర పోషించడానికి సత్యదేవ్ సంతకం చేశాడు. ఈ సినిమా నిర్మాతలు 47 డేస్ అనే పేరు కోసం 1981లో చిరంజీవి నటించిన 47 రోజులు సినిమా నుండి అనుమతి పొందారు. కరోనా వైరస్ 2019 కారణంగా విడుదల ఆలస్యమై 2020, జూన్ 30న జీ5లో విడుదలైంది.[3][4]

సంగీతం మార్చు

ఈ సినిమాలోని పాటలను రఘు కుంచె స్వరపరిచాడు. 2018 వాలెంటైన్స్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్, "క్యా కరూన్" అనే పాటను విడుదల చేశాడు. లక్ష్మీభూపాల్ రాసిన ఈ పాటలను నీహా కడివేటి పాడింది. [4]

స్పందన మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన నీషితా న్యాపతి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది.[5] "సత్యదేవ్ నటన కోసం ఈ సినిమా చూడవచ్చు" అని ది హిందూకు చెందిన సంగీత దేవి దుండూ రాసింది.[6]

మూలాలు మార్చు

  1. "First look motion poster of Satya Dev, Pooja Jhaveri and Pradeep Maddali's '47 Days' released - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
  2. "I'm glad the audience finally gets to watch 47 Days: Pradeep Maddali - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
  3. "Satyadev's mystery thriller 47 Days to have a direct-OTT release - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
  4. 4.0 4.1 "'47 Days – The Mystery Unfolds' scheduled for summer release - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
  5. Nyayapati, Neeshita (30 June 2020). "47 Days Movie Review: A missed opportunity!". Times of India. Retrieved 2021-02-16.
  6. Dundoo, Sangeetha Devi (2020-06-30). "'47 Days' movie review: Barring Satyadev's performance, there's nothing to root for". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-16.

బయటి లింకులు మార్చు